E-Paper
Advertisement

OTT Movie : అపార్ట్మెంట్లో పెళ్ళైన మహిళలంతా అదే పనిలో… ఫ్యామిలీతో పొరపాటున కూడా చూడకూడని సిరీస్

OTT Movie : అపార్ట్మెంట్లో పెళ్ళైన మహిళలంతా అదే పనిలో… ఫ్యామిలీతో పొరపాటున కూడా చూడకూడని సిరీస్
Advertisement

OTT Movie : డిఫరెంట్ గా ఏదైనా స్టోరీ చూడాలనుకుంటే ‘ఫిష్‌బౌల్ వైవ్స్’ అనే సిరీస్ ని చూసేయండి. ఇందులో రొమాన్స్ తో పాటు రివెంజ్ కూడా ఉంటుంది. ఒక రిచ్ అపార్ట్మెంట్ లో ఉండే ఆరుగురు భార్యల చుట్టూ ఈ కథ నడుస్తుంది. వీళ్లంతా పైకి భార్యా భర్తల్లా ఉంటారు. కాకపొతే నాలుగు గోడల మధ్య జరిగే కథ వేరే లెవెల్ లో ఉంటుంది. మోసాలు, అబ్యూజ్, అఫైర్స్ తో ఈ స్టోరీ మీకు కావాల్సినంత మజా ఇస్తుంది. ఇది ఏ ఓటీటీల ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌

2022లో వచ్చిన ఈ జపాన్ మినీ సిరీస్ పేరు ‘ఫిష్‌బౌల్ వైవ్స్’ (Fishbowl Wives). టాకాహిరో మియాజాకి డైరెక్షన్ లో ర్యోకో షినోహారా, మాసానోబు అండో, యూటో నాకాజిమా మెయిన్ పాత్రల్లో నటించారు. 8 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ఐయండిబిలో 7.0/10 రేటింగ్ పొందింది. 2022 ఫిబ్రవరీ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

టోక్యోలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఉంటుంది. అందులో ఉన్న వాళ్లని బయటి నుంచి చూస్తే రిచ్, హ్యాపీ కపుల్స్ లాగా కనిపిస్తారు. కానీ లోపల ఏం జరుగుతుందో ఎవడికీ తెలీదు. ఈ సిరీస్ ఆ టవర్‌లో ఉండే ఆరుగురు భార్యల కథలు చూపిస్తుంది. అందరూ బయటి నుంచి గ్లామర్ గా కనిపిస్తారు. లోపల మాత్రం ఫుల్ నరకంలో ఉంటారు. ఇక ఇందులో మెయిన్ రోల్ సకురా అనే నలభై ఏళ్ల మహిళతో మొదలవుతుంది. ఈమె భర్త తకుయా ఒక హెయిర్ సెలూన్ ఓనర్. బయట జెంటిల్మెన్ లాగా ఉంటాడు, ఇంట్లో మాత్రం ఫుల్ సైకో. సకురాతో అతనికి పెళ్లి అయినప్పటి నుంచి రోజూ కొడతాడు, అడ్డమైన బూతులు తిడుతూ ఉంటాడు. నీవు గుడ్డు పెట్టలేని కోడివి అని అవమానిస్తాడు. సకురా రోజూ నాలుగు గోడల మధ్యలో ట్రాప్ అయిపోయి ఊపిరి ఆడకుండా ఉంటుంది.

ఒక రోజు ఆమె పెట్ షాప్‌కి వెళ్లి హారుటో అనే 25 ఏళ్ల యంగ్ బాయ్ ని కలుస్తుంది. ఇద్దరి మధ్య ఒక్కసారిగా స్పార్క్ పుడుతుంది. హారుటోతో ఉన్నప్పుడు సకురాకి మళ్లీ ఊపిరి తీసుకున్నట్లు ఫీల్ వస్తుంది. ఇక అక్కడి నుంచి సీక్రెట్ అఫైర్ స్టార్ట్ అవుతుంది. హోటల్స్, కారు, లిఫ్ట్… ఎక్కడ దొరికితే అక్కడ రొమాన్స్ మొదలు పెట్టేస్తారు. కానీ భర్తకి డౌట్ వచ్చేస్తుంది. సకురా ఫోన్ చెక్ చేసి, CCTV ఫుటేజ్ కూడా చూస్తాడు. దీంతో టెన్షన్ పీక్స్‌కి వెళ్తుంది. ఇక అదే టవర్‌లో మిగతా ఐదుగురు భార్యల కథలు కూడా ప్యారలల్‌గా నడుస్తాయి. ఒక భార్య తన భర్త మోసం చేస్తున్నాడని తెలుసుకుని రివెంజ్ అఫైర్ పెట్టుకుంటుంది. ఇంకో భార్యకి భర్త బయట అమ్మాయిలతో ఉంటాడు, ఇంట్లో మాత్రం ఆమెను ఇగ్నోర్ చేస్తుంటాడు. మరో భార్య ఫుల్ లోన్లీ, ఆన్‌లైన్ లవర్‌తో చాటింగ్‌లో పడిపోతుంది.

Advertisement

Read Also : ఆడపిల్లలంటే పడి చచ్చే సైకో… డార్జిలింగ్‌లో పూడ్చి పెట్టే సీక్రెట్స్… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్

ఇలా ఎవరి స్టోరీలు వాళ్లకి ఉంటాయి. అయితే చివరి రెండు ఎపిసోడ్‌లలో ఒక్కసారిగా అందరి కథలు మారిపోతాయి. సకురా భర్త హారుటోని చంపేయాలని ప్లాన్ చేస్తాడు. సకురా కూడా ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ టైమ్‌లో మిగతా భార్యలు కూడా తమ తమ భర్తలతో ఫైనల్ షోడౌన్ చేస్తారు. ఎవరి రివెంజ్ లు వాళ్ళు తీర్చుకుంటారు. ఈ భార్యల కథలు ఎలా ముగుస్తాయనేది మీరు తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ని మిస్ కాకుండా చుడండి.

 

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×