OTT Movie : ఒడియా సినిమా ఇండస్ట్రీలో ఒక హారర్ సినిమా ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. ఇది ఒడియా సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమాని మెచ్చుకున్నాడు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
సిద్ధార్థ్ మ్యూజిక్ లో స్ట్రీమింగ్
ఈ హారర్-కామెడీ మూవీ పేరు “బౌ బుట్టు భూత” (Bou Buttu Bhuta). 2025లో విడుదలైన ఈ సినిమాకి జగదీష్ మిశ్రా దర్శకత్వం వహించారు. బాబుషాన్ ఫిల్మ్స్ బ్యానర్‌లో త్రిప్తి సత్పతి దీనిని నిర్మించారు. ఈ చిత్రం రాజా పర్బ సందర్భంగా జూన్ 12, 2025న థియేటర్లలో విడుదలైంది. ఒడియా సినిమా ఇండస్ట్రీ (ఓలీవుడ్)లో ఒక ముఖ్యమైన చిత్రంగా గుర్తింపు పొందింది. ఇందులో బాబుషాన్ మొహంతి, అర్చిత సాహు, అపరాజిత మొహంతి, అనుగులియా బంటి, చౌధురి జయప్రకాష్ దాస్, ఉదిత్ గురు, మరియు రవి మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 3 గంటల 8 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఈ సినిమా IMDbలో 8.3/10 రేటింగ్ ను కలిగి ఉంది. ఈ సినిమా సిద్ధార్థ్ మ్యూజిక్ OTT ప్లాట్ ఫామ్‌లో అందుబాటులో ఉంది
స్టోరీలోకి వెళితే
ఒడిశాలోని ఒక గ్రామంలో, బుట్టు అనే ఒక చేపల రైతు, తన తల్లి రత్నమాలతో సాదాసీదాగా జీవిస్తుంటాడు. రత్నమాలకు ఒక మంత్రగత్తెగా గుర్తింపు ఉంటుంది. ఆమె మాయాశక్తుల వల్ల గ్రామ సంప్రదాయాలతో గౌరవించబడుతుంది. బుట్టు, తన గ్రామ జీవితం నుండి బయటపడి మెరుగైన భవిష్యత్తును సాధించాలని కలలు కంటాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు అతనికి అడ్డుగా నిలుస్తాయి. ఆ గ్రామంలో ఉండే డాక్టర్ కుమార్తె రింకి బుట్టుతో ప్రేమలో ఉంటుంది. కానీ బుట్టు ఆమె పట్ల అంతగా ఆసక్తి చూపడు. తన కలలపై దృష్టి పెడతాడు. ఒక రోజు గ్రామంలో అనూహ్య సంఘటనలు జరుగుతాయి. ఒక పురాతన శాపం గురించిన ఫోక్‌లోర్, “జంగిల్ కు జిబు? కోలి ఖైబు? బాఘా ఆసిలే దరిబుని?” (జంగిల్‌కు వెళ్తావా? బెర్రీలు తింటావా? పులి వస్తే భయపడవా?) అనే కథ ఆధారంగా, గ్రామంలో ఒక భయంకరమైన ఆత్మ బయటికి వస్తుంది.
బుట్టు ఒక రాత్రి ఈ ఆత్మను ఎదుర్కొంటాడు. ఇది అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఈ సంఘటన తర్వాత, బుట్టు తన తల్లి రత్నమాల గురించి తెలుసుకుంటాడు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, బుట్టు రత్నమాల ఈ ఆత్మను ఎదుర్కోవడానికి ఒక ప్రయత్నిస్తారు. చివరికి బుట్టు ఈ ఆత్మని ఎలా ఎదుర్కొంటాడు ? రింకితో అతని ప్రేమ కథ ఏమవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.
Read Also : పని మనిషిగా వచ్చి యజమానితో రాసలీలలు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా