BigTV English

OTT Movie : ఐఎండీబీలో రేటింగ్ 9 ఉన్న ట్రూ స్టోరీ… ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలంటే ధైర్యం కావాలి మావా

OTT Movie : ఐఎండీబీలో రేటింగ్ 9 ఉన్న ట్రూ స్టోరీ… ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలంటే ధైర్యం కావాలి మావా

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ఓటీటీలలో బాగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. భాషతో ప్రమేయం లేకుండా, ఇటు వంటి సినిమాలను ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. ఓటీటీలో కూడా ఈ మూవీ దూసుకుపోతోంది. ఇందులో విజయ్ ఆంటోనీ తన నటనతో మరోసారి మెప్పించాడు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘హత్య’ (Hatya). 2023 లో విడుదలైన ఈ మూవీకి బాలాజీ కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ బ్యానర్‌పై తమిళంలో ‘కొలై’ పేరుతో రూపొంది, తెలుగులో డబ్ అయ్యింది. ఇందులో విజయ్ ఆంటోనీ, రితికా సింగ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 1923 లో జరిగిన ఒక రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే 

లైలా ఒక ప్రొఫెషనల్ మోడల్ గా, సింగర్ గా పేరు తెచ్చుకుంటుంది. అయితే ఆమె ఒక రోజు తన అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురవుతుంది. ఆశ్చర్యకరంగా హత్య జరిగిన సమయంలో, ఆమె ఫ్లాట్ లోపలి నుండి లాక్ చేయబడి ఉంటుంది. ఈ కేసును సాల్వ్ చేయడానికి కష్టంగా మారుతుంది. కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారి సంధ్యా మోహన్ రాజ్, ఈ కేసును ఛేదించే బాధ్యత తీసుకుంటుంది. ఆమె దీని కోసం ప్రైవేట్ డిటెక్టివ్ అయిన వినాయక్ సహాయం కోరుతుంది.

వినాయక్ మొదట్లో ఈ కేసును ఒప్పుకోవడానికి సంకోచిస్తాడు. కానీ తర్వాత సంధ్యతో కలిసి ఈ కేసును పరిశీలిస్తాడు. వీళ్ళు లైలాతో సంబంధం ఉన్న నలుగురు అనుమానితులపై దృష్టి పెడతారు. లైలాకు మేనేజర్‌గా ఉండే బబ్లూ, లైలా బాయ్‌ఫ్రెండ్ సతీష్, ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ అర్జున్ వాసుదేవన్, మోడలింగ్ కంపెనీ ఏజెంట్ ఆదిత్య కౌశిక్ అనే ఈ వ్యక్తులపై అనుమానం వస్తుంది.

Read Also : కారు పోయి మేక వచ్చే… సీను సీనుకూ పొట్ట చెక్కలే… హాట్ సమ్మర్ లో కూల్ సినిమా

సంధ్యా, వినాయక్ ఈ అనుమానితులను విచారిస్తూ, హత్య వెనుక ఉన్న రహస్యాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తారు. మరోవైపు వినాయక్ గతంలో చేసిన ఒక తీవ్రమైన తప్పు కూడా అతని వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ఇది స్టోరీలో మరో కోణాన్ని చూపిస్తుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కొద్దీ, అనేక ట్విస్ట్‌లు, రివీల్స్ తో స్టోరీ ఆసక్తికరంగా మారుతుంది. చివరికి లైలాను చంపిన వ్యక్తిని పోలీసులు కనిపెడతారా ? డోర్ లోపలి నుంచి లాక్ చేసినా ఈ హత్య ఎలా జరుగుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×