E-Paper
Advertisement

రైల్వే ప్రయాణికులు గుడ్ న్యూస్.. నర్సాపుర్-తిరుపతి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్

రైల్వే ప్రయాణికులు గుడ్ న్యూస్.. నర్సాపుర్-తిరుపతి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్
Advertisement

Narsapur Tirupati Express: రైల్వే శాఖ ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి నర్సాపూర్–తిరుపతి–నర్సాపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. దీంతో ఏపీలో రైలు కనెక్టివిటీని మరింత పెంచనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి నర్సాపూర్ నుంచి వారానికి ఒకసారి నడిచే కొత్త సర్వీసును ప్రారంభించనున్నారు. కొత్త సర్వీస్ తో రైళ్లు మారాల్సిన అవసరాన్ని, ఎక్కువసేపు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ రూట్ లో ప్రయాణికుల డిమాండ్ పెరుగుతున్నందున.. తిరుపతి వెళ్లే యాత్రికుల కోసం ఈ సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వీక్లీ ఎక్స్‌ప్రెస్ సర్వీస్

నర్సాపూర్-తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఏపీలోని ముఖ్య పట్టణాలను కలుపుతూ వారానికి ఒకసారి రెండు వైపులా నడవనుంది. ఈ సర్వీసు ముఖ్యంగా తిరుపతికి వెళ్లే భక్తులకు సేవలు అందించడంతో పాటు, ఈ మార్గంలో సాధారణ ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుంది.

షెడ్యూల్ ఇదే

Advertisement

ఏప్రిల్ 27న నర్సాపూర్ నుంచి రైలు బయలుదేరుతుంది. అనంతరం ప్రతి ఆదివారం ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో ప్రతి సోమవారం నడపనున్నారు. ఈ ట్రైన్ వీకెండ్ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. కోస్తాంధ్ర నుంచి రాయలసీమ ప్రాంతాలకు డెరెక్ట్ కనెక్టివిటీ పెరిగి, ప్రయాణికులు సులభంగా ప్రయాణాలు సాగించవచ్చు.

తీర్థయాత్రలకు ప్రోత్సాహం

ప్రతి సంవత్సరం తిరుమలకు లక్షలాది మంది భక్తులు ఈ ప్రాంతం నుంచి వెళ్తుంటారు. నర్సాపూర్ నుంచి తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుతో.. పశ్చిమ గోదావరి, సమీప ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు రైళ్లు మారకుండానే తిరుపతి పట్టణానికి చేరుకోవడం సులభతరం అవుతుంది.

Advertisement

Also Read:  టూరిస్టులకు గుడ్ న్యూస్, ఐదేళ్ల తర్వాత వనరాణి మళ్లీ ప్రారంభం!

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×