E-Paper
Advertisement

OTT Movie : చావు లేని రాక్షసుడికి ప్రాణం పోస్తే.. అమ్మాయి కావాలంటూ టార్చర్… లాస్ట్ ట్విస్ట్ అస్సలు ఊహించలేరు భయ్యా

OTT Movie : చావు లేని రాక్షసుడికి ప్రాణం పోస్తే.. అమ్మాయి కావాలంటూ టార్చర్… లాస్ట్ ట్విస్ట్ అస్సలు ఊహించలేరు భయ్యా
Advertisement

OTT Movie : రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ‘ఫ్రాంకెన్‌స్టైన్’ సైన్స్ ఫిక్షన్ మూవీని హారర్ ఫ్యాన్స్ తెగ చూస్తున్నారు. పద్దెనిమదవ శతాబ్దంలో జరిగే ఈ కథ , చనిపోయిన వాళ్ళను బ్రతికించాలనుకునే, విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ అనే సైంటిస్ట్ చుట్టూ తిరుగుతుంది. అద్భుతమైన విజువల్స్, స్టోరీ, కాస్ట్యూమ్స్ తో ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ లలో ఒకటిగా నిలిచింది. ఒక్క నిముషం కూడా చూపును పక్కకి తిప్పుకోనివ్వదు ఈ సినిమా. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఆస్కార్ విన్నర్ గిల్లర్మో డెల్ టోరో డైరెక్ట్ చేసిన సినిమా ‘ఫ్రాంకెన్‌స్టైన్’. ఈ సై ఫై హారర్ మూవీలో ఇసాక్ , జేకబ్ ఎలార్డీ , మియా గాథ్, క్రిస్టోఫ్ వాల్జ్ లీడ్ రోల్స్ లో నటించారు. 149 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.6/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా థియేటర్స్‌లో 2025 అక్టోబర్ 17న విడుదలై, నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ అనే ఒక బ్రిలియంట్ సైంటిస్ట్ ఉంటాడు. చిన్నప్పుడే అతనికి అమ్మ చనిపోతుంది. ఆ బాధ అతన్ని ఎప్పట్నుంచో వెంటాడుతోంది. మరణం ఎందుకు వస్తుంది? నేను దాన్ని బద్దలు కొడతాననే ఒక రకమైన పిచ్చి అతనికి పట్టేస్తుంది. దీంతో రాత్రిపూట సమాధులు తవ్వి శవాలు దొంగిలించి, ఒక్కో శవం నుంచి పార్ట్స్ తీసుకొని ఒక పెద్ద మనిషి శరీరం సృష్టిస్తాడు. ఒక రాత్రి భారీ పిడుగు పడితే… ఆ శరీరం ఒక్కసారిగా కళ్లు తెరిచి బతికేసింది. ఇప్పుడు ఆ బతికిన జీవి చూడటానికి భయంకరంగా ఉంటాడు. ఎత్తు 8 అడుగులు, చర్మం కుట్లు కుట్లుగా, మొహం భయంకరంగా ఉండాడు. కానీ లోపల అతను ఒక పసి బిడ్డలా ఉంటాడు. మాట్లాడటం రాదు, ఏడుస్తాడు, ఎవరో ఒకరు తనని ప్రేమిస్తారని ఆశపడతాడు. విక్టర్ మొదట్లో దాన్ని చూసి భయపడి పారిపోతాడు.

Read Also : ముసలాడితో మాస్టర్ ప్లాన్… ఈ అమ్మాయి ఆశలకు అవాక్కవ్వాల్సిందే… గ్రిప్పింగ్ మలయాళ డ్రామా

Advertisement

ఆ తరువాత అది ప్రమాద కరమైందిగా భావించి మంటల్లో తగలబెడతాడు. ఐతే అది ఊహించని విధంగా ప్రాణాలతో బయట పడుతుంది. దానికి ఎంత గాయమైనా అప్పటికప్పుడే నయం అవుతుంటుంది. ఇక్కడే ట్రాజెడీ స్టార్ట్. క్రీచర్ బయట పడ్డాక ప్రజలు రాళ్లతో కొడతారు, ఒక్కడైనా అతన్ని మనిషిగా చూడరు. ఆ ఒంటరితనం, నొప్పి అతన్ని క్రమంగా కోపంగా మార్చేస్తాయి. దీంతో దేనికి కారణమైన విక్టర్ కోసం వెతుక్కుంటూ వస్తాడు. అతని దగ్గరకి వచ్చి విచిత్రంగా, తనకి తోడుగా మరొక క్రీచర్ ని సృష్టించ మని అడుగుతుంది. ఇక అది చేస్తే ఈ రాక్షస సంతతి పెరుగుతుందని భవిస్తాడు విక్టర్. చివరికి క్లైమాక్స్ ఊహించని విధంగా టర్న్ అవుతుంద. విక్టర్ మరో క్రీచర్ ని సృష్టిస్తాడా ? ఉన్న దాన్ని మట్టు బెడతాడా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×