E-Paper
Advertisement

10 నెలల క్రితం విడుదలైన కోర్టు రూమ్ డ్రామా ఇంకా ట్రెండింగ్ లోనే

10 నెలల క్రితం విడుదలైన కోర్టు రూమ్ డ్రామా ఇంకా ట్రెండింగ్ లోనే
Advertisement

Netflix Trending Movie : ఈ ఏడాది బాక్సాఫీస్‌ దుమ్ము దులిపిన సూపర్‌ హిట్ సినిమా ‘ధురందర్ 2’ నెట్ ఫ్లిక్స్ లో నంబర్ వన్‌గా ట్రెండ్ అవుతున్నా, దానికి గట్టి పోటీ ఇస్తూ మరో సినిమా విపరీతంగా రాణిస్తోంది. అదే ‘జాలీ ఎల్ఎల్‌బి 3’ (Jolly LLB 3 ). గత సంవత్సరం సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలై భారీ విజయం సాధించిన ఈ కోర్ట్‌రూమ్ డ్రామా, ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో టాప్ 10లో 7వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. మరి 10 నెలల క్రితమే విడుదలైన ఈ మూవీ ఇంకా ఎందుకు ట్రెండింగ్ లో ఉంది ? ఈ సినిమాలో అంతగా ఏముంది ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

సినిమా మూడు రకాల న్యాయవాదుల చుట్టూ తిరుగుతుంది. అక్షయ్ కుమార్ జగదీశ్ మిశ్రా (జాలీ) పాత్రలో నటించాడు. ఇతను చాలా సాధారణమైన, కొంచెం లాభాపేక్షతో లాయర్ గా పని చేసే వ్యక్తి. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ ఒక చిన్న గ్రామంలోని వ్యవసాయ భూములను అక్రమంగా లాగేసుకోవడం, ఆ ప్రక్రియలో ఒక రైతు కుటుంబం పూర్తిగా నాశనమవడం… ఇది సినిమా మెయిన్ కేసు.ఈ కేసులో జాలీకి ఎదురుగా అర్షద్ వార్సీ (రాజ్ పాల్) న్యాయవాదిగా నిలుస్తాడు. అతను ధనికులు, కార్పొరేట్ కంపెనీల తరపున పోరాడే హై-ప్రొఫైల్ లాయర్. మరోవైపు సౌరభ్ శుక్లా జడ్జీగా వస్తారు. చాలా సీరియస్, న్యాయం పట్ల మంచి నమ్మకం ఉన్న వ్యక్తి ఆయన.

Advertisement

కథలో హ్యూమర్, డ్రామా, ఎమోషన్ అన్నీ బ్యాలెన్స్‌గా ఉంటాయి. జాలీ తన సాధారణ జీవితం నుంచి ఈ పెద్ద కేసును ఎలా ఎత్తుకుని, ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదుర్కొని, చివరికి న్యాయం కోసం ఎలా పోరాడతాడు అనే అంశాన్ని ఇందులో ఆకట్టుకునేలా చూపించారు. రైతు కుటుంబం బాధ, కార్పొరేట్ దురాక్రమాలు, కోర్టు లోపల జరిగే తీవ్రమైన వాదనలు, ట్విస్టులు… ఇవన్నీ హార్ట్ టచింగ్‌ గా ఉంటాయి. హ్యూమర్ సీన్స్ కూడా బాగుంటాయి. ముఖ్యంగా అక్షయ్ మరియు అర్షద్ మధ్య డైలాగ్ ఎక్స్ఛేంజ్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.

Read Also : ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో… ప్రియుడి ఎంట్రీతో బుర్రపాడు షాక్

మూవీ కలెక్షన్స్

Advertisement

అక్షయ్ కుమార్ జాలీగా తన మార్క్ కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్‌లో కూడా బాగా ఆకట్టుకున్నాడు. అర్షద్ వార్సీ, సౌరభ్ శుక్లా వంటి సినీయర్ నటుల రోల్స్‌ సినిమాకు బలం. అమృత రావు, హుమా ఖురేషి, సీమా బిస్వాస్, గజరాజ్ రావు వంటి నటీనటులు కూడా బాగా నటించారు. ఇండియాలో రూ.113 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 166 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ అయింది ఈ మూవీ. ఇందులో కోర్ట్‌ రూమ్ డ్రామా ప్లస్ కామెడీ అనే కాంబినేషన్ ఉండడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

 

Tags

Related News

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

అమ్మాయిలను చంపి పెళ్లి కూతుర్లలా అలంకరించే సైకో… సీటు అంచున కూర్చోబెట్టే ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ

Big Stories

Advertisement
×