Farzi 2 on OTT : ప్రస్తుతం ఓటీటీలలో వెబ్ సిరీస్ ల హవా ఎక్కువైంది. మొదటి సీజన్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది అంటే చాలు మేకర్స్ మరో సీక్వెల్ తో ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. అందుకే మోస్ట్ అవైటింగ్ సీక్వెల్స్ లిస్ట్ ఎక్కువ అవుతోంది. తాజాగా ఆ లిస్ట్ లో ఉన్న సిరీస్ ‘ఫర్జీ సీజన్ 2’ అప్డేట్ వచ్చింది. మరి ఆ అప్డేట్ ఏంటి? ఎప్పుడు విడుదల అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
మూడు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సూపర్‌హిట్ అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ ‘ఫర్జీ సీజన్ 2’పై ఎట్టకేలకు అఫిషియల్ అప్డేట్ వచ్చింది. 2023లో వచ్చిన మొదటి సీజన్ విడుదలై మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ సిరీస్ మేకర్స్ రాజ్ నిడిమోరు – కృష్ణ డికె రెండవ సీజన్ గురించి అప్డేట్ ను ఇచ్చారు. ఈ ప్రకటన ‘ఫర్జీ’ అభిమానులలో భారీ బజ్ సృష్టించింది. షాహిద్ కపూర్ సన్నీ అకా మాస్టర్ ‘ఫేకర్’ గా తన బ్రేక్అవుట్ ఓటీటీ పాత్రను తిరిగి పోషించబోతున్నాడు. నిర్మాతలు హై ఆక్టేన్ నకిలీల రెండవ బ్యాచ్‌ను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మాణ సన్నాహాలు,
ఫిబ్రవరి 10న రాజ్ అండ్ డికె ‘ఫర్జీ’ మూడవ వార్షికోత్సవం సందర్భంగా సీజన్ 2 ప్రోగ్రెస్ లో ఉందని అఫిషియల్ గా కన్ఫామ్ చేశారు. దర్శక ద్వయం ‘నకిలీ కరెన్సీని గుట్టలుగా పేర్చిన పిక్ ను పంచుకున్నారు. దానిపై “రౌండ్ 2 ప్రోగ్రెస్ లో ఉంది” అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌తో పాటు #Farzi అనే హ్యాష్‌ట్యాగ్, “సెకండ్ బ్యాచ్ #WIP” అనే టెక్స్ట్ ఉన్నాయి. మొదటి సీజన్ విడుదలై మూడేళ్లు గడిచినా ఇంకా రెండవ సీజన్ రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో #FarziSeason2 ట్రెండ్ అయింది.
2023లో ‘ఫర్జీ’తో డిజిటల్ అరంగేట్రం చేశారు షాహిద్ కపూర్. తాజాగా ఆయన రాజ్ అండ్ డికెలతో ఉన్న ఫోటోను షేర్ చేసి “ది ఫేకర్స్ తిరిగి వచ్చారు” అని క్యాప్షన్ ఇచ్చారు. మొదటి సీజన్‌లో సన్నీ పాత్ర షాహిద్ కెరీర్‌లో బ్రేక్‌థ్రూ అయింది. అతను నకిలీ నోట్లు తయారు చేసే కళాకారుడిగా, నేరాల ప్రపంచంలో చిక్కుకున్న యువకుడిగా అద్భుతంగా నటించాడు. సీజన్ 2లో సన్నీ ప్రయాణం మరింత వినోదాత్మకంగా ఉంటుందని ఆశిస్తున్నారు.
Also Read : టైమ్ లూప్ లో ఇరుక్కుపోయే కిల్లర్… అమ్మాయిలతో అదే పని… ఒళ్లు గగుర్పొడిచే క్లైమాక్స్
“ఫర్జీ” మొదటి సీజన్ 2023 ఫిబ్రవరి 10న విడుదలై, ఉత్కంఠభరితమైన కథతో అత్యధికంగా వీక్షించబడిన హిందీ వెబ్ సిరీస్ గా నిలిచింది. మొదటి సంవత్సరంలోనే 37.1 మిలియన్ల మంది వీక్షకులను సంపాదించుకుంది. ఈ సిరీస్ సన్నీ అనే ప్రతిభావంతుడైన కళాకారుడి కథ. అతను తన తాత ప్రింటింగ్ ప్రెస్‌ను కాపాడటానికి నకిలీ డబ్బు తయారు చేయడం మొదలు పెడతాడు. కానీ అదే అతను చేసిన తప్పు అవుతుంది. ఆ తరువాత డేంజర్ లో పడతాడు. సిరీస్‌లో విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, భువన్ అరోరా వంటి నటీనటులు కూడా నటించారు. కాగా సీజన్ 2 నిర్మాణ సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. 2026 మధ్యలో షూటింగ్ మొదలవుతుందని, 2027లో విడుదల కావచ్చు అని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు. సీజన్ 2లో సన్నీ పాత్ర మరింత కాంప్లెక్స్ అవుతుందని, నకిలీల ప్రపంచంలో మరిన్ని ట్విస్ట్‌లు ఉంటాయని భావిస్తున్నారు. ‘ఫర్జీ’ మొదటి సీజన్ OTTలో అత్యధిక వ్యూస్ పొందిన సిరీస్‌లలో ఒకటి కావడం వల్ల సీజన్ 2పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.