Comedy Drama on OTT : ఓటీటీలోకి ఒక పంజాబీ కామెడీ ఎంటర్టైనర్ నేరుగా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇది పక్కా పంజాబీ స్టైల్‌లో సాగే ఒక ఫ్యామిలీ కామెడీ సినిమా. మన ఇంట్లో ఉండే అల్లరి, గొడవలు, నవ్వులనే ఈ సినిమాలో చూపించారు. పల్లెటూరి వాతావరణం, ఇంట్లోని వాళ్ల మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్. నవ్వించడమే కాకుండా, లాస్ట్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్‌తో అందరినీ కాస్త ఎమోషనల్ కూడా చేస్తారు. ఇది ఫారెన్ వెళ్లాలనే ఒక పిచ్చి బ్యాక్‌డ్రాప్‌తో నడుస్తుంది. మన ఊర్లలో చాలా మందికి ఎలాగైనా విదేశాలలో వెళ్లి సెటిల్ అవ్వాలనే కోరిక ఉంటుంది. సరిగ్గా అదే పాయింట్‌ను ఇందులో చూపించారు. విదేశాలకు వెళ్లడం కోసం ఒక ఫ్యామిలీ చేసే తింగరి పనులు, ఆ ప్రాసెస్‌లో వచ్చే లవ్ స్టోరీలు, ఒకదానికొకటి లింక్ అయిన అబద్ధాల వల్ల వచ్చే కామెడీ ప్రేక్షకులకు మంచి టైమ్‌పాస్ ఇస్తుంది.
ఈ పంజాబీ కామెడీ డ్రామా మూవీ పేరు ‘హాయ్ నీ బేబే మేరియే (Haye Ni Bebe Meriye). పరవీన్ కుమార్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. 2026 మే 14 నుంచి ఈ కామెడీ మూవీ ZEE5, Chaupal లలో నేరుగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో మెహతాబ్ విర్క్, అదితి ఆర్య, నిర్మల్ రిషి, జతీందర్ కౌర్, ప్రకాష్ గాధు ప్రధాన పాత్రలలో నటించారు. 88 నిమిషాల నిడివి గల ఈ పంజాబీ కామెడీ డ్రామాకు సెన్సార్ బోర్డు నుండి 13+ రేటింగ్ లభించింది. కాబట్టి దీనిని కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా చూడవచ్చు. ఈ చిత్రాన్ని ఓంజీస్ సినీ వరల్డ్, గోల్డ్ మేకర్ ఫిల్మ్స్, సాయా ఫిల్మ్స్ కలసి నిర్మించాయి. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ పై విడుదలై, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీ సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా కథ పంజాబ్‌లోని ఒక ఉమ్మడి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఆ ఇంట్లో ఉండే అన్నదమ్ములు, వాళ్ల భార్యల మధ్య నిత్యం ఆస్తి గొడవలు, ఈగోలు నడుస్తుంటాయి. ఈ రోజువారీ గొడవలతో విసిగిపోయిన ఒక జంట, ఎలాగైనా సరే ఈ ఊరు వదిలేసి కెనడా వెళ్లి హాయిగా సెటిల్ అవ్వాలని ఒక పెద్ద స్కెచ్ వేస్తుంది. అయితే వీసా రావడానికి, ఫారెన్ వెళ్లడానికి అవసరమైన డబ్బు లేకపోవడంతో వాళ్లు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకోవడం మొదలుపెడతారు. ఫారెన్ వెళ్లాలనే ఆరాటంలో వాళ్లు ఆడిన చిన్న చిన్న అబద్ధాలు, చివరికి పెద్ద పెద్ద సమస్యలుగా మారి ఇరుక్కుపోతారు. వీసా ఏజెంట్ల చుట్టూ తిరగడం, ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్లాన్లు వేయడం వల్ల ఫ్యామిలీలో విపరీతమైన గందరగోళం ఏర్పడుతుంది. ఈ సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి కూడా. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని ఊహించని సంఘటనల వల్ల వాళ్లకు కనువిప్పు కలుగుతుంది. ఎంత సంపాదించినా, ఏ దేశం వెళ్లినా సొంత ఊరిలో మనవాళ్లతో కలిసి ఉండటంలోనే నిజమైన ప్రశాంతత, సంతోషం ఉన్నాయని వాళ్లు గ్రహిస్తారు. అలా ఒక పెద్ద గొడవతో మొదలైన ఫ్యామిలీ, చివరికి అందరూ కలిసిపోయి ఒకటవ్వడంతో ఈ ఎమోషనల్ కామెడీ డ్రామా ముగుస్తుంది.
Read Also : ప్రభుత్వ ఉద్యోగాల కుంభకోణాన్ని బట్టబయలు చేసే పవర్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్… ఎక్కడ చూడచ్చో తెలుసా ?