E-Paper
Advertisement

నైట్ క్ల‌బ్ లో గొడ‌వ‌..వీధి రౌడీల్లాగా త‌న్నుకున్న‌ బెన్ స్టోక్స్‌, అట్కిన్సన్

నైట్ క్ల‌బ్ లో గొడ‌వ‌..వీధి రౌడీల్లాగా త‌న్నుకున్న‌ బెన్ స్టోక్స్‌, అట్కిన్సన్
Advertisement

Stokes and Atkinson nightclub incident:  ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand tour of England, 2026) మధ్య ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్ కొనసాగుతోంది. మొన్న జూన్ 4వ తేదీన ప్రారంభమైన ఈ టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే మొదటి మ్యాచ్ ఫినిష్ అయింది. ఇందులో ఇంగ్లాండ్ విజయం సాధించగా.. రెండు టెస్ట్ బుధవారం నుంచి షురూ అవుతుంది. అయితే మొదటి టెస్టులో గెలిచిన నేపథ్యంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes), గస్ అట్కిన్సన్ (Gus Atkinson) నైట్ క్లబ్ కు (nightclub) దొంగ చాటున వెళ్లారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కు ( ECB) ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. సోమవారం అర్ధరాత్రి క్లబ్ కు వెళ్లి చిల్ అయ్యారు. అయితే క్లబ్బుకు వెళ్లిన ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు.. సైలెంట్ గా హోటల్ కు రాకుండా కొంతమంది అపరిచితులతో గొడవపడ్డారు. దీంతో ఈ విషయం ఇంగ్లాండు క్రికెట్ బోర్డు దాకా చేరింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

నైట్ క్ల‌బ్ లో గొడ‌వ‌..వీధి రౌడీల్లాగా త‌న్నుకున్న‌ బెన్ స్టోక్స్‌, అట్కిన్సన్

Advertisement

ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ ( England vs New Zealand ) మధ్య తొలి టెస్ట్ ముగిసిన నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్ ఇద్దరూ రూల్స్ బ్రేక్ చేశారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హోటల్ రూమ్ నుంచి… లండన్ లో ఉన్న ఓ ప్రముఖ నైట్ క్లబ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా పీకలదాకా తాగారు. అనంతరం హోటల్ రూమ్ కు వస్తుండగా… కొంతమంది అపరిచితులతో గొడవపడ్డారు ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు. ఈ క్రమంలో బీర్ల బాటిల్స్ ఒకరిపై మరొకరు విసురుకున్నారు.

ఈ సంఘటనలో బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్ ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై లండన్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారట. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు దాకా ఈ వ్యవహారం వెళ్లింది. దీనిపై విచారణ కమిటీని కూడా వేసిందట ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఇందులో బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్ ఇద్దరిదీ తప్పు ఉంటే మాత్రం రెండో టెస్ట్ ఆడకుండా నిషేధం విధించే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) కు ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఏమీ కొత్తేమీ కాదు. గ‌తంలో కూడా ఇలాగే పీక‌ల‌ దాకా తాగి ర‌చ్చ చేసిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి.

Advertisement

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

 

Related News

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Big Stories

Advertisement
×