BigTV English

OTT Movie : కం*డోమ్ ఆంటీ ఇంట్లో అడ్డంగా దొరికిపోయే కుర్రాడు… హిలేరియస్ కామెడీ డ్రామా

OTT Movie : కం*డోమ్ ఆంటీ ఇంట్లో అడ్డంగా దొరికిపోయే కుర్రాడు… హిలేరియస్ కామెడీ డ్రామా

OTT Movie : ఫ్యామిలీ కష్టాలను కామిడీ గా చూపించే ప్రయత్నం చేసింది ఒక వెబ్ సిరీస్‌. ఈ సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఇందులో మిడిల్ క్లాస్ కంటెంట్ కావాల్సినంత ఉంది. ఒక షో చూడటం మొదలు పెడితే, ఇక ఆపకుండా చూస్తూనే ఉంటారు. ఈ సిరీస్‌ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ అమెరికన్ సిట్‌కామ్ సిరీస్‌ పేరు ‘జార్జ్ లోపెజ్'(George Lopez). ఈ సిరీస్ 2002 నుండి 2007 వరకు ABC ఛానెల్‌లో ప్రసారం అయింది. ఈ షోను కమెడియన్ జార్జ్ లోపెజ్, బ్రూస్ హెల్‌ఫోర్డ్, రాబర్ట్ బోర్డెన్ సృష్టించారు. ఇది మొత్తం ఆరు సీజన్‌లు, 120 ఎపిసోడ్‌లతో నడిచింది. ఈ సిరీస్‌లో జార్జ్ లోపెజ్ తన జీవితం ఆధారంగా ఒక కాల్పనిక పాత్రను పోషిస్తాడు. ఇందులో అతని వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితం చుట్టూ స్టోరీ నడుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

జార్జ్‌ లాస్ ఏంజిల్స్‌లోని పవర్స్ బ్రదర్స్ ఏవియేషన్ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. అతను తన భార్య ఆంజీ, తమ ఇద్దరు పిల్లలు, కార్మెన్ (పెద్ద కూతురు), మాక్స్ (చిన్న కొడుకు) తో కలసి జీవిస్తుంటాడు. జార్జ్‌కు చిన్నతనంలో తన తల్లి బెన్నీ నుండి ప్రేమలేని పెంపకం ఎదురైంది. బెన్నీ మద్యపానానికి అలవాటు పడి, స్వార్థపరమైన తల్లిగా ఉంటుంది. ఆమె తరచూ జార్జ్‌తో విభేదిస్తూ, అతని జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కథలో ఆంజీ అనే మరో ముఖ్య పాత్ర ఉంటుంది. ఇతని తండ్రి విక్ పాల్మెరో, ఒక ధనవంతుడైన డాక్టర్ గా ఉంటాడు. విక్ మొదట్లో జార్జ్‌ను అంతగా ఇష్టపడడు. అయితే కాలక్రమేణా వారి సంబంధం మెరుగుపడుతుంది. ఇతని కొడుకు ఒక ఆంటీ తో డేటింగ్ చేస్తాడు. ఈ సీన్స్ కడుపుబ్బ నవ్విస్తాయి.  జార్జ్ తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు. తన తల్లి బెన్నీతో ఉండే ఘర్షణలు, పిల్లల పెంపకంలో సవాళ్లు అతన్ని తరచూ ఇబ్బంది పెడతాయి.

జార్జ్ చిన్నతనంలో తన తండ్రి మానీ మరణించాడని బెన్నీ చెప్పినప్పటికీ, తరువాత అతను బతికే ఉన్నాడని తెలుస్తుంది. జార్జ్ తన తండ్రి మానీ ని కనుగొనే ప్రయత్నం చేస్తాడు. మానీ ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఫీనిక్స్‌లో కనిపిస్తాడు. కానీ అతడు చాలా కఠిన స్వభావం కలిగి ఉంటాడు. చివరికి, మానీకి కిడ్నీ వ్యాధి ఉందని తెలిసి, జార్జ్ కిడ్నీ దానం చేయడానికి సిద్ధపడతాడు. చివారికి ఇతని ఫ్యామిలీ కష్టాలు తీరుతాయా అనేది ఈ సిరీస్‌ చూసి తెలుసుకోండి. ‘George Lopez’ సిరీస్ లాటినో సంస్కృతిని, అమెరికన్ టెలివిజన్‌లో ప్రదర్శించిన తొలి షోలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది కుటుంబ విలువలు, హాస్యం, వ్యక్తిగత సవాళ్లను సమతుల్యంగా చూపిస్తూ, అనేక మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2007లో ఈ సిరీస్ ముగిసినప్పటికీ, తరువాత సిండికేషన్‌లో విజయవంతంగా ప్రదర్శించబడింది.

Also Read : తల్లి దండ్రులనే ఘోరంగా శిక్షించే సైకో పిల్లాడు.. చిన్న పిల్లలు పొరపాటున కూడా చూడకూడని మూవీ

Related News

OTT Movie : అమ్మాయిల్ని ఆ పని కోసమే పుట్టించే ఆణిముత్యం… లాభం లేదు ఒంటరిగా చూడాల్సిందే భయ్యా

OTT Movie : చంపి, శవాలపై U గుర్తు చెక్కే సీరియల్ కిల్లర్… ఒక్కో కేసులో ఒక్కో ట్విస్ట్… థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : మనిషి లోపల మకాం పెట్టే చిట్టి ఏలియన్స్… భూమిని తుడిచి పెట్టే ప్లాన్ తో రంగంలోకి.

OTT Movie: రేప్ కేసులో సీఎం, ప్రభుత్వాన్ని ఇరికించే లాయర్.. తప్పు బాధితురాలిదా? విడుదలైన గంటలోనే ఓటీటీలో సంచలనం

OTT Movie : చావు అంచులదాకా వెళ్లే హీరో… అపరిచితుల ఎంట్రీతో అల్టిమేట్ ట్విస్ట్… కడుపుబ్బా నవ్వించే మలయాళ కామెడీ

Sir Madam OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సార్ మేడమ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Big Stories

×