OTT Movie : రియల్ స్టోరీలను ఆధారంగా చేసుకుని ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో చాలా దారుణంగా వయోలెన్స్ ఉంటుంది. దెయ్యాల కన్నా ఘోరంగా ఉండే మనుషుల ఇంట్లో ఇద్దరు మహిళా టీచర్లు చిక్కుకుంటారు. ఆ తరువాత ఈ స్టోరీని మాటల్లో చెప్పడానికి కూడా భయం వేస్తుంది. అక్కడ అంతలా టార్చర్ ని అనుభవిస్తారు ఆ టీచర్లు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
యూట్యూబ్ (Youtube) లో
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వెల్కమ్ హోమ్’ (Welcome Home). 2020 లో వచ్చిన ఈ మూవీకి పుష్కర్ మహాబల్ దర్శకత్వం వహించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో కశ్మీరా ఇరానీ, స్వర్దా తీగలే, బోలోరామ్ దాస్, శశి భూషణ్, టీనా భాటియా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
అనూజా, నేహా అనే ఇద్దరు టీచర్లు జనాభా లెక్కల సేకరణ కోసం ఒక గ్రామానికి వెళతారు. అందరి ఇళ్ళు అయిపోయాక, ఊరికి దూరంగా ఒంటరిగా ఉండే ఓ ఇంటికి వెళతారు. అక్కడ ప్రేరణ అనే గర్భిణీ స్త్రీ వారిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఈ కుటుంబంలో ఘనశ్యామ్, అతని తల్లి, భోలా అనే వంట వాడు ఉంటారు. అయితే ఆ ఇంట్లో నివసించే కుటుంబం భయంకరమైన రహస్యాలను దాచి పెట్టి ఉంటుంది.
ఆరోజు వర్షం పడటంతో అనూజా, నేహా ఆ ఇంట్లో చిక్కుకుంటారు. ఆ తరువాత వాళ్ళకు ఊహించని సంఘటనలు ఎదురు పడతాయి. అక్కడ ప్రేరణ తండ్రిగా చెప్పుకునే ఘనశ్యామ్ వీళ్ళను ఒకచోట బంధిస్తాడు. వీళ్లపై క్రూర మృగాలకన్నా దారుణంగా ప్రవర్తిస్తాడు. పనివాడితో సహా ఈ టీచర్లపై ఘోరంగా అఘాయిత్యం చేస్తారు. వాళ్ళు తప్పించకోవడానికి ఎంత ప్రయత్నించినా వీలు కాకుండా పోతుంది. అక్కడ ఇదివరకే ఇలాంటి ఘటనలు జరిగిన ఆనవాళ్ళు కూడా కనబడతాయి.
Read Also : ఇంట్లోనే సైకో కిల్లర్ ను పెట్టుకుని పండగ చేసుకునే బ్యాచ్… భయంతో అరుపులు పెట్టించే థ్రిల్లర్ మూవీ
నిజానికి ఆ ఇంట్లో ఉన్న ప్రేరణ ఘనశ్యామ్ కూతురు కాదు. ఆమెపై కూడా చాలాకాలంగా అఘాయిత్యం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆమె గర్భవతిగా కూడా ఉంటుంది. మానసికంగా చాలా మారిపోయి ఉంటుంది. ఈ క్రమంలో వీళ్ళను వెతుక్కుంటూ ఒక సోదరుడు అక్కడికి వస్తాడు. వాళ్ళ చేతిలో దారుణంగా ఆ వ్యక్తి బలి అవుతాడు. చివరికి ఈ టీచర్లు ఆ మృగాల నుంచి తప్పించుకుంటారా ? వాళ్ళు అసలు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.