E-Paper
Advertisement

OTT Movie : ఆడపిల్లలంటే పడి చచ్చే సైకో… డార్జిలింగ్‌లో పూడ్చి పెట్టే సీక్రెట్స్… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్

OTT Movie : ఆడపిల్లలంటే పడి చచ్చే సైకో… డార్జిలింగ్‌లో పూడ్చి పెట్టే సీక్రెట్స్… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్
Advertisement

OTT Movie : బాలీవుడ్ బ్యూటీ అదితి పోహంకర్ నటించిన ‘జిద్దీ ఇష్క్’ ఓటీటీలోకి వచ్చేసింది. ‘ఆశ్రం’ ‘మండాల మర్డర్స్’ తో పాపులర్ అయిన ఈ బ్యూటీ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ లో అదరగొట్టింది. బెంగాల్ నేపథ్యంలో సాగే ఈ స్టోరీ మొదట లవ్ స్టోరీతో మొదలై , ఆ తరువాత రివేంజ్ మోడ్ లో కి వెళ్తుంది. ఇక ఈ సిరీస్ లో ఈ అమ్మడు యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో చేసింది. ఆడియన్స్ కూడా దీనిని ఆసక్తిగా చూస్తున్నారు. ఇందులో పరమ్‌బ్రత చట్టోపాధ్యాయ్ రోల్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

రాజ్ చక్రవర్తి రూపొందించిన ఈ సిరీస్ పేరు ‘జిద్దీ ఇష్క్’ (Ziddi Ishq). ఇందులో ఆదితి పోహంకర్ (మెహుల్ రోల్), పరమ్‌బ్రత చట్టోపాధ్యాయ్ (శేఖర్ దా) లీడ్ రోల్స్ లో నటించారు. 2025 నవంబర్ 21నుంచి JioHotstarలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ సిరీస్ బెంగాలీ ఫిల్మ్ ‘పరిణీతా’ (2019) హిందీ రీమేక్. 7 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ఐయండిబిలో 7.2/10 రేటింగ్ పొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డబ్బింగ్‌ తో ఇది అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కలకత్తా లో ఒక సాధారణ మధ్యతరగతి బెంగాలీ కుటుంబంలో మెహుల్ (ఆదితి పోహంకర్) అనే టీనేజ్ అమ్మాయి ఉంటుంది. ఆమె ఆమె తన పొరుగువాడు అయినటువంటి శేఖర్ (పరమ్‌ బ్రత చట్టోపాధ్యాయ్) తో ప్రేమలో పడుతుంది. అతను అదే ప్రాంతంలో ట్యూషన్ టీచర్ గా క్లాసులు తీసుకుంటూ ఉంటాడు. అతను ఆమెకు పాఠాలు చెప్పడంతో పాటు, జీవితంలోని చిన్న చిన్న విషయాలను కూడా ఆమెకు చెప్పుకుంటూ వస్తాడు. ఇక రాను రాను మెహుల్ కి అతని మీద ప్రేమ ఏర్పడుతుంది. ఎవరికీ చెప్పకుండా లోపలనే దాచుకుంటుంది. రోజూ అతని ఇంటి ముందు నిలబడి, చిన్న గిఫ్ట్స్ ఇచ్చి, కలల్లోనే సంతోషపడుతుంది.

Read Also : దేవుడి పేరుతో దిక్కుమాలిన పనులు… అమ్మాయిలను వదలకుండా… మతిపోగోట్టే సస్పెన్స్ థ్రిల్లర్

అయితే  అనుకోకుండా ఒకసారి భయంకరమైన ట్విస్ట్ వస్తుంది. అతని మీద వేధింపుల ఆరోపణలు వస్తాయి. దీంతో అతను సూసైడ్ చేసుకుని చనిపోతాడు. మెహుల్ ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది. అతని మీద ఆరోపణలు మీద ఆమె అనుమానం వ్యక్తం చేస్తుంది. దీని వెనుక ఆడవాళ్ళ పిచ్చి ఉన్న ఒక సైకో ఉన్నట్లు తెలుసుకుంటుంది. ఇక నిజం తెలుసుకుని రివేంజ్ తీర్చుకోవడానికి ఒక ప్రయాణం మొదలు పెడుతుంది. ఆ ప్రయాణంలో మెహుల్ రివేంజ్ తీర్చు కుంటుందా ? శేఖర్ పై ఆరోపణలు ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? ఈ క్లైమాక్స్ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ ని చూసి తెలుసుకోండి.
Advertisement

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×