Actor In Kargil War: 1999 లో దేశంలో జరిగిన కార్గిల్ యుద్ధం మనం దేశానికి చాలా కీలకమైనది. అప్పటిలో ఈ యుద్ధం ఎంత ముఖ్యమైనదో ఊహించడం కష్టమే. పాక్ – భారత్ మధ్య జరిగిన భయంకరమైన వార్. ఈ కార్గిల్ యుద్ధంలో పాకిస్థానీ బలగాలను తరిమికొట్టి పాక్‌పై భారతదేశం సాధించిన విజయాన్ని గర్వంగా చెప్పుకుంటారు. జూలై 26 తేదిని భారతదేశంలో కార్గిల్ విజయ్ దివస్ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ యుద్ధంలో ఎంతో మంది భారత సైన్యం పాక్ ముష్కరులతో పోరాడి విజయాన్ని సొంతం సీబీసుకున్నారు. ఈ యుద్ధంలో ఎంతో సైన్యం తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఇలాంటి ఒక యుద్ధంలో బాలీవుడ్ హీరో యుద్ధంలో పాల్గొన్నాడు. ఒక హీరో యుద్ధంలో పాల్గొనడం మామూలు విషయం కాదు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఒకసారి తెలుసుకుందాం..
కార్గిల్ యుద్ధంలో పోరాడిన బాలీవుడ్ హీరో..
బాలీవుడ్ పాపులర్ యాక్టర్ నానా పటేకర్.. ఈ కార్గిల్ యుద్ధ సమయంలో రెండు వారాల పాటు భారత సైన్యంతో కలిసి పోరాడారు. ఎలైట్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్ వంటి రెండు భాగాల్లో ఈ పాపులర్ హీరో సేవలు అందించారు.. ఈయన హీరోగా 1991లో ప్రహార్ సినిమాలో మేజర్ ప్రతాప్ చౌహాన్ పాత్రను అద్భుతంగా పోషించి ప్రశంసలు అందుకున్న నానా పటేకర్.. 1999లో కార్గిల్ యుద్ధంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈయన దైర్య సాహసాలకు జనాలు ఫిదా అవుతున్నారు. ప్రాణాలను లెక్క చెయ్యకుండా ఒక నటుడు ఇలా యుద్ధంలో పాల్గొనడం మామూలు విషయం కాదు.. అతను చేసిన పని తెలుసుకొని మరోసారి అతన్ని ప్రశంసలతో ముంచెత్తారు..
Also Read : ‘చిన్ని’ లో కావేరి ఒక్కరోజుకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతంటే..?
ఆసక్తికర విషయాలను పంచుకున్న నానా పటేకర్..
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరో సైన్యం పై జనాలకు గొప్పగా చెప్పారు.. ఆయన మాట్లాడుతూ.. నేను క్విక్ రియాక్షన్ టీమ్‌లో సభ్యుడిని. ఇది అత్యంత ఉన్నత శక్తులలో ఒకటి. కనీసం ఇలా అయిన మనం దేశం కోసం సేవలందించాను అని అన్నారు. అలాగే సైనికులే దేశానికి నిజమైన హీరోలు. నటీనటులను పూజించవద్దని, వారి కోసం పోరాడే సైనికులే నిజమైన హీరోలని నానా పటేకర్ చెప్పారు.. ఇక భారత్ లో పనిచేస్తున్న పాకిస్తాన్ పౌరులను నిషేధం విధించబడిన నిర్ణయాన్ని నానా పటేకర్ సమర్థించారు.. ఇక దేశం కోసం ఈయన చేసిన సేవలు అందించారు. ఇక ఈయన అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. క్రాంతివర్ వంటి ఎన్నో హిట్ సినిమాల్లో హీరోగా చేసిన నానా పటేకర్ తర్వాతి కాలంలో యాక్టర్‌గా అద్భుతంగా రాణించారు.. చివరగా ఆయన చేసిన సినిమా 2023 లో ది వ్యాక్సిన్ వార్.. నిజంగా ఇలాంటివి చెయ్యాలంటే దైర్యం ఉండాలి. దేశానికి ఆయన చేసిన సేవల గురించి ఎంత చెప్పిన తక్కువే… గ్రేట్..