Hyderabad News: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఆదివారం రాత్రి బోనాల జాతరలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో పార్టీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఆదివారం రాత్రి బోనాల జాతరలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తార్నాక్‌లోని మాణికేశ్వర్ నగర్‌లో ఫలహారం బండిని రాత్రి ఊరేగిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ వాహనంపైకి ఒక్కసారిగా దాదాపు 50 మంది యువకులు దూసుకొచ్చారు. ఆపై దాడికి యత్నించారు. అడ్డు వచ్చిన గణేష్ గన్‌మేన్లపై దాడికి చేసే ప్లాన్ చేశారు.
వారి చేతుల్లో గన్స్ లాక్కొనేందుకు ప్రయత్నం చేశారు. పరిస్థితి గమనించిన ఎమ్మెల్యే శ్రీగణేష్, కారులో నుంచి బయటకు రాలేదు. వెంటనే గన్‌మెన్లు ఎమ్మెల్యే కారును పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాలని ఆ డ్రైవర్‌కు సంకేతాలు ఇచ్చారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఓయూ పోలీసులకు ఎమ్మెల్యే స్వయంగా ఫిర్యాదు చేశారు.
ఈ తతంగమంతా ఉస్మానియా యూనివర్సిటీకి కేవలం 250 మీటర్లలో చోటు చేసుకుంది. మాణికేశ్వర్ నగర్‌లో బోనాల జాతరకు వెళ్తున్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్. ఆ సమయంలో తన కాన్వాయ్‌ను అడ్డుకుని తనపై దాడి చేసి చంపాలని చూశారని ఫిర్యాదులో ప్రస్తావించారు.
ALSO READ: తెలంగాణలో అద్భుతమైన క్రికెట్ స్టేడియం.. సీఎం కూడా గ్రీన్ సిగ్నల్
ఈ ఘటనపై కేసు నమోదు చేశారు ఓయూ పీఎస్ పోలీసులు. రంగంలోకి దిగిన పోలీసులు, ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. దాడికి యత్నించిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు.
ఇంతకీ దాడికి యత్నించినవారు ఎవరు? ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రత్యర్థుల పనా? లేకుంటే పాత ప్రత్యర్థులు ఈ పని చేశారా? ఇలా రకరకాలుగా చర్చించుకోవడం ఎమ్మెల్యే అనుచరుల వంతైంది. ఈ వ్యవహారంలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై దాడికి యత్నించినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. ఎమ్మెల్యే బోనాల వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తుండగా ఘటన జరిగిందన్నారు. మొత్తం ఆరు వాహనాలలో 12 మంది ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. యువకుల వాహనాలకు సైడ్ ఇవ్వకపోవడమే వాగ్వాదానికి కారణమని అంటున్నారు. సీసీటీవీ కెమెరా దృశ్యాల బట్టి యువకులు అడిక్‌మెట్ వైపు వెళ్లినట్లు గుర్తించామని చెప్పారు.
దాడిపై ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్ https://t.co/X8Su6C9ZLm pic.twitter.com/LkVy6ETkrs
— BIG TV Breaking News (@bigtvtelugu) July 20, 2025