BigTV English

OTT Movie : తల్లీ కూతుర్లు ఇద్దరూ ఒక్కడితోనే… బాబోయ్ అన్నీ అలాంటి సీన్లే… ఇదెక్కడి తేడా యవ్వారంరా అయ్యా

OTT Movie : తల్లీ కూతుర్లు ఇద్దరూ ఒక్కడితోనే… బాబోయ్ అన్నీ అలాంటి సీన్లే… ఇదెక్కడి తేడా యవ్వారంరా అయ్యా

OTT Movie : ఒక సున్నితమైన కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా మూవీ ఓటీటీలో హీట్ పుట్టిస్తోంది. తల్లి-కూతుర్ల మధ్య ఒక యువకుడు రావడంతో స్టోరీ టర్న్ అవుతుంది. ఈ సినిమా, హిమాలయన్ కొండలలో ఉన్న ఒక బోర్డింగ్ స్కూల్ నేపథ్యంలో జరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

“గర్ల్స్ విల్ బి గర్ల్స్” (Girls Will Be Girls) 2024లో విడుదలైన ఇండో-ఫ్రెంచ్ కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా చిత్రం. దీనికి శుచి తలతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా పుషింగ్ బటన్స్ స్టూడియోస్, డోల్స్ వీటా ఫిల్మ్స్, క్రాలింగ్ ఏంజెల్ ఫిల్మ్స్ ద్వారా నిర్మించబడింది. ఇందులో ప్రీతి పాణిగ్రహి (మీరాగా), కాని కుసృతి (అనిలాగా), కేసవ్ బినోయ్ కిరోన్ (శ్రీగా) నటించారు. 118 నిమిషాల నిడివి గల ఈ ఈ సినిమా IMDbలో 7.1/10 రేటింగ్‌ను పొందింది. 2024 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ సినిమా డ్రామాటిక్ కాంపిటీషన్‌లో ప్రీమియర్ అయింది. ఇక్కడ ఇది ఆడియన్స్ అవార్డుతో పాటు ప్రీతి పాణిగ్రహికి స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకుంది. ఇది MAMI ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లో NETPAC అవార్డు, యంగ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు, ఫిల్మ్ క్రిటిక్స్ గిల్డ్ జెండర్ సెన్సిటివిటీ అవార్డును కూడా గెలుచుకుంది. ఇది 2024 డిసెంబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

హిమాలయన్ కొండలలో ఉన్న ఒక కఠినమైన బోర్డింగ్ స్కూల్‌లో, 16 ఏళ్ల మీరా తన స్కూల్‌లో మొదటి మహిళా హెడ్ ప్రిఫెక్ట్‌గా ఎంపిక అవుతుంది. ఆమె అకడమిక్ టాపర్, స్కూల్ నియమాలను కఠినంగా పాటించే మోడల్ విద్యార్థిని. అంతేకాకుండా ఉపాధ్యాయులకు ఇష్టమైన విద్యార్థిని. మీరా స్కూల్‌లో డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తూ, ఉదయం ప్రతిజ్ఞను నడిపిస్తూ, విద్యార్థులు, ప్రిన్సిపల్ మధ్య లైసన్‌గా పనిచేస్తుంది. అయితే ఆమె ఈ బాధ్యతలను భారంతో పోరాడుతుంది. ఈ క్రమంలో ఒక కొత్త విద్యార్థి, హాంకాంగ్ నుండి వచ్చిన శ్రీ , స్కూల్‌లో చేరినప్పుడు, మీరా అతని పట్ల ఆకర్షణలో పడుతుంది. ఇది ఆమె మొదటి ప్రేమకు దారితీస్తుంది. ఇక వీళ్ళు రహస్యంగా టెర్రస్‌పై కలుసుకోవడం, రాత్రిపూట ఫోన్ కాల్స్ వంటి క్షణాలతో సమయం తెలీకుండా గడుపుతారు. ఇంతలో మీరా తల్లి, అనిలా హరిద్వార్ నుండి పరీక్షల సమయంలో మీరాకు సహాయం చేయడానికి వస్తుంది. అనిలా తన యవ్వనాన్ని నిరాశతో గడిపి ఉంటుంది. ఆమె భర్తతో సంతృప్తి లేని జీవితం గడిపింది.

అయితే ఆమె మీరా అకడమిక్ విజయాన్ని తన స్వంత విజయంగా భావిస్తుంది. మీరాను కాంట్రొల్ లో పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆమె గ్రేడ్‌లు పడిపోతే తన భర్త ఆమెను నిందిస్తాడని భయపడుతుంది. మీరా, శ్రీ తో ప్రేమలో ఉన్నప్పుడే, అనిలా శ్రీతో సన్నిహితంగా మాట్లాడటం ప్రారంభిస్తుంది. ఇది మీరాకు అసూయను కలిగిస్తుంది. ఆమె తన యవ్వనాన్ని తిరిగి పొందాలని అనుకుంటుంది. మరోవైపు స్కూల్‌లో, మీరా హెడ్ ప్రిఫెక్ట్‌గా తన పాత్రలో సవాళ్లను ఎదుర్కొంటుంది. టీచర్స్ డే సందర్భంగా, ఆమె సహవిద్యార్థులు ఆమె అధికారాన్ని గౌరవించకుండా ఆమెను ఎగతాళి చేస్తారు. ఆమె కొంతమంది అబ్బాయిలను అనుచిత ప్రవర్తనను రిపోర్ట్ చేసినప్పుడు, వారు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమెను వెంబడిస్తారు. ఇది ఒక భయంకరమైన సన్నివేశంలో మీరాను గర్ల్స్ హాస్టల్‌లో లాక్ చేసుకోవడానికి దారితీస్తుంది. ఈ సంఘటన అనిలా, స్కూల్ ప్రిన్సిపల్ మిస్ బన్సల్ మధ్య గొడవకు దారితీస్తుంది. ఇక క్లైమాక్స్‌ ఉహించని మలుపుతో ఎండ్ అవుతుంది. ఈ తల్లీ, కూతుర్ల లవ్ ట్రాక్ ఏమవుతుంది ? స్కూల్ లో మీరాకి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఫ్రీగా వచ్చింది కదాని కక్కుర్తి పడితే, అందంగా చంపేసే అద్దం… అల్టిమేట్ హర్రర్ మూవీ

Related News

OTT Movie : పుట్టినరోజునే బలి… బర్త్ డేను డెత్ డే చేసే మాస్క్ కిల్లర్… టైం లూప్ లో చచ్చి బతుకుతూ… లాస్ట్ ట్విస్ట్ అదుర్స్

OTT Movie : కోరి శాపాన్ని కొని తెచ్చుకునే ఫ్యామిలీ… నెక్లెస్ కు దెయ్యాలతో లింక్… సీట్ చిరిగిపోయే హర్రర్ మూవీ

OTT Movie’s: ఘాటీ, మదరాసి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : పిచ్చి అమ్మాయిలను కిరాతకంగా అనుభవించే సైకో డాక్టర్… బ్లాక్ మార్కెట్ లో బాడీ పార్ట్స్… భయంకరమైన రియల్ స్టోరీ సామీ

OTT Movie : ముసలోడే కానీ మహానుభావుడు… ఆడవాళ్లు కన్పిస్తే అదే పని… అవార్డు విన్నింగ్ మలయాళ మూవీ

OTT Movie : పని మనిషితో ఇంటి ఓనర్ రాసలీలలు… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న హర్రర్ మూవీ

Big Stories

×