Friday OTT Releases : కొత్త శుక్రవారం వచ్చిందంటే బోలెడు సినిమాలు వస్తున్నాయని తెలిసిందే . ఇక ఈమధ్య చాలావరకు కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఈవారం చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి.. అందులో కేవలం కొన్ని సినిమాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీ భారీ అంచాలతో థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అయ్యగారు అకౌంట్లో హిట్ సినిమా పడిపోయినట్లు చూసేద్దాం…
ఓటీటీలోకి ఈ శుక్రవారం దాదాపు 14 సినిమాల వరకు స్ట్రీమింగ్ కూడా రానున్నాయి.. సమంత మా ఇంటి బంగారం స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. దీంతో పాటుగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, దర్శన్ నటించిన ది డెవిల్ మూవీతో పాటుగా వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. మరిక ఆలస్యమెందుకు ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి ఇక్కడ వివరంగా చూసేద్దాం..
ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (స్పానిష్ సిరీస్) – జూలై 17
ద ఈస్ట్ ప్యాలెస్ (కొరియన్ సిరీస్) – జూలై 17
డిజైర్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 17
23000 లైవ్స్ (జర్మన్ మూవీ) – జూలై 17
హార్ట్ స్టాపప్ ఫరెవర్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 17
25 ఇయర్క్ ఆఫ్ యూ(జపనీస్ సినిమా)- జూలై 17
స్పూకీ ఇన్ లవ్ (కొరియన్ సిరీస్) – జూలై 18
మా ఇంటి బంగారం (తెలుగు మూవీ) – జూలై 17
టెస్ట్ సబ్జెక్ట్ వీ (హిందీ డాక్యుమెంటరీ) – జూలై 18
ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు (తెలుగు సినిమా) – జూలై 17
ది డెవిల్(కన్నడ సినిమా)- జూలై 17
శివలోక్ కె కుండక్క మండక్క(యానిమేషన్ సిరీస్)- జూలై 17
డెజర్ట్ వారియర్(హాలీవుడ్ మూవీ)- జూలై 17
టెక్సాస్ చైన్ సా(హాలీవుడ్ మూవీ)- జూలై 17
ఓవెల్స్(తమిళ సినిమా)- జూలై 17
ది బే (హాలీవుడ్ మూవీ)- జూలై 17
ఈ సినిమాలతో పాటుగా మరో కొత్త సినిమా కూడా ఈవారం ఓటీటీలోకి వచ్చేసింది. మిగిలిన హిట్ టాక్ అందుకున్న సినిమాలు కూడా వచ్చేశాయి. ఇకపోతే ఈ వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఐశ్వర్య రాజేశ్ ‘ఓ సుకుమారి’, మాధవన్ ‘జీడీఎన్’, వదలా, రాజా ది రాజా, ఆపరేషన్ అరుణారెడ్డి, మహేంద్రగిరి వారాహి లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎటు చూసినా కూడా సినిమాలు మూవీ లవర్స్ ని పలకరించేందుకు పోటీ పడుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ కాబోతున్న సినిమాలకు అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. మరి జూలై మూడో వారంలో రిలీజ్ కాబోతున్న సినిమాలలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ విన్నర్గా నిలుస్తుందో చూడాలి.. ఇక జూలై నెలలో స్టార్ హీరోల సినిమాలు కూడా సందడి చేయబోతున్న విషయం తెలిసిందే.. మీకు నచ్చిన మూవీని చూసి ఎంజాయ్ చెయ్యండి…
Also Read :శుక్రవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..