E-Paper
Advertisement

Ban vs Pak: ఇనుప కంచెల‌తో ప్రాక్టీస్..క్యాచ్ లు ప‌ట్టేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతోన్న పాకిస్తాన్‌

Ban vs Pak: ఇనుప కంచెల‌తో ప్రాక్టీస్..క్యాచ్ లు ప‌ట్టేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతోన్న పాకిస్తాన్‌
Advertisement

Ban vs Pak:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఒక వైపు కొనసాగుతుంటే, మరోవైపు పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (Bangladesh vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య మొదటి టెస్ట్ ఫినిష్ అయింది. ఇందులో ఓడిపోయిన పాకిస్తాన్ పై దారుణంగా ట్రోలింగ్ కూడా జరుగుతోంది. ఇలాంటి క్రమంలో రేపటి నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇందులో ఎలాగైనా గెలవాలన్న కసితో పాకిస్తాన్ ప్లేయర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. శుక్రవారం మైదానంలో చెమటోడ్చారు.

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

క్యాచ్ లు ప‌ట్టేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతోన్న పాకిస్తాన్ ప్లేయ‌ర్లు

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య రేపటి నుంచి సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Sylhet International Cricket Stadium, Sylhet) వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇలాంటి క్రమంలో శుక్రవారం 50 డిగ్రీల ఎండ ఉన్నా కూడా ప్రాక్టీస్ చేశారు పాకిస్తాన్ ప్లేయర్లు. ఈ సందర్భంగా క్యాచ్ లు ప్రాక్టీస్ చేశారు పాకిస్తాన్ ప్లేయర్లు. స్లిప్ లో క్యాచ్ లు పట్టుకోవడంపై సాధన చేశారు. ఈ సందర్భంగా బాబర్ ఆజం ( Babar Azam), మహమ్మద్ రిజ్వాన్ ( Rizwan), సల్మాన్ అలీ అఘా ( Salaman Ali Agha) లాంటి ప్లేయర్లు ఒక్క క్యాచ్ కూడా పట్టుకోలేదు. క్యాచ్ పట్టుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. చేతులకు వచ్చిన క్యాచ్ లను కూడా వదిలేశారు.

అటు మహమ్మద్ రిజ్వాన్ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ లో కూడా విఫలమయ్యాడు. ఓ కర్రకు కంచె లాగా ఏర్పాటు చేసి మరి మహమ్మద్ రిజ్వాన్ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ సందర్భంగా తన చేతిలోకి వచ్చిన క్యాచ్ లను కూడా వదిలేశాడు రిజ్వాన్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వేసుకుంటున్నారు. ఈ వెధ‌వలకు ప్రాక్టీస్ లోనే క్యాచ్ లు పట్టడం రావడం లేదు… బంగ్లాదేశ్ పైన ఏం గెలుస్తారని పరువు తీస్తున్నారు. మొదటి మ్యాచ్ ఎలాగో ఓడిపోయారు.. సెకండ్ మ్యాచ్ కూడా ఓడిపోవడం గ్యారెంటీ అంటూ కామెంట్ చేస్తున్నారు.

బంగ్లాదేశ్ ప్లేయర్లకు ట్రైనింగ్ ఇస్తున్న మహమ్మద్ రిజ్వాన్

Advertisement

ఫీల్డింగ్ ప్రాక్టీస్ సందర్భంగా పాకిస్తాన్ క్రికెటర్లు అందరూ విఫలమవుతున్న నేపథ్యంలో.. మహమ్మద్ రిజ్వాన్ చేసిన పని హాట్ టాపిక్ అయింది. బంగ్లాదేశ్ ప్లేయర్లకు ఫీల్డింగ్ ఎలా చేయాలనే దానిపైన ట్రైనింగ్ సెష‌న్‌ తీసుకున్నాడు మహమ్మద్ రిజ్వాన్. ఈ ఫోటోలు కూడా వైరల్ అయిన నేపథ్యంలో రిజ్వాన్ ను ఆడుకుంటున్నారు. వాడికే చేత‌కాదు అంటే బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌కు ట్రైనింగ్ ఇస్తున్నాడా ? అంటూ ర్యాంగింగ్ చేస్తున్నారు.

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

 

 

Related News

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

Big Stories

Advertisement
×