E-Paper
Advertisement

టోక్యో వీధుల్లో మిడ్ నైట్ డైనర్… ఆకలి తీర్చే అపురూప కథలు

టోక్యో వీధుల్లో మిడ్ నైట్ డైనర్… ఆకలి తీర్చే అపురూప కథలు
Advertisement

Feel Good Series OTT : ఒక మాంచి రిలాక్సింగ్ స్టోరీ చూడాలని ఎవరికైనా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఒక జపనీస్ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ ఓటీటీలో అందుబాటులో ఉంది. చిన్న హోటల్ చుట్టూ తిరిగే ఈ స్టోరీ నిజంగానే ఒక అద్భుతం. ఇందులో పెద్ద పెద్ద ఫైటింగ్‌లు, హడావిడి ఏమీ ఉండవు. జస్ట్ మన పక్కింటి వాళ్ళ కథల్లాగే చాలా నేచురల్‌గా, హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. రాత్రిపూట పడుకునే ముందు ఒక ఎపిసోడ్ చూస్తే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. దీనికి ఐయండిబిలో 8.6 రేటింగ్ ఉందంటే ఈ సిరీస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ జపనీస్ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ పేరు ‘మిడ్‌నైట్ డిన్నర్’ (Midnight Diner). ఇది యారో అబే రాసిన మంగా కామిక్ ఆధారంగా రూపొందింది. ఇందులో మాస్టర్ పాత్ర పోషించిన కౌరు కోబయాషి సీరీస్ కు ప్రాణం పోశారనే చెప్పాలి. అతని నటన అంత అద్భుతంగా ఉంటుంది ఇందులో. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది. ఇందులో ‘మిడ్‌నైట్ డిన్నర్’, ‘మిడ్‌నైట్ డిన్నర్: టోక్యో స్టోరీస్’ అనే రెండు భాగాలు ఉంటాయి. మిడ్‌నైట్ డిన్నర్: టోక్యో స్టోరీస్ (సీజన్ 4) ఇది మొట్టమొదట నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్‌గా 2016 అక్టోబర్ 21న, (సీజన్ 5) 2019 అక్టోబర్ 31న విడుదలైంది. అసలు మొదటి 3 సీజన్లు జపాన్ టీవీలో 2009 నుండి 2014 మధ్య వచ్చాయి. ఇవన్నీ కూడా నెట్ ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉన్నాయి.

స్టోరీలోకి వెళ్తే 

Advertisement

టోక్యోలోని ఒక ఇరుకైన గల్లీలో ‘మెషియా’ అనే చిన్న హోటల్ ఉంటుంది. దీనికి బోర్డు కూడా ఉండదు. అర్ధరాత్రి 12 గంటలకు మొదలై, తెల్లవారుజామున 7 గంటలకు మూసివేస్తారు. అందుకే అందరూ దీన్ని ‘మిడ్‌నైట్ డిన్నర్’ అని పిలుస్తారు. ఆ హోటల్ నడిపే వ్యక్తిని అక్కడ అందరూ ‘మాస్టర్’ అంటారు. ఆయనకు ముఖంపై ఒక పెద్ద గాటు ఉంటుంది. అది ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఆయన మెనూలో కేవలం ‘పోర్క్ మిసో సూప్’ తో పాటు మరికొన్ని పానీయాలు మాత్రమే ఉంటాయి. కానీ కస్టమర్లు తమకు నచ్చిన వంటకం అడిగితే, ఆయన దగ్గర దానికి సంబంధించి సామాగ్రి ఉంటే తప్పకుండా వండి పెడతాడు.

ఇక్కడికి గ్యాంగ్‌స్టర్లు, ఆఫీసు పని వాళ్ళు, ఒంటరిగా ఉండే వాళ్ళతో పాటు రకరకాల మనుషులు వస్తుంటారు. ప్రతి ఎపిసోడ్‌లో ఒక కొత్త కస్టమర్ వస్తారు. వాళ్ళు తమ బాధలను, ప్రేమకథలను మాస్టర్‌తో పంచుకుంటారు. మాస్టర్ వాళ్ళు అడిగిన వంటకాన్ని చేస్తూ, వాళ్ళ మాటలు వింటూ, అప్పుడప్పుడు చిన్న సలహాలు ఇస్తుంటాడు. భోజనం ముగిసేసరికి ఆ కస్టమర్ మనసు తేలికపడి, కొత్త ఆశతో హోటల్ నుండి బయటకు వెళ్తాడు . ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది కేవలం వంటల గురించి కాదు. ఒంటరితనాన్ని పోగొట్టి, మనసును ఓదార్చే ఒక అద్భుతమైన సిరీస్.

Advertisement

Read Also : కారునే ఆఫీసుగా మార్చే క్రిమినల్ లాయర్… ఓటీటీలో అదరగొడుతున్న లీగల్ డ్రామా

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×