E-Paper
Advertisement

నీట్ యూజీ-2026 ఫలితాలు.. 11.21 లక్షల మంది క్వాలిఫై, హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంక్

నీట్ యూజీ-2026 ఫలితాలు.. 11.21 లక్షల మంది క్వాలిఫై, హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంక్
Advertisement

NEET UG-2026 Re-Exam Results: దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ-2026 రీ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 11.21 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు.పంజాబ్‌ విద్యార్థి ఆర్యన్ గుప్తా, హర్యానా విద్యార్థి పాన్షుల్ ఇద్దరికీ టాపర్లుగా నిలిచారు. తెలంగాణ నుంచి హనుమకొండ విద్యార్థి 13వ ర్యాంకు దక్కించుకుంది.

నీట్ యూజీ-2026 ఫలితాలు-దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూసిన నీట్‌ యూజీ-2026 పునఃపరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ వంటి అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దాదాపు  11.21 లక్షల మంది అర్హత సాధించారు. అందులో  58.2 శాతం మహిళా విద్యార్థులు అర్హత సాధించారు.

Advertisement

11.21 లక్షల మంది క్వాలిఫై, దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాల్లో జూన్‌ 21న నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 20 లక్షల మంది హాజరయ్యారు. ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ గురువారం రాత్రి విడుదల చేసింది. విద్యార్థులు  తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్‌తో వెబ్‌ పోర్టల్‌ neet.nta.nic.in నుంచి తమ స్కోరు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలియచేసింది.

 హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంక్- ఇక ఫలితాల్లో పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పాన్షుల్ బన్సల్ 720 కి 715 మార్కులతో టాపర్లుగా నిలిచారు. ఫలితాల విడుదలకు కొన్ని గంటల ముందు ఆన్సర్ కీని విడుదల చేసింది ఎన్టీఏ. టాపర్లలో అత్యధికులు 17 నుంచి 19 ఏళ్ల వయసు విద్యార్థులు ఎక్కువ.

Advertisement

అత్యుత్తమ ర్యాంకులు సాధించిన రాష్ట్రల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. ఫలితాలను ప్రకటించడంతో అడ్మిషన్లు, కౌన్సెలింగ్ షెడ్యూల్‌ తేదీలను ప్రకటించడానికి వీలవుతుందని ఓ ప్రకటనలో పేర్కొంది ఎన్టీఏ.

ALSO READ: చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఇంతలోనే బిగ్ ట్విస్ట్.. అసలు ఏం జరిగిందంటే?

అంతేకాదు విద్యార్థుల సౌలభ్యం కోసం స్కాన్ చేసిన ఓఎంఆర్ షీట్లు, స్కోర్ ‌కార్డులను డిజిలాకర్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలియజేసింది. తెలంగాణలోని హనుమకొండకు చెందిన విద్యార్థి జాతీయ స్థాయిలో  13వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. 720 మార్కులకు గాను 705 మార్కులు సాధించాడు.

దేశవ్యాప్తంగా అత్యధిక మార్కులు సాధించిన 138 మందిలో 93 శాతం మంది మొదటిసారి నీట్‌ రాసినట్టు ఎన్‌ఏటీ వెల్లడించింది. విడుదలైన ఫలితాల్లో 19 మంది విద్యార్థులు 700కు పైగా మార్కులు సాధించారు. యూపీ నుంచి అత్యధికంగా 1.7 లక్షల మంది అర్హత సాధించిన వారిలో ఉన్నారు.

దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో దాదాపు 5,440 పరీక్షా కేంద్రాలను ఈ పరీక్ష కోసం ఏర్పాటు చేసింది. జూన్ 21న నిర్వహించిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌‌కు దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రవేశ పరీక్షను 13 భాషల్లో నిర్వహించింది ఎన్టీఏ.

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×