Legal Thriller Series OTT : కోర్ట్ నేపథ్యంలో సాగే లీగల్ డ్రామా సిరీస్ లు ఇప్పడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మంచి కథనాలను మేకర్స్ ఆడియన్స్ కి పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీలో ఒక లీగల్ డ్రామా టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. దీనికి ఐయండిబిలో 7.8 రేటింగ్ కూడా ఉంది. అంతేకాదు ఇప్పటి వరకు వచ్చిన నాలుగు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి కూడా. ఈ ఏడాది వచ్చిన 4 వ సీజన్ కూడా టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. సాధారణంగా లీగల్ డ్రామాలు కోర్టు గదులకే పరిమితమవుతాయి. కానీ ఇందులో హీరో తన లగ్జరీ లింకన్ కారునే ఆఫీసుగా మార్చుకుని లాస్ ఏంజిల్స్ వీధుల్లో తిరుగుతూ కేసులను డీల్ చేయడం ఒక సిరీస్ కి హైలెట్ గా ఉంటుంది. లీగల్ థ్రిల్లర్లను ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ సజెషన్ గా ఈ సిరీస్ ను చెప్పుకోవచ్చు. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..
ఈ లీగల్ డ్రామా సిరీస్ పేరు ‘ది లింకన్ లాయర్’ (The lincoln lawyer). ఈ సిరీస్ ప్రముఖ రచయిత మైఖేల్ కాన్నెల్లీ రాసిన నవలల ఆధారంగా రూపొందింది. 2011లో ఇదే పేరుతో, ఇదే కాన్సెప్ట్ తో ఒక సినిమా వచ్చింది. మథ్యూ మెక్కోనాహే నటించిన ఆ సినిమాతో పోలిస్తే, ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ను మరింత ఆసక్తికరంగా చూపించారు. ముఖ్యంగా మెక్సికన్ నటుడు మాన్యువల్ గార్సియా-రుల్ఫో తన నటనతో మిక్కీ హాలర్ పాత్రకు ప్రాణం పోశారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ పొందిన ఈ సిరీస్, ఇండియన్స్ ను కూడా అలరించడానికి, తెలుగుతో సహా పలు భాషల్లో డబ్బింగ్ చేయబడింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ రేటింగ్ పొందిన సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. మొత్తం నాలుగు సీజన్లతో వచ్చిన ఈ సిరిస్ మొదటి సీజన్ 2022న మే 13, సీజన్ 2 : 2023 జులై 6, సీజన్ 3 : 2024 అక్టోబర్ 17, సీజన్ 4: 2026 ఫిబ్రవరి 5న విడుదలైంది. ఈ సిరీస్ ఇప్పటికే సీజన్ 5 కోసం కూడా గ్రీన్ సిగ్నల్ పొందింది. దీని షూటింగ్ కూడా ఈ ఏడాది మొదలయ్యింది, కాబట్టి ఇది 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.
మిక్కీ హాలర్ ఒక విలక్షణమైన క్రిమినల్ డిఫెన్స్ లాయర్. అతనికి మిగతా లాయర్లలాగా పెద్ద ఆఫీసు ఉండదు. తన లింకన్ టౌన్ కార్ వెనుక సీటునే ఆఫీసుగా మార్చుకుని, లాస్ ఏంజిల్స్ నగరం మొత్తం తిరుగుతూ కేసులను వాదిస్తుంటాడు. అందుకే అతనికి లింకన్ లాయర్ అని పేరు వస్తుంది.
సీజన్ 1 : ఒక ప్రమాదం తర్వాత కోలుకున్న మిక్కీ, తన మిత్రుడు హత్యకు గురవడంతో అతని పెండింగ్ కేసులను తీసుకుంటాడు. ఇందులో ఒక పెద్ద టెక్ బిలియనీర్‌పై ఉన్న హత్య కేసు ఉంటుంది. ఈ కేసును మిక్కీ డీల్ చేసే క్రమంలో స్టోరీ ఊహించని మలుపులు తీసుకుంటుంది. చివరికి ఆ కేసును గెలవడంతో మొదటి సీజన్ ముగుస్తుంది.
సీజన్ 2 : మిక్కీ ఇప్పుడు నగరంలో ఫేమస్ లాయర్ అవుతాడు. ఇందులో ఒక రెస్టారెంట్ యజమాని ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్‌ను చంపినట్లు ఆరోపణలు వస్తాయి. ఆమెను కాపాడే క్రమంలో మిక్కీ ఎదుర్కొన్న సవాళ్లు ఇందులో కనిపిస్తాయి.
సీజన్ 3 : తన స్నేహితురాలు గ్లోరీ డేస్ హత్యకు గురవడంతో, ఆమె కేసును మిక్కీ వ్యక్తిగతంగా తీసుకుంటాడు. ఈ విచారణలో అనేక రహస్యాలు బయటపడతాయి.
సీజన్ 4 : ఈ సీజన్‌లో కథ అనూహ్య మలుపు తిరుగుతుంది. మిక్కీ కారు డిక్కీలో ఒక శవం దొరకడంతో, మిక్కీనే నిందితుడిగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి అతను చేసే పోరాటమే ఈ సీజన్ లో హైలైట్ గా ఉంటుంది.
Read Also : ప్రేమలో మోసపోయి హత్య కేసులో చిక్కుకున్న అమ్మాయి… క్లైమాక్స్ వరకు అంతుచిక్కని మిస్టరీ