OTT Movie : ఒక డిఫరెంట్ స్టోరీతో వచ్చిన మరాఠీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కొడుకుని చదివించుకోవడానికి ఒక తల్లి చేసే పోరాటాన్ని చూపిస్తుంది. ఈ సినిమా 48వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో వివాదాస్పదంగా తొలగించబడినప్పటికీ నటన, కథనం కోసం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతే కాకుండా ఛాయా కదమ్ ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
జీ5లో స్ట్రీమింగ్
2018లో విడుదలైన ఈ మరాఠీ మూవీ పేరు “న్యూడ్” (Nude). దీనికి రవి జాధవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సచిన్ కుండల్కర్ రాసిన స్క్రీన్‌ప్లేతో, సిర్ జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో ఒక మోడల్‌గా పనిచేసే ఒక స్త్రీ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో కల్యాణీ మూలే, ఛాయా కదమ్, మదన్ దేవధర్, ఓం భుట్కర్, నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రల్లో నటించారు. 112 నిమిషాల నిడివి గల ఈ చిత్రం 2018 ఏప్రిల్ 27న థియేటర్లలో విడుదలైంది. IMDbలో ఈ సినిమాకి 7.3/10 రేటింగ్ ఉంది. జీ5 (Zee5) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
యమునా ఒక గ్రామంలో తన కొడుకు లక్ష్మణ్, శాడిస్ట్ భర్తతో జీవిస్తుంటుంది. ఆమె భర్త బహిరంగంగా వేరొక స్త్రీతో సంబంధం కలిగి ఉంటాడు. యమునా ఆదాయాన్ని, ఆభరణాలను ఆ స్త్రీపై ఖర్చు చేస్తుంటాడు. ఒక రోజు ఆమె భర్త ఆమెను గ్రామంలో బహిరంగంగా అవమానించిన తర్వాత, యమునా తన కొడుకుతో ముంబైకి వెళ్లి, తన అత్త చంద్రక్కా వద్ద ఆశ్రయం పొందుతుంది. చంద్రక్కా ముంబై డాక్‌ల సమీపంలోని ఒక స్లమ్‌లో నివసిస్తూ, సిర్ జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో ఒక ఆర్ట్ మోడల్‌గా పనిచేస్తుంది. ఇక యమునా ఉద్యోగం కోసం వెతుకుతూ నిరాశకు గురవుతుంది. చంద్రక్కా చేసే ఉద్యోగం గురించి ఆమె తెలుసుకుంటుంది. చంద్రక్కా గత 15-20 సంవత్సరాలుగా ఈ పని చేస్తూ, ఇది కాలేజ్ విద్యకు సహకరించే గౌరవనీయమైన పని అని యమునాకు వివరిస్తుంది. ప్రారంభంలో ఆమె సంకోచించినప్పటికీ, యమునా తన కొడుకు విద్య కోసం డబ్బు సంపాదించేందుకు మోడల్‌గా పనిచేయడానికి అంగీకరిస్తుంది.
ఆమె ఈ ఉద్యోగంలో స్థిరపడుతూ, గౌరవనీయమైన ఆదాయాన్ని సంపాదిస్తుంది. స్కూల్‌లో ఒక విద్యార్థి మాత్రమే ఆమె పట్ల శ్రద్ధ చూపిస్తాడు, మిగిలిన వారు ఆమెను పెద్దగా పట్టించుకోరు. యమునా తన కొడుకు చదువుకు డబ్బులు సమకూర్చడంలో సంతోషంగా ఉంటుంది. లక్ష్మణ్ చదువు ఖర్చులు పెరుగుతున్నందున, యమునా అయిష్టంగా ప్రైవేట్ అసైన్‌మెంట్లను తీసుకుంటుంది. ప్రఖ్యాత కళాకారుడు మల్లిక్ సాహబ్ కోసం టాప్ లేకుండా పోజ్ ఇస్తుంది. అయితే ఈ చిత్రాలు వివాదాన్ని రేకెత్తిస్తాయి. ఆందోళనకారులు కళాశాలపై దాడి చేసి ఈ చిత్రాలను ధ్వంసం చేస్తారు. యమునా దీనికి భయపడినప్పటికీ, తిరిగి పనిని ప్రారంభిస్తుంది. ఈ సమయంలో, చంద్రక్కా కీళ్ల నొప్పులతో బాధపడుతూ పని చేయలేకపోతుంది. లక్ష్మణ్ ఆమెను వ్యభిచారిగా ఆరోపించడంతో, యమునా మానసికంగా కుంగిపోతుంది. చివరికి లక్ష్మణ్ తన తల్లి త్యాగాన్ని అర్థం చేసుకుంటాడా ? యమునా ఈ పని చేయడం మానుకుంటుందా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : 43 మంది మహిళలు ప్రెగ్నెంట్… ఒకే రోజు గర్భం దాల్చి, పిల్లలకు జన్మనిచ్చే తల్లులు… లాస్ట్ ట్విస్ట్ వేరే లెవెల్