E-Paper
Advertisement

సడెన్ గా మరో ఓటీటీలోకి వచ్చిన గుణశేఖర్ యుపోరియా ..ఎక్కడ చూడొచ్చంటే!

సడెన్ గా మరో ఓటీటీలోకి వచ్చిన గుణశేఖర్ యుపోరియా ..ఎక్కడ చూడొచ్చంటే!
Advertisement

Euphoria OTT: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ దర్శకుడు గుణశేఖర్(Guna Sekhar) ఒకరు. గుణశేఖర్ సినిమాలంటే ఒకానొక సమయంలో బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకునేవి. అయితే ఇటీవల కాలంలో గుణశేఖర్ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా తర్వాత గుణశేఖర్ కాస్త విరామం తీసుకుని ఇటీవల యుఫోరియా (Euphoria) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సీనియర్ నటి భూమిక, సారా అర్జున్, గౌతమ్ మీనన్ వంటి తదితరులు ప్రధానపాత్రలలో నటించిన ఈ సినిమా థియేటర్లలో అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

రెండు ఓటీటీలలో యుఫోరియా స్ట్రీమింగ్..

హైదరాబాదులో జరిగిన ఒక నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీ ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఈ సినిమా ఈటీవీ విన్ లో అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ రెండో తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారమవుతుంది. ఈ సినిమా మరో ఓటీటీలోకి అందుబాటులోకి రావడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారం కాబోతోందనే విషయానికి వస్తే..

ఆహా వీడియోలో యుఫోరియా..

Advertisement

ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీతో పాటు ఆహా వీడియోలో కూడా అందుబాటులోకి రాబోతోంది. ఈ విషయాన్ని ఆహా తన అధికారక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తూ మనసుకు గట్టిగా తగిలే యుఫోరియా ద ఫిలిం ఆహా వీడియోలో ఏప్రిల్ 22 నుంచి ప్రసారం కాబోతోంది. ఈ సినిమా నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా అనే క్యాప్షన్ తో స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఈ సినిమాని ఇప్పుడు ఈటీవీ విన్ మాత్రమే కాకుండా ఆహాలో కూడ చూసే వెసులుబాటును కల్పించింది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే..

Advertisement

ఐఏఎస్ చదవాలని లక్ష్యంతో 17 ఏళ్ల అమ్మాయి చైత్ర (సారా అర్జున్) ఫ్రెండ్స్ బలవంతం మేరకు ఒక పార్టీకి వెళ్తారు. అయితే ఆ పార్టీలో పెద్ద కుటుంబాలకు చెందిన ఐదుగురు మైనర్ కుర్రాళ్ళు చైత్ర పై అఘాయిత్యానికి పాల్పడతారు. ఇలా అఘాయిత్యానికి పాల్పడిన కుర్రాళ్లలో భూమిక కుమారుడు కూడా ఉండటం విశేషం. ఇలా ఈ ఘటన తర్వాత చైత్ర కుటుంబం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది? ఆమె ఐఏఎస్ కల నెరవేరిందా? ఆమెపై దాడికి పాల్పడిన కుటుంబాలు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Also Read: పెద్ది షూట్ అప్డేట్.. కిరాక్ ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్..

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×