E-Paper
Advertisement

OTT Movie : దేవుడు ఆవహించాడంటూ దెయ్యం వేషాలు… నిద్రలోనూ కలవర పెట్టే హర్రర్ కథ

OTT Movie : దేవుడు ఆవహించాడంటూ దెయ్యం వేషాలు… నిద్రలోనూ కలవర పెట్టే హర్రర్ కథ
Advertisement

OTT Movie : టాప్ 5 ఏషియన్ హారర్ మూవీల్లో ఒకటిగా నిలిచింది ‘ది మీడియం’ సినిమా. ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో ఇది రియలిస్టిక్ గా ఉంటుంది. డైరెక్టర్ బంజాంగ్ దీనిని అత్యంత భయంకరంగా చిత్రీకరించాడు. ఇది ఆస్కార్ అవార్డుకి కూడా నామినేట్ అయింది.
ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ సినిమాని, హారర్ అభిమానులకు కావాల్సినంత భయాన్ని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో ఉందంటే

‘ది మీడియం’ 2021లో వచ్చిన థాయ్, కొరియన్ జాయింట్ ప్రొడక్షన్ లో రూపొందింది. దీనికి బాంజోంగ్ పిసంతనకున్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2021 జూలై 11న 25వ బుచియోన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఇది 2021 జూలై 14న దక్షిణ కొరియాలో థియేట్రికల్‌గా విడుదలై, 94వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్‌కి థాయ్ ఎంట్రీగా ఎంపికైంది కానీ నామినేట్ కాలేదు. ఈ సినిమా 25వ బుచెయోన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది. అంతే కాకుండా ఉత్తమ చిత్రంగా బుచెయోన్ ఛాయిస్ అవార్డును అందుకుంది. జియో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, Shudder లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

థాయిలాండ్ లో ఉండే ఇసాన్ అనే ఒక చిన్న గ్రామంలో ఒక పాత ఆచారం ఉంది. వాళ్ల గ్రామ దేవత ‘బా యీ’ ప్రతి తరంలో ఒక ఆడ మనిషిని ఎంచుకొని ఆమె శరీరంలోకి వచ్చి మంచి పనులు చేస్తుంది. ఆ ఎంపిక అయిన ఆడవాళ్లని అక్కడ “మీడియం” అంటారు. ఇప్పుడు ఆ రోల్ నింగ్ అనే మహిళకి వస్తుంది. నింగ్ చాలా పవిత్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా బాధలో ఉంటే ఆమె దగ్గరికి వస్తారు, ఆమె పూజ చేస్తే సమస్య తీరిపోతుంది. ఆమెకి మింక్ అనే 19 ఏళ్లు ఒక కూతురు కూడా ఉంటుంది. ఒక రోజు ఒక డాక్యుమెంటరీ టీమ్ నింగ్‌ని ఫాలో అవ్వడం మొదలెడుతుంది. ‘థాయ్ షామన్ మీడియంస్’ అని ఒక డాక్యు తీయడానికి. కెమెరా ఆన్ అయినప్పటి నుంచే సినిమా మొత్తం ఆ డాక్యు ఫుటేజ్‌లా కనిపిస్తుంది. మొదట్లో గ్రామంలో రోజువారీ జీవితం, నింగ్ పూజలు అంతా నార్మల్ గా ఉంటాయి.

Read Also : ఏడుగురు బాయ్ ఫ్రెండ్స్‌తో ఏంది భయ్యా ఆ అరాచకం… అలాంటి సీన్లున్న సినిమానే

Advertisement

అయితే కొన్ని రోజుల తర్వాత నింగ్ కూతురు మింక్ ఒక్కసారిగా వింతగా మారిపోతుంది. రాత్రిళ్లు ఒంటరిగా ఏడుస్తుంది. కళ్లు ఎర్రగా అయిపోతాయి, జంతువుల్ని చంపి, ఫ్యామిలీ మీదే దాడి చేస్తుంది. క్రమంగా నింగ్‌ కి ఒక భయంకరమైన సందేహం వస్తుంది. ఈ తరంలో బా యీ దేవత తనను కాకుండా మింక్‌ని ఎంచుకుందేమో అని అనుకుంటుంది. కానీ మింక్ ప్రవర్తన మరింత హింసాత్మకంగా ఉంటుంది. ఇది నిజంగా దేవతనా? లేక వేరే ఏదైనా రాక్షస శక్తా? ఇక్కడి నుంచి సినిమా ఒక్కసారిగా భయంకరమైన హారర్ రైడ్ అవుతుంది. నింగ్, ఆమె ఫ్యామిలీ, షామన్ గురువులు, క్రిస్టియన్ పాస్టర్లు కలిసి మింక్‌ ని మామూలుగా ఉంచడానికి ట్రై చేస్తారు. కానీ ఆ శక్తి అంత సులువుగా వదలదు. ఆ శక్తి దేవతనా లేక రాక్షస శక్తా అనేది చివరి సెకను వరకు టెన్షన్‌లో ఉంచుతుంది. చివరికి మింక్ ని ఆ వహించిన శక్తి దేవుడా ? దెయ్యమా ? ఆమెలో నూచి ఆ శక్తి పోతుందా ? ఈ శక్తి సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×