OTT Movies : సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, అది సమాజానికి కూడా మార్గం చూపే సాధనం కూడా కావాలి. అయితే అతి కొద్ది సినిమాలే ఆ తరహా కంటెంట్ ను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా మహిళా సాధికారత, వారి హక్కుల కోసం పోరాటం వంటి అంశాలతో వచ్చిన ఈ సినిమాలు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. తమిళ చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో వచ్చిన ఈ సినిమాలు, మహిళలు సమాజంతో చేసే పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాయి. ఈ సినిమాలు చూస్తే రక్తం ఉడుకుతూ, ఏదైనా సాధించాలనే కసి కూడా పుడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలు కాలర్ ఎగరేసేలా చేసే ఐదు అదిరిపోయే తమిళ సినిమాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
ముసలివాళ్లు అంటే మూలన కూర్చోవాలి అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, ఈ సినిమాలో ‘అంగమ్మల్’ అనే అవ్వ క్యారెక్టర్ చూస్తే షాక్ అవుతారు. తన బతుకు తన ఇష్టం అని మొండిగా నిలబడుతుంది ఆ మహా తల్లి. ఆమె తన జీవితాంతం రవికె లేకుండా, కేవలం చీర మాత్రమే కట్టుకుంటుంది. ఆమె స్టైల్ కి ఎవడైనా భయపడాల్సిందే. పట్టణంలో చదువుకున్న ఆమె కొడుకు, తన పెళ్లి సంబంధం కోసం వచ్చే వాళ్ళ ముందు, తన తల్లిని పద్ధతిగా ఉండాలని చెప్పడంతో కథ ఆసక్తికరంగా ఉంటుంది. ఆత్మగౌరవం అంటే ఏంటో ఈ అవ్వను చూసి నేర్చుకోవాలి. అంగమ్మాళ్ పాత్రలో గీతా కైలాసం అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఈ మూవీ సన్ నెక్స్ట్ (Sun NXT)లో అందుబాటులో ఉంది.
తండ్రిని జైల్లో వేస్తే ఊరంతా ఆయనే తప్పు చేశాడు అని వేలెత్తి చూపిస్తుంటే, ఒక్క గార్గి (సాయి పల్లవి) మాత్రం నమ్మకంగా నిలబడుతుంది. లాయర్లు, పోలీసులు, సమాజం అంతా ఒకవైపు ఉంటే.. ఈ అమ్మాయి ఒక్కతే మరోవైపు ఉండి పోరాడుతుంది. నిజం కోసం ఎంత దూరమైనా వెళ్లొచ్చని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇందులో సాయి పల్లవి యాక్టింగ్ చూస్తే కళ్లు చెమర్చడం గ్యారెంటీ.
ఈ సినిమా సోనీ లివ్ (Sony LIV)లో అందుబాటులో ఉంది.
లేడి సూపర్ స్టార్ నయనతార ఇందులో కలెక్టర్ పాత్రలో నటించింది. ఒక చిన్న పాప బోరుబావిలో పడిపోతే.. వ్యవస్థ మొత్తం చేతులెత్తేసినప్పుడు, ఈమె ఎలా ముందుండి ఆ పాపను కాపాడింది అన్నదే స్టోరీ. రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నా, పై అధికారులు బెదిరిస్తున్నా డోంట్ కేర్ అని తన డ్యూటీ తాను చేస్తుంది. ఆడవాళ్లు పవర్ లో ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపిస్తుంది. సన్ నెక్స్ట్ , మనోరమ మాక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
ఒక రైతు బిడ్డ క్రికెట్ ఆడతాను అంటే ఊరంతా ఎగతాళి చేస్తారు. ఆడపిల్లవి నీకెందుకు ఈ ఆటలు అని వెక్కిరిస్తారు. కానీ తండ్రి సపోర్టుతో ఆమె ఇండియా టీమ్ దాకా ఎలా వెళ్ళింది అన్నదే కథ. ఈ సినిమాలో క్రికెట్ మ్యాచులు చూస్తుంటే టీవీ ముందే విజిల్స్ వేస్తాం. కష్టపడితే గెలుపు మన కాళ్ల దగ్గరకు వస్తుందని చెప్పే సూపర్ మూవీ ఇది. సోనీ లివ్ (Sony LIV)లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
సొసైటీ చెప్పినట్లు కాకుండా, తన మనసుకి నచ్చినట్లు బతకాలనుకునే అమ్మాయి కథ ఇది. అమ్మాయి అంటే ఇలాగే ఉండాలని రూల్స్ పెట్టే వాళ్లకి ఈ సినిమా ఒక గట్టి సమాధానం. తన దారి తాను వెతుక్కునే ధైర్యం ఉన్న ప్రతి అమ్మాయికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇది జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ లో ఉంది.
Read Also : వైన్ కంపెనీకి ఊహించని షాక్ … అమ్మాయి ప్రేమలో గొర్రెల కాపరి … కిక్కెక్కించే క్రేజీ స్టోరీ