BigTV English

OTT Movie : తమ్ముడి హత్యకు అన్న రివేంజ్ … హై హీట్ ని పెంచే బోల్డ్ సీన్స్ … ఒంటరిగా చూడాల్సిందే భయ్యా

OTT Movie : తమ్ముడి హత్యకు అన్న రివేంజ్ … హై హీట్ ని పెంచే బోల్డ్ సీన్స్ … ఒంటరిగా చూడాల్సిందే భయ్యా

OTT Movie : రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. వీటిలో అన్ని అంశాలు కలిపి ఉండటంతో, చూస్తున్నంత సేపు థ్రిల్ గా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ స్టోరీ మామూలుగా మొదలై, ఒక యుద్ధంలో సైనికుడిలా పరుగులు పెట్టిస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ మెక్సికన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘హై హీట్’ (High Heat) . దీనిని జోస్ ఇగ్నాసియో వాలెన్సుయెలా రూపొందించారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో ఆగస్టు 17, 2022 నుంచి ప్రీమియర్ అయింది. ఈ సిరీస్ ప్రధానంగా ఒక ఫైర్ స్టేషన్‌లో జరిగే స్టోరీ చుట్టూ తిరుగుతుంది. ఇందులో రొమాన్స్, కుటుంబ సంబంధాలు, సీరియల్ కిల్లర్ మిస్టరీ కలిసి ఉంటాయి. బోల్డ్ సీన్స్ తో రొమాంటిక్ ప్రియులు పిచ్చెక్కిపోతారు.  మొదటి సీజన్ లో 39 ఎపిసోడ్‌లు ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ సుమారు 45 నిమిషాల నిడివి ఉంటుంది. అన్ని ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.


స్టోరీలోకి వెళితే

పొంచో క్విరోగా అనే యువకుడు తన సోదరుడి హత్యకు సంబంధించిన రహస్యాలను తెలుసుకోవాలని అనుకుంటాడు. హత్యకు కారణమైన వ్యక్తిని కనిపెట్టి,అతన్ని శిక్షించాలనే లక్ష్యంతో మెక్సికో సిటీలోని ఒక ఫైర్ స్టేషన్‌లో చేరతాడు. అతను రహస్యంగా ఫైర్‌ఫైటర్‌గా శిక్షణ పొందుతూ, తన సోదరుడి హత్యకు సంబంధించిన రహస్యాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతను ఫైర్ స్టేషన్‌లోని ఒక మహిళా ఫైర్‌ఫైటర్ అయిన ఒలివియాతో సన్నిహితంగా మెలుగుతాడు. వీళ్లిద్దరి మధ్య రొమాన్స్ హద్దులు దాటిపోతుంది. వీడి రొమాన్స్ కి ఫిదా అవుతుంది ఒలివియా. ఆతరువాత పొంచో ఎందుకు ఇక్కడికి వచ్చాడో తెలుసుకుని, అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. మరోవైపు రికార్డో ఉర్జువా అనే వ్యక్తి, కొంతమంది మహిళల హత్యలకు ఆరోపణలు ఎదుర్కొని, 25 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన తర్వాత విడుదల అవుతాడు.

అతను బయట వచ్చిన తరువాత, తన లైఫ్ ను కొత్తగా ప్రారంభిస్తాడు. కానీ అతని గతం అతన్ని వెంటాడుతూ ఉంటుంది.  పొంచో చేసిన ఈ హత్యలకు, పొంచో సోదరుడి హత్యకు సంబంధం ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే పొంచో దిమ్మతిరిగే విషయాలను వెలుగులోకి తెస్తాడు. చివరికి అతని సోదరున్ని చంపింది ఎవరు ? సీరియల్ కిల్లర్ కి ఈ హత్య కు ఉన్న సంబంధం ఏంటి ? ఈ విషయాలను తెలుసుకోవాలి అంటే, ఈ సినిమాను చూడాల్సిందే. ‘హై హీట్’ ఒక ఫైర్ స్టేషన్ నేపథ్యంలో రొమాన్స్, మిస్టరీ, యాక్షన్‌ను సన్నివేశాలతో ఒక ఆసక్తికరమైన థ్రిల్లర్ గా తెరకెక్కింది. థ్రిల్లర్ సిరీస్ లను ఇష్టపడే వారికి ఇది ఒక బెస్ట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు.

Read Also : ఆడవాళ్లను వీడియో తీసి చంపే సైకో … పోలీసులను కూడా వదలకుండా … రాధిక ఆప్టే క్రేజీ స్పై థ్రిల్లర్

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×