E-Paper
Advertisement

Feel good Movie OTT: దీపావళి పండుగ మిడిల్ క్లాస్ మెమోరీస్ తో… లైఫ్ అంటే ఏంటో చూపించే చూడ చక్కని కథ

Feel good Movie OTT: దీపావళి పండుగ మిడిల్ క్లాస్ మెమోరీస్ తో… లైఫ్ అంటే ఏంటో చూపించే చూడ చక్కని కథ
Advertisement

Feel good Movie OTT : మధ్యతరగతి జీవితాలకు అద్దం పట్టే ఒక మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథకి ప్రశంసలు కూడా వచ్చాయి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పండుగలకు ఎలాంటి ఇబ్బందులు పడుతుందో, ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. పెద్ద పెద్ద ఫైట్లు, పాటలు లేకపోయినా.. మన పక్కింటి కథలా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో మధ్యతరగతి తండ్రి పడే ఆరాటం, ఆవేదన చూస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లుతాయి కూడా.

Aha (ఆహా) ఓటీటీలో స్ట్రీమింగ్ 

ఈ తమిళ సినిమా పేరు ‘దీపావళి బోనస్’ (Deepavali Bonus). జయబాల్ జె. ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో విక్రాంత్, రిత్విక ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ అంకాళి పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీపక్ కుమార్ తల ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో 2024 అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమా, నవంబర్ 26 నుండి Aha (ఆహా) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, సామాన్యుల జీవితాలకు అద్దం పట్టేలా ఉండటంతో ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా 1 గంట 34 నిమిషాల నిడివితో IMDb లో 6.8/10 రేటింగ్ కూడా పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మదురైలో ఉండే రవి ఓ కొరియర్ బాయ్. పొద్దున లేస్తే సైకిల్ తొక్కుతూ ఊరంతా తిరుగుతూ పార్శిల్లు డెలివరీ చేస్తాడు. పెళ్లాం గీత పక్కా పద్ధతైన మహిళ, ఇళ్లల్లో పాచిపని చేస్తూ పైసా పైసా పోగేస్తుంది. వీళ్లకి సచిన్ అని ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. వాడికి దీపావళి అంటే పిచ్చి ప్రాణం. కొత్త బట్టలు, టపాకాయలు కావాలని తండ్రిని వేధిస్తుంటాడు. రవి కూడా, బోనస్ పడగానే నువ్వు కోరుకున్నవన్నీ కొనిపెడతానని వాడికి మాటిస్తాడు. తీరా పండుగ దగ్గర పడ్డాక, ఆ యజమాని అతనికి రావాల్సిన బోనస్ ఇవ్వకుండా మొండికేస్తాడు.

అప్పటికే అప్పుల బాధలో ఉన్న రవికి ఏం చేయాలో అర్థం కాదు. చేతిలో చిల్లిగవ్వ లేదు, పిల్లాడికి ఇచ్చిన మాటేమో కొండంత ఉంది. ఆ బోనస్ డబ్బుల కోసం ఆఫీసు చుట్టూ కుక్కలా తిరుగుతాడు. ఇంట్లో పెళ్లాం కూడా తనవంతు ప్రయత్నం చేస్తుంది కానీ, ఆ పండుగ పూట ఒక్కో రూపాయి సర్దడం ఎంత నరకమో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. చివరికి ఆ పిల్లాడి కోరిక తీరిందా? ఆ తండ్రి తన పరువు నిలబెట్టుకున్నాడా? అసలు ఆ ఇంట్లో పండుగ జరిగిందా ? అనే విషయాలను మాత్రం, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  40 ఏళ్ల క్రితం తప్పిపోయిన తల్లి… అస్థిపంజరంతో అసలు గుట్టు… అదరగొట్టే మిస్టరీ

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×