OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఈ స్టోరీ లను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. అన్ని భాషలలో ఈ సినిమాలు మంచి కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో తల్లి, దండ్రులనే 13 ఏళ్ల కొడుకు ఒక గోతిలో బంధిస్తాడు. ఆతరువాత అసలు స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘జాన్ అండ్ ది హోల్’ (John and the Hole). 2021 లో వచ్చిన ఈ మూవీకి పాస్కువల్ సిస్టో డైరెక్ట్ చేశారు. నికోలస్ జియాకోబోన్ రాసిన స్క్రిప్ట్ ఆధారంగా తీశారు. ఈ మూవీ జియాకోబోన్ రాసిన ‘El Pozo’ అనే చిన్న కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాలో చార్లీ షాట్‌వెల్, మైఖేల్ సి. హాల్, జెన్నిఫర్ ఎహ్లే, టైస్సా ఫార్మిగా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ 2021 సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఆగస్టు 6, 2021న IFC ఫిల్మ్స్ దీనిని థియేటర్లలో విడుదల చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ 13 ఏళ్ల జాన్ అనే బాలుడి చుట్టూ తిరుగుతుంది. అతను ఒక సంపన్న కుటుంబంలో జన్మిస్తాడు. జాన్ తల్లిదండ్రులు బ్రాడ్, అన్నా అలాగే తన అక్క లారీ తో కలిసి ఒక లగ్జరీ సబర్బన్ ఇంట్లో నివసిస్తాడు. బయటి నుండి చూస్తే జాన్ సంతోషం గా ఉన్నట్టు అనిపిస్తాడు. కానీ అతని లోపల ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. ఒక రోజు, జాన్ తన ఇంటి సమీపంలోని అడవుల్లో ఒక బంకర్‌ను కనిపెడతాడు. ఇది భూమిలో ఒక లోతైన గొయ్యి రూపం లో ఉంటుంది. ఎటువంటి కారణం లేకుండానే, అతను తన తల్లి వాడే మందులను ఉపయోగించి, తన కుటుంబ సభ్యులను మత్తులోకి తీసుకెళ్ళి ఆ బంకర్‌లో బంధిస్తాడు. ఆ తరువాత జాన్ ఇంటికి తిరిగి వచ్చి, తనకు నచ్చిన విధంగా జీవించడం ప్రారంభిస్తాడు.
తన తల్లిదండ్రుల కార్డ్‌లతో డబ్బు ఖర్చు చేయడం, కారు నడపడం, వీడియో గేమ్‌లు ఆడటం, స్వేచ్ఛగా ఉండటం వంటివి చేస్తాడు. బంకర్‌లో, అతని కుటుంబం మేల్కొన్నప్పుడు భయాందోళనలకు గురి అవుతారు. వారు జాన్‌ను బయటకు విడిచిపెట్టమని వేడుకుంటారు. కానీ అతను వారికి కొంత ఆహారం, నీరు మాత్రమే ఇస్తాడు. ఈ సమయంలో జాన్ స్వేచ్ఛను అనుభవిస్తూ, పెద్దవాడిగా ఉండటం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. చివరికి జాన్ తన కుటుంబాన్ని బంకర్ నుండి విడుదల చేస్తాడా ? అతను ఎందుకు అలా ప్రవర్తిస్తాడు ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.
Also Read : నీళ్ల కోసం టీనేజ్ అమ్మాయిల్ని అమ్మేసే కిరాతకులు… ప్రభాస్ కొరియన్ విలన్ కామెడీ బ్రూటల్ క్రైమ్ థ్రిల్లర్