E-Paper
Advertisement

Gatha Vaibhava OTT : ఆషికా రంగనాథ్ కన్నడ రొమాంటిక్ ఫాంటసీ డ్రామా తెలుగులో స్ట్రీమింగ్… ఏ ఓటీటీలో ఉందంటే ?

Gatha Vaibhava OTT : ఆషికా రంగనాథ్ కన్నడ రొమాంటిక్ ఫాంటసీ డ్రామా తెలుగులో స్ట్రీమింగ్… ఏ ఓటీటీలో ఉందంటే ?
Advertisement

Gatha Vaibhava OTT : గత ఏడాది థియేటర్లలో అడుగుపెట్టిన కన్నడ ఫాంటసీ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా ‘గాథ వైభవ’. దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేక పోయింది. అయితే ఓటీటీలో దీనికి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందులో నాలుగు కథలను చూపించే ప్రయత్నం జరిగింది. నాలుగు కాలాల్లో ఒక వ్యక్తి ప్రేమ కథ చుట్టూ కథ తిరుగుతుంది. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

తెలుగులో స్ట్రీమింగ్

సుని దర్శకత్వం వహించిన ‘గాథ వైభవ’ (Gatha Vaibhava) సినిమా 2025 నవంబర్ లో థియేటర్లలో విడుదలైంది. అయితే కమర్షియల్ గా విజయం సాధించలేకపోయింది. 2026 జనవరి 1 నుంచి ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘గత వైభవం’ పేరుతో విడుదలైంది. ఇప్పుడు అంటే జనవరి 30 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడ, తెలుగు రెండింటిలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద బాగా రాణించకపోయినా, ఓటీటీలో కొంచెం బెట్టర్ గా నే ఈ సినిమా నడుస్తోంది. ఈ చిత్రానికి జుడా సాంధీ సంగీతం అందించగా, విలియం జె. డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు.

కథ ఏమిటంటే

Advertisement

ఈ కథ ఆర్టికల్చర్ స్టూడెంట్ అయిన ఆధునిక (ఆషికా రంగనాథ్) తన ఊహల్లో కనిపించే ఒక వ్యక్తి చిత్రాన్ని గీయడంతో మొదలవుతుంది. ఆ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అందులో ఉన్న వ్యక్తిని పోలి ఉన్న పురాతన్ (దుష్యంత్) ఆమెను కలవడానికి వస్తాడు. ఆధునిక అతన్ని చూడగానే, తామిద్దరం గత జన్మల ప్రేమికులమని, తమ మధ్య విడదీయలేని బంధం ఉందని చెబుతుంది. పురాతన్ మొదట దీన్ని నమ్మకపోయినా, ఆమె చెప్పే కథలు వాళ్ళను మూడు వేరు వేరు కాలాల్లోకి తీసుకువెళతాయి. ఆ ప్రేమికుల ప్రయాణం పురాణ కాలంలోని దేవలోకం నుండి ప్రారంభమై, పోర్చుగీస్ కాలం మీదుగా, ప్రస్తుత కాలమైన కర్ణాటక వరకు సాగుతుంది. ప్రతి జన్మలోనూ ఏదో ఒక కారణంతో విడిపోయిన ఈ జంట, ఈ కాలంలోనైనా కలుస్తారా లేదా అనేదే ఈ సినిమా మిగతా కథ.

Read Also : IMDbలో 7.8 రేటింగ్… థియేటర్లలో డిజాస్టర్‌… ఓటీటీలో మాత్రం 24 గంటల్లోనే ట్రెండింగ్‌ నంబర్ 1లో

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×