Fantasy Horror drama: వృద్ధాప్యం వస్తే పింఛన్ తీసుకోవడం కాకుండా ఇంకా ఏమేం చేస్తారు ? అప్పటికే బాధ్యతలు అన్నీ తీరిపోయి ఉంటాయి కాబట్టి కృష్ణా రామా అనుకుంటూ, గతాన్ని తలుచుకుంటూ ఓ మూలాన కూర్చుంటారు. మీరు కూడా ఇలాగే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ లో ఓల్డ్ బ్యాచ్ అంతా కలిసి చేసే అడ్వెంచర్ ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ సిరీస్ పేరే ‘ది బరోస్’ (The Boroughs). మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అన్న విశేషాలపై ఒక లుక్కేద్దాం పదండి.
కథ న్యూ మెక్సికో ఎడారి మధ్యలో ఉన్న ‘ది బరోస్’ అనే విలాసవంతమైన రిటైర్‌మెంట్ కమ్యూనిటీలో మొదలవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే అది ఒక ఓల్డేజ్ హోమ్. భార్యను కోల్పోయిన బాధలో ఉన్న సామ్ కూపర్ అనే సినీయర్ సిటిజన్ మన హీరో. తనకు ఇష్టం లేకపోయినా ఈ కాలనీలోకి వస్తాడు. మొదట్లో అంతా మామూలుగానే ఉంటుంది. కానీ ఒకరోజు రాత్రి అతని స్నేహితుడు జాక్ ను ఒక అతీంద్రియ జీవి దారుణంగా చంపేస్తుంది.
సామ్ కళ్లారా చూసిన ఆ దృశ్యం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ జీవి సాధారణ రాక్షసి కాదు. అది మనుషుల మెదడులోని ఒక ప్రత్యేక ద్రవాన్ని పీల్చుకుంటూ, వారి జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని దొంగిలిస్తుంది. ఆ ఒక్క వ్యక్తి మీద మాత్రమే కాకుండా, ఆ కాలనీలోని అనేక మంది వృద్ధులపై ఆ రాక్షసి దాడి చేస్తుంది. ఈ భయంకర సత్యాన్ని తెలుసుకున్న సామ్ ఒంటరిగా ఈ పోరాటం చేయడం సాధ్యం కాదని గ్రహిస్తాడు.
అప్పుడే జాక్, రెనీ, జూడీ, వాలీ, ఆర్ట్ వంటి తోటి వృద్ధులను కలిపి ఒక టీమ్ ఏర్పాటు చేస్తాడు. వాళ్ళను తమను తాము ‘ది గ్రే రెబెలియన్’ అని పిలుచుకుంటారు. ఈ వృద్ధుల గుంపు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో బాధ, ఆశలు ఉంటాయి. కానీ ఆ భయంకర జీవిని ఓడించడానికి వీళ్ళంతా ఒక్కటవుతారు. ఇప్పటికే చాలా తక్కువగా ఉన్న తమ సమయాన్ని కాపాడుకోవాలని, తమ కాలనీని, అలాగే ప్రపంచాన్ని కాపాడుకోవాలని డిసైడ్ అవుతారు.
ఈ క్రమంలో కాలనీ మేనేజర్ బ్లెయిన్ షా ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా మారుతుంది. అతని ప్రవర్తన ఎందుకు అలా ఉంది ? ఆ అతీంద్రియ జీవి ఎక్కడి నుండి వచ్చింది ? దాని టార్గెట్ ఏంటి అసలు ? అనే ప్రశ్నలకు సమాధానం కావలంటే ఈ సిరీస్ ను వీక్షించాల్సిందే.
ప్రశాంతమైన ఎడారి ప్రాంతంలో ఒక అందమైన రిటైర్‌మెంట్ కాలనీ… పైకి చూస్తే ఎంతో ఆనందంగా కనిపిస్తుంది. కానీ ఆ ప్రశాంతత వెనుక దాగి ఉన్న భయంకరమైన రహాస్యమే ఈ సిరీస్ కథ. స్ట్రేంజర్ థింగ్స్ మేకర్స్ డఫర్ బ్రదర్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా పని చేసిన ఈ సిరీస్ Netflixలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. 2026 మే 21న విడుదలైన ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ హారర్ అద్భుతంగా ఉంటుంది.
Read Also: