E-Paper
Advertisement

ఫేక్ నోట్ల యాపారం… ప్రింటింగ్ ప్రెస్ పేరుతో వీళ్ళు చేసే పని చూస్తే బుర్రపాడు

ఫేక్ నోట్ల యాపారం… ప్రింటింగ్ ప్రెస్ పేరుతో వీళ్ళు చేసే పని చూస్తే బుర్రపాడు

Farzi OTT : ఓటీటీలో లక్షలాది సిరీస్‌ లు ఉన్నా, ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే మొత్తం సీజన్ అయిపోయే దాకా చూపు పక్కకు తిప్పుకోకుండా చేసే సిరీస్‌లు చాలా అరుదు. అలాంటి ఒక సూపర్ హిట్ సిరీస్ “ఫర్జీ” (Farzi). షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన ఈ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ 2023లో ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో విడుదలై, నేటికీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తోంది. IMDbలో 8.4 రేటింగ్‌తో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ సిరీస్‌ల్లో ఒకటిగా నిలిచిన ఈ సిరీస్ కథపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

సన్నీ (షాహిద్ కపూర్) ఒక ఆర్టిస్ట్. చిన్నప్పటి నుంచి ఆర్ట్ పట్ల మక్కువ ఉన్న అతను ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయి ఉంటాడు. అతని తాతగారి పాత ప్రింటింగ్ ప్రెస్‌ ను కాపాడాలనే ఆశతో అతను ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. నకిలీ కరెన్సీ ముద్రణ పని ప్రారంభించడం షురూ చేస్తారు. మొదట్లో చిన్న స్థాయిలో మొదలు పెట్టిన ఈ దందా నెమ్మదిగా పెద్ద స్కేల్‌ కు చేరుకుంటుంది. సన్నీ తన స్నేహితులు, బంధువుల సహాయంతో ఈ నకిలీ నోట్లను మార్కెట్‌ లోకి పంపిణీ చేయడం మొదలు పెడతాడు. ఇక్కడే కథలో ట్విస్టులు ప్రారంభమవుతాయి.

ఈ నకిలీ కరెన్సీ దందాను పట్టుకోవడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారి మైఖేల్ (విజయ్ సేతుపతి) రంగంలోకి దిగుతాడు. మైఖేల్ చాలా తెలివైన, కఠినమైన, కామెడీ టైమింగ్ ఉన్న అధికారి. సన్నీ – మైఖేల్ మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ గేమ్ ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ. సన్నీ ఒకవైపు తన ఆర్ట్ స్కిల్స్‌ను ఉపయోగించి మరింత మెరుగైన నకిలీ నోట్లు తయారు చేయడానికి ప్రయత్నిస్తాడు. మరోవైపు మైఖేల్ అతని వెనకాలే ఉంటూ, ఒక్కొక్క క్లూ సేకరిస్తూ ముందుకు వెళ్తాడు. ఈ మధ్యలో రాశి ఖన్నా (సన్నీ లవ్ ఇంట్రెస్ట్), కే కే మీనన్ (సన్నీ బాబాయ్) వంటి క్యారెక్టర్లు కథలో కీలక పాత్రలుగా మారతాయి. కామెడీ, టెన్షన్, ట్విస్టులు, ఎమోషన్ అన్నీ అద్భుతంగా మిక్స్ చేసిన ఈ సిరీస్ క్లైమాక్స్ ఏంటి ? ఆ దొంగ నోట్ల యాపారం హీరోకి ఎలాంటి చిక్కులు తెచ్చిపెట్టింది ? మైఖేల్ చివరికి హీరోని పట్టుకోగలిగాడా ? అన్నది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

ఎందుకు ఇంత పాపులర్ ?

షాహిద్ కపూర్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సన్నీ పాత్రలో అతని ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ సూపర్. విజయ్ సేతుపతి తన సహజ సిద్ధమైన స్టైల్‌ తో మైఖేల్ పాత్రకు జీవం పోశాడు. రాజ్ అండ్ డికె. దర్శకత్వం, స్క్రిప్ట్ రైటింగ్ అద్భుతం. 8 ఎపిసోడ్‌లు మాత్రమే ఉన్నందున ఒక్క వీకెండ్‌లోనే ఈ సిరీస్ ను చూడడం ముగించేసుకోవచ్చు.ప్రస్తుతం సీజన్ 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2026లో ఈ సీజన్ విడుదల కానుందని ప్రకటించారు. సీజన్ 2 మరింత ఉత్కంఠభరితంగా, పెద్ద స్కేల్‌లో ఉండబోతోందని షాహిద్ కూడా సూచించాడు. మంచి కామెడీ టైమింగ్, తెలివైన థ్రిల్లర్, సూపర్ యాక్షన్, యాక్టింగ్ ఉన్న సిరీస్ కావాలంటే ‘ఫర్జీ’ని తప్పకుండా చూడాల్సిందే. ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Read Also : 10 నెలల క్రితం విడుదలైన కోర్టు రూమ్ డ్రామా ఇంకా ట్రెండింగ్ లోనే

Tags

Related News

‘ఏపెక్స్’ నుండి ‘ది రిప్’ వరకు… 2026లో విడుదలైన 5 కొత్త సస్పెన్స్ థ్రిల్లర్స్

ఉపాధ్యాయులపై దాడులు… విద్యార్థులకు బుద్ధి చెప్పే ఊర మాస్ టీచర్

Bharat Bhhagya Viddhaata OTT : 26/11 దాడి అన్ టోల్డ్ స్టోరీ… కంగనా మూవీ స్ట్రీమింగ్ డేట్

Avatar 3 OTT Release : 12,000 కోట్ల విజువల్ వండర్ ఓటీటీలోకి… రెడీ అవ్వండమ్మా

This Week OTT Movies : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ మూడు మస్ట్ వాచ్..!

శవం పక్కనే బుక్… పోలీసులకు హింట్ ఇస్తూ వరుస హత్యలు చేసే మెంటల్ సైకో

జూన్ 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు… ఒకే ఓటీటీలో 11 సినిమాలు సిరీస్‌లు

Big Stories

×