E-Paper
Advertisement

IMDbలో 8.2 రేటింగ్‌… మైండ్‌బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్‌ భయ్యా

IMDbలో 8.2 రేటింగ్‌… మైండ్‌బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్‌ భయ్యా
Advertisement

Best Kannada Movie : ఈ రోజుల్లో కన్నడ సినిమాలు ఓటీటీలో బాగా రాణిస్తున్నాయి. అలాంటి ఒక అద్భుతమైన సినిమా ‘గరుడ గమన వృషభ వాహన’. రాజ్ బి. శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్నేహం, ఆశ, అసూయ, పగల మధ్య సంఘర్షణను చాలా బలంగా చూపిస్తుంది. థియేటర్లలో విడుదలై మంచి స్పందన పొందిన ఈ సినిమా ఇప్పుడు ZEE5లో అందుబాటులో ఉంది. సస్పెన్స్, యాక్షన్, డ్రామా ఇష్టపడేవారు మిస్ అవ్వకుండా చూడాల్సిన చిత్రం ఇది.

సినిమా కథ ఏమిటి ?

కథ మంగళూరులోని మంగళదేవి ప్రాంతంలో సాగుతుంది. శివ – హరి ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇద్దరూ గ్రామంలో పలుకుబడి ఉన్నవాళ్లే. వారి పేరు వినగానే జనం భయంతో వణికిపోతారు. కానీ ఇద్దరి స్వభావాలు పూర్తిగా వేరు వేరుగా ఉంటాయి. శివ కోపిష్టి, హరి ప్రశాంతంగా, తెలివిగా ఉంటాడు. వారిద్దరి మధ్య గాఢమైన స్నేహం ఉంటుంది. కానీ ఆశ, అహం, అసూయ వచ్చేసరికి ఆ స్నేహం దెబ్బతింటుంది.

Advertisement

ఈ కథ కేవలం గ్యాంగ్‌స్టర్ డ్రామా మాత్రమే కాదు. స్నేహం ఎంత బలంగా ఉన్నా… ఒకే ఒక్క తప్పిదం వాళ్ళ మనుషుల మనస్తత్వం ఎలా మారిపోతుందో అద్భుతంగా చూపించారు ఈ సినిమాలో. బ్రహ్మౌయ్య అనే సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్ర కథలో కీలక మలుపు తీసుకొస్తుంది. శివ – హరి మధ్య ఉన్న గాఢమైన స్నేహం ఎలా బ్రేక్ అయ్యింది ? ఆ పగ ఎంత దూరం వెళ్తుంది ? అన్నది ఈ సినిమా కథాంశం.

నటీనటులు ఎవరు ?

ఈ సినిమాకు రాజ్ బి. శెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శివ పాత్రలో రాజ్ బి. శెట్టి, హరి పాత్రలో రిషబ్ శెట్టి అద్భుతంగా రాణించారు. ఇతర నటులు కూడా తమ పాత్రలకు జీవం పోశారు. ఈ సినిమాలో ప్రేమ కోణం లేదు కానీ స్నేహం, పగ, శక్తి మధ్య సంఘర్షణ చాలా బలంగా ఉంటుంది.

ఎందుకు చూడాలి?

Advertisement

ఈ చిత్రం సాధారణ గ్యాంగ్‌స్టర్ సినిమా కాదు. మనుషుల మనస్తత్వాన్ని బట్టి స్నేహం ఎంత సులభంగా మారిపోతుందో చాలా సహజంగా చూపించారు. యాక్షన్ సీన్లు, డైలాగులు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ అదిరిపోయేలా ఉంటాయి. IMDbలో మంచి రేటింగ్ సాధించిన ఈ సినిమా థ్రిల్లర్ లవర్స్‌కి మస్ట్ వాచ్. రాజ్ బి. శెట్టి నటన, దర్శకత్వం ఈ చిత్రానికి ప్రధాన బలం.

ఎక్కడ చూడాలి ?

ఈ సినిమా ZEE5 OTT ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. కన్నడలో ఉంది కాబట్టి సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. హిందీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. మీరు థ్రిల్లర్, యాక్షన్, డ్రామా ఇష్టపడితే ఇది బెస్ట్ ఛాయిస్.

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×