Jabardast : బుల్లితెర ఫై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న కామెడీ షో జబర్దస్త్.. ఈ షో ద్వారా తమ టాలెంట్ ను నిరూపించుకొని స్టార్స్ గా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు. ఒకప్పుడు టాప్ రేటింగ్‌తో దూసుకుపోయిన జబర్దస్త్ కామెడీ షో పరిస్థితి ఇప్పుడెలా అయిందో అందరికీ తెలిసిందే. అప్పటి కమెడియన్లు అందరూ వెళ్లిపోవడంతో కొత్త వాళ్లతో బండి లాగిస్తుంది జబర్దస్త్. అయితే చాలా సందర్భాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు, బోల్డ్ కామెడీతో స్కిట్లు చేస్తున్నారంటూ ఆడియన్స్ విమర్శించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఓ నటుడు జబర్దస్త్ ఫై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అవకాశం ఇస్తామని దారుణంగా అవమానించారని ఆ వీడియో తెలిపాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది..
శివరాల్ ఇంటర్వ్యూ..
మరగుజ్జు శివలాల్ పేరు ఇప్పటివాళ్లకు పెద్దగా తెలియదు కానీ అప్పటివాళ్లకు మాత్రం బాగా తెలిసే ఉంటుంది. మరగుజ్జు అయిన ఈయన అప్పట్లో పని సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత దురదృష్టం వల్ల అవకాశాలు దూరమయ్యాయి. ఎక్కడా పని దొరకలేదు. తన హైట్ కారణంగా అతన్ని ఎవ్వరు పనిలో పెట్టుకోలేదు. అయితే జబర్దస్త్ షో కు వెళ్తే అవకాశాలు లేవు అని దారుణంగా అవమానించారు అని తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో బయట పెట్టారు. రమ్మని పిలిచి ఇంత మోసం చేస్తారని అనుకోలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో జబర్దస్త్ ఫై మండిపడుతున్నారు.
Also Read: సినిమా తియ్యడం రాకపోతే దొబ్బేయ్.. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌కు ఊహించని సెగ!
పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన శివలాల్..
అంగవైకల్యం- ఆత్మవిశ్వాసం ఈ రెండింటికి ఎప్పుడూ పోటీయే. సంకల్పబలం ఉంటే ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. అదే జరిగింది మరుగుజ్జు శివలాల్ విషయంలో .పొట్టివాడు.. వీడు సైకిల్ కూడా తొక్కలేడు అని ఎగతాళి చేసిన నోర్లకు తాళం వేసాడు. పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పోంది ఔరా అనిపించారు. ఫోర్ వీలర్ పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది తోటి మరుగుజ్జులకు ఆదర్శంగా నిలిచాడు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు. 39 ఏళ్ల జి.శివలాల్ మరుగుజ్జు. బీకాం చదివాడు. మరుగుజ్జు మహిళనే వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు. చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరుగుజ్జులకు డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇవ్వలేదు. ఉన్నతాధికారులు వారంపాటు ఈ విషయంపైనే చర్చించి చివరకు ఆగస్టు 2021న శివలాల్ కు పర్మనెంట్ లైసెన్స్ జారీ చేశారు. తెలంగాణలో ఉన్న సుమారు 400 మంది మరుగుజ్జుల లో డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తి శివలాల్ కారు నడపటం కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. పాత సినిమాల్లో బాగా ఫేమస్ అయిన ఆయన ఇక ముందు సినిమా అవకాశాలు చేస్తానని చెబుతున్నాడు.. మరి ఏ డైరెక్టర్ అయిన ఆయన కోసం మంచి పాత్ర రాస్తారేమో చూడాలి..