E-Paper
Advertisement

Mystery Thriller Movie OTT: 40 ఏళ్ల క్రితం తప్పిపోయిన తల్లి… అస్థిపంజరంతో అసలు గుట్టు… అదరగొట్టే మిస్టరీ

Mystery Thriller Movie OTT: 40 ఏళ్ల క్రితం తప్పిపోయిన తల్లి… అస్థిపంజరంతో అసలు గుట్టు… అదరగొట్టే మిస్టరీ
Advertisement

Mystery Thriller Movie OTT : గత ఏడాది థియేటర్లలో అలరించిన ఒక కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇది ‘ట్రైన్ టు బుసాన్’ ఫేమ్ దర్శకుడు తెరకెక్కించిన సినిమా. 40 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఒక మహిళ అస్థిపంజరం దొరకడంతో ఈ కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ సినిమా అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందించారు. నటుడు పార్క్ జియోంగ్-మిన్ ఈ సినిమా కోసం రూపాయి కూడా తీసుకోకుండా పనిచేశారు. ఇక ఈ సినిమాను ఒక డాక్యుమెంటరీ స్టైల్‌లో తీశారు. దీనివల్ల సినిమాలో జరిగే సంఘటనలు మన కళ్లముందే జరుగుతున్నంత సహజంగా ఉంటాయి. భారీ గ్రాఫిక్స్, ఫైట్లు లేకుండా కేవలం ఎమోషన్స్ మీద ఈ సినిమా చాలా వరకు నడుస్తుంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది అగ్లీ’ (The Ugly). ‘ట్రైన్ టు బుసాన్’ ఫేమ్ దర్శకుడు యాన్ సాంగ్-హో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పార్క్ జియోంగ్-మిన్, క్వాన్ హే-హ్యో, షిన్ హ్యున్-బీన్ మరియు హాన్ జి-హ్యున్ నటించారు. 2018లో రాసిన ‘ఫేస్’ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా 2025 సెప్టెంబర్‌లో టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. ఆ తరువాత 2025 సెప్టెంబర్ 11న కొరియాలో విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్లాట్‌ ఫామ్ లో అందుబాటులోకి వచ్చింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హీరో డాంగ్ కు ఒకరోజు ఊహించని ఫోన్ కాల్ వస్తుంది. 40 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన తన తల్లి అస్థిపంజరం ఒకచోట దొరికిందని పోలీసులు చెబుతారు. తన తల్లి అసలు ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది? ఆమె ఎలా చనిపోయింది? అని తెలుసుకోవడానికి హీరో తన అసలు ఊరికి వెళ్తాడు. అక్కడ ఒక డాక్యుమెంటరీ తీసే అమ్మాయితో కలిసి తన తల్లి గత జీవితం గురించి ఆరా తీయడం మొదలుపెడతాడు. ఇక ఈ విచారణలో హీరోకి షాకింగ్ విషయాలు తెలుస్తాయి. తన తల్లి చూడటానికి అస్సలు బాలేదని, చాలా వికృతంగా ఉండేదని తెలుసుకుంటాడు.

ఆ కారణంతో ఊరి జనం ఆమెను చాలా హీనంగా చూసేవారని అర్థమవుతుంది అతనికి. ఇక ఇందులో హీరో తండ్రి ఒక గుడ్డివాడు, పైకి చాలా మంచివాడిలా కనిపించే తన తండ్రికి, తన తల్లి చావుకి ఏదో సంబంధం ఉందని హీరోకి అనుమానం మొదలవుతుంది. ఇక సమాజంలో ఆమె పడిన నరకం ఒక్కొక్కటిగా బయటపడతాయి. చివరికి హీరో తల్లి ఎలా చనిపోయింది ? ఇందులో అతని తండ్రి పాత్ర ఎంత ? ఆ అస్థిపంజరం వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ఓటీటీలో దుమ్ము లేపుతున్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్… మాఫియాపై అలుపెరుగని పోరాటం… ట్రెండింగ్‌లోనూ తోపే

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×