E-Paper
Advertisement

Justice Suryakant: 53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణ స్వీకారం

Justice Suryakant: 53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణ స్వీకారం
Advertisement

Justice Suryakant: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9 వరకు సీజేఐగా కొనసాగనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర కేబినెట్ మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

జస్టిస్ సూర్యకాంత్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసిగా చరిత్రలో నిలిచారు. 1962 ఫిబ్రవరి 10న హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ జిల్లాలో జన్మించిన ఆయన, చిన్న వయసులోనే న్యాయరంగంపై ప్రత్యేక ఆసక్తి పెంచుకున్నారు. మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన ఆయన, పట్టుదలతో న్యాయవిద్యను అభ్యసించి, అద్భుత ప్రతిభను ప్రదర్శించారు.

Advertisement

Also Read: బహ్రెయిన్-హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైకి దారి మళ్లింపు, అసలేం జరిగిందంటే?

జస్టిస్ సూర్య కాంత్ 2004 జనవరిలో పంజాబ్–హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత వివిధ హైకోర్టులలో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. 2018 అక్టోబర్‌లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అలాగే, 2024 నవంబరు 12 నుంచి సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. గత ఆరు సంవత్సరాలలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్ 300కి పైగా తీర్పులను ఇచ్చారు.

Advertisement

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×