BigTV English
Advertisement

OTT Movie: కూతురి బాయ్ ఫ్రెండ్ పై కన్నేసిన కసాయి తల్లి … కోరిక కోసం కన్నింగ్ ప్లాన్ … చూసి తట్టుకోవడం కష్టమే…

OTT Movie: కూతురి బాయ్ ఫ్రెండ్ పై కన్నేసిన కసాయి తల్లి … కోరిక కోసం కన్నింగ్ ప్లాన్ … చూసి తట్టుకోవడం కష్టమే…

OTT Movie : ఒంటరితనం, ప్రేమ, ద్రోహం వంటి థీమ్స్ ను విధ్వంసకరంగా చూపించే ఒక మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీని అద్భుతమైన సినిమాటోగ్రఫీ, తక్కువ డైలాగ్‌తో ఈ సినిమా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. తల్లీ, కూతుర్ల మధ్య జరిగే సన్నివేశాలు చూపు తిప్పుకోకుండా చేస్తాయి. ఈ స్టోరీ ఆర్కిటిక్ టండ్రాలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో జరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ బ్రిటిష్-ఫ్రెంచ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫార్ నార్త్’ (Far North). 2007లో విడుదలైన ఈ సినిమాకి అసిఫ్ కపాడియా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సారా మైట్‌ల్యాండ్ రాసిన “ట్రూ నార్త్” అనే చిన్న కథ ఆధారంగా రూపొందింది. ఇందులో మిచెల్ యో (సైవాగా), మిచెల్ క్రుసియెక్ (అంజాగా), సీన్ బీన్ (లోకీగా) నటించారు.  89 నిమిషాల నిడివి గల ఈ చిత్రం 2007లో వెనిస్ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. ఈ సినిమా IMDbలో 6.1/10, Rotten Tomatoesలో 80% రేటింగ్‌ను పొందింది. మిచెల్ యో నటన, అద్భుతమైన ఆర్కిటిక్ దృశ్యాల కోసం ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ ఆర్కిటిక్ టండ్రాలో జరుగుతుంది. సైవా (మిచెల్ యో) అనే మహిళ పుట్టినప్పుడే ఒక జ్యోతిస్యుడు ఆమె గురించి ఒక రహస్యం చెప్తాడు. ఆమె జాతకం ప్రకారం తన దగ్గరకు వచ్చే ఎవరికైనా హాని కలిగిస్తుందని చెబుతాడు. ఇక పెద్దగా అవుతున్న సమయంలో ఆమె తో సన్నిహితంగా ఉన్నవాళ్లు చనిపోతుంటారు. ఇక ఆమెను తన రెయిన్‌డీర్ హెర్డర్స్ తెగ బహిష్కరిస్తుంది. ఈ క్రమంలో ఆమె అంజా (మిచెల్ క్రుసియెక్) అనే యువతిని దత్తత తీసుకుని, ఆమెను పెంచుతూ ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. ఇద్దరూ ఒక నిర్జనమైన ప్రాంతంలో గుడారాలలో నివసిస్తూ, చిన్న జంతువులను వేటాడి, చేపలు పట్టి జీవిస్తుంటారు. ఆ ప్రాంతంలో ఎల్లప్పుడూ ఒక సైన్యం పహారా కాస్తుంటుంది. ఈ సైన్యం సైవా కుటుంబాన్ని, గ్రామాన్ని ధ్వంసం చేసిందని ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా బయటికి వస్తుంది. సైవా గతంలో ఈ సైనికులచే అఘాయిత్యానికి గురై, తానూ ప్రేమించిన ఐవర్‌ అనే వ్యక్తిని కోల్పోయింది.

ఒక రోజు, సైవా మంచులో గాయపడి, చనిపోతున్న లోకీ (సీన్ బీన్) అనే అపరిచితుడిని కనుగొంటుంది. ఆమె గత గాయాలు, అపరిచితుల పట్ల భయం ఉన్నప్పటికీ, ఆమె అతన్ని రక్షించి, వారి గుడారానికి తీసుకొస్తుంది. సైవా, అంజా కలిసి లోకీని కోలుకునే విధంగా చేస్తారు. లోకీ ఒక సైనికుడు, రష్యన్ సైనికుల నుండి తప్పించుకున్నాడని చెబుతాడు. వారు ఈ ప్రాంతంలో దొరికిన వాళ్ళని బానిసలను చేస్తున్నారని పేర్కొంటాడు. అతను కోలుకున్న తర్వాత లోకీ అంజా మధ్య ఒక సంబంధం మొదలవుతుంది. అతని వాళ్ళ అంజా ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. ఇది ఒంటరితనంతో ఉన్న సైవాకి అసూయను రేకెత్తిస్తుంది. సైవా, లోకీ పట్ల తన లోలోపల ఇష్టాన్ని పెంచుని ఉంటుంది. ఇప్పుడు కథ ఒక షాకింగ్ ట్విస్ట్‌తో క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. సైవా ఆ సైనికున్ని పొందడానికి ఏం చేస్తుంది. ఇద్దరూ కలసి ఒక్కడితోనే ఉంటారా ? ఆమెకు జాతకం ప్రకారం వీళ్ళు కూడా చనిపోతారా ? క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : కొడుకు ముందే తల్లితో ఆ పాడు పని… వాడిచ్చే షాక్ కు ఫ్యూజులు అవుట్… యాక్షన్ ప్రియులు మస్ట్ వాచ్

Related News

Jio Hotstar : జియో హాట్ స్టార్ లో ట్రెండింగ్ మూవీస్.. టాప్ 5 సినిమాలు ఇవే..

OTT Movie : కంటికి కన్పించని అమ్మాయితో ఆ పని… ఇంత ఓపెన్ గా ఎలారా అయ్యా ? ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్

OTT Movie : అమ్మాయిలను చంపే సైకో … బ్లైండ్ లేడీ ఇన్వెస్టిగేషన్ … మిస్ అవ్వకుండా చూడాల్సిన తమిళ్ థ్రిల్లర్

OTT Movie : 8000 లీటర్ల బ్లడీ బ్లడ్ బాత్… బ్రూటల్ క్లైమాక్స్ మావా… గుండె ధైర్యం ఉంటేనే ఈ హర్రర్ మూవీని చూడండి

OTT Movie : 43 అవార్డులను గెలుచుకున్న సిరీస్… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులు… తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie : నెట్ ఫ్లిక్స్ లో ఉన్న తోపు కే-డ్రామాలు… IMDb లో 8.5 కంటే ఎక్కువ రేటింగ్‌… ఇందులో మీరెన్ని చూశారు ?

OTT Movie : తండ్రి కళ్ళముందే పక్కింటోడితో ఆ పని… చదువుకోవాల్సిన వయసులో ఇదేం పాడు పని పాపా?

OTT Movie : ఓటీటీలో గత్తర లేపుతున్న 1 గంట 52 నిమిషాల థ్రిల్లర్ డ్రామా… క్షణక్షణం ఉత్కంఠ… IMDb లో 7.1 రేటింగ్

Big Stories

×