E-Paper
Advertisement

Drug Bust: ఒడిశా పెడ్లర్ల అరెస్ట్.. 70కిలోల గంజాయి సీజ్!

Drug Bust: ఒడిశా పెడ్లర్ల అరెస్ట్.. 70కిలోల గంజాయి సీజ్!
Advertisement

Drug Bust:  పక్కాగా సేకరించిన సమాచారం ప్రకారం వెస్ట్​ జోన్​ టాస్క్​ ఫోర్స్​ అధికారులు సంజీవరెడ్డినగర్ పోలీసులతో కలిసి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు పెడ్లర్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 35లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ మహ్మద్​ ఇక్భాల్​ సిద్దిఖీ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన సునీల్ దలబెహరా (30) రైతు. తేలికగా డబ్బు సంపాదించేందుకుగాను కొంతకాలంగా గంజాయి సాగు చేస్తున్నాడు.

Also ReadHydra: రూ. 1003 కోట్ల విలువైన‌ సర్కారు భూమిని కాపాడిన హైడ్రా!

ఇద్దరిని అరెస్ట్

Advertisement

అదే రాష్ట్రానికి చెంది ప్రస్తుతం మేడ్చల్​ లో ఉంటూ ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తున్న ఇస్మాయిల్​ రైతా (46)తో అతనికి బంధుత్వం ఉంది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి హైదరాబాద్ లో గంజాయి అమ్మాలని నిర్ణయించుకున్నారు. దాని ప్రకారం 70కిలోల గంజాయిని హైదరాబాద్ తీసుకొచ్చారు. దానిని ధూల్ పేటలోని లోకల్ పెడ్లర్లతోపాటు గంజాయి అలవాటు పడ్డవారికి అమ్మాలనుకున్నారు. ఈ మేరకు సమాచారం అందటంతో టాస్క్​ ఫోర్స్​ సీఐ చౌదరి యదేంధర్, ఎస్​ఐ రవిరాజ్​ తోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం సంజీవరెడ్డినగర్​ పోలీసులకు అప్పగించారు.

Also Read: Tandur Politics: తాండూరు​ చైర్మన్​ ఎవరికి దక్కుతుందో? మాటల తూటాలతో రచ్చకెక్కుతున్న నేతలు!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×