E-Paper
Advertisement

GST on OTT : దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్ వీడు… కన్నడ కామెడీ హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్

GST on OTT : దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్ వీడు… కన్నడ కామెడీ హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్
Advertisement

GST on OTT : హర్రర్ సినిమాలకు పెరిగిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ కొత్త కొత్త కథలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. సాధారణంగా హర్రర్ సినిమాలంటే ఎవరో ఒకరికి దెయ్యం పట్టడం, లేదా ఏదైనా బంగాళాలో దెయ్యం చిక్కుకుపోవడం వంటి కథలే ఎక్కువగా వస్తాయి. ఇక ఇందులో కామెడీని యాడ్ చేస్తే అదో రకం జానర్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మాత్రం ఇంకాస్త డిఫరెంట్ గా ఉంటుంది. మరి ఈ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2025 నవంబర్ 28న థియేటర్లలో విడుదలైన కన్నడ హారర్ కామెడీ చిత్రం ‘గోస్ట్స్ ఇన్ ట్రబుల్’ (GST). డైరెక్టర్ గా టాకింగ్ స్టార్ సృజన్ లోకేష్ దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ ఇదే. సృజన్ లోకేష్ దివంగత నటుడు-చిత్రనిర్మాత సుబ్బయ్య నాయుడు మనవడు. దివంగత నటుడు లోకేష్, ప్రముఖ నటి గిరిజా లోకేష్ కుమారుడు. ఈ చిత్రంలో రజని భరద్వాజ్, శోభరాజ్, గిరి శివన్న, శరత్ లోహితాశ్వ, వినోద్ గోబరగల, తబలా నాని, గిరిజా లోకేష్, సుకృత్ సృజన్ లోకేష్, నివేదిత గౌడ తదితరులు నటించారు. ప్రముఖ రాపర్, మ్యూజిక్ డైరెక్టర్ చందన్ శెట్టి సంగీతం అందించారు. సినిమా హారర్ కామెడీ జానర్ లో భూమిపై అసంపూర్తిగా ఉన్న దెయ్యాల గుంపు గురించి సరదాగా, భయంకరంగా తెరకెక్కించారు. 120 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ సినిమా థియేటర్లలో మూడు వారాలు మాత్రమే ఆడింది. కేవలం రూ. 1.12 కోట్లు వసూలు చేసింది. హర్రర్ కామెడీ జానర్, ప్రముఖ తారాగణం ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయింది. కలర్స్ కన్నడతో సృజన్ సుదీర్ఘ అనుబంధం దృష్ట్యా శాటిలైట్ హక్కులు మంచి ధరకే అమ్ముడయ్యాయి.

Advertisement

Also Read : పేరుతోనే వివాదం రాజేసిన సిరీస్… రంగంలోకి ముఖ్యమంత్రి… దెబ్బకు రూటు మార్చిన ఓటీటీ

ఇక డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియోకు వెళ్లాయి. స్ట్రీమర్ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 13 నుండి అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. హారర్ కామెడీ కోసం శుక్రవారం ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. థియేటర్లలో కన్నడ భాషలో విడుదలైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం తెలుగులో కూడా అందుబాటులో ఉండవచ్చు. థియేటర్లలో విడుదలైన మూడు వారాలలోనే ఓటీటీలోకి వస్తున్న ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

కథలోకి వెళ్తే…

Advertisement

సృజన్ చెప్పిన కథ ఆధారంగా ‘గోస్ట్స్ ఇన్ ట్రబుల్’ అనే కథను రూపొందించారు. సినిమా లక్కీ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతని పేరుకు ఆపొజిత్ గా, అతన్ని ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది. ఆ దురదృష్టం ఎంత దారుణంగా ఉంటుందంటే అతని తండ్రి అతన్ని గెంటేస్తాడు. తల్లి మీద ఆధారపడి బతుకుతాడు. అయితే ఆమె కూడా మరణించడంతో హీరో జీవితం శూన్యంగా మారుతుంది. దీంతో లక్కీ ఇకపై తాను బతకడంలో అర్థం లేదని భావించి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. అతని ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు, భూమిపై తమ అసంపూర్ణ ఆశలను పూర్తి చేయడానికి, మోక్షాన్ని కనుగొనడంలో సహాయం చేయమని అతన్ని కలుస్తుంది. సమస్య ఏమిటంటే లక్కీ కొత్త స్నేహితులందరూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి అతను వారికి సహాయం చేయలేడు. వాళ్ళు బ్యాంకును కొల్లగొడితే తప్ప. మరి ఆ దెయ్యాలు దోపిడీ చేస్తాయా ? హీరో వాళ్ళకు ఎలా హెల్ప్ చేశాడు ? అన్నది కథ.

Related News

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

Big Stories

Advertisement
×