OTT Movie : బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక స్పై థ్రిల్లర్ మూవీ, ఓటిటిలో ప్రేక్షకుల్ని బాగా అలరిస్తోంది. ఈ మూవీలో శృంగార తార రాధిక ఆప్టే ప్రధాన పాత్రలో నటించారు. ఒక స్పై ఏజెంట్ గా, ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకుని క్రమంలో ఈమె పాత్ర తిరుగుతుంది. మూవీ స్టోరీ చివరి వరకు చాలా ఆసక్తికరంగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
జీ 5 (Zee 5)లో
ఈ స్పై థ్రిల్లర్ కామెడీ మూవీ పేరు ‘అండర్‌కవర్’ (Mrs Undercover). 2023 లో విడుదలైన ఈ మూవీకి అనుశ్రీ మెహతా దర్శకత్వం వహించారు. ఇందులో రాధికా ఆప్టే, సుమీత్ వ్యాస్, రాజేష్ శర్మ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ కోల్‌కతాలో జరుగుతుంది. ఇందులో ఒక సాధారణ గృహిణిగా కనిపించే స్త్రీ, నిజానికి ఒక అండర్‌కవర్ ఏజెంట్‌గా ఉంటూ, ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ మూవీ జీ 5 (Zee 5)లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
కామన్ మ్యాన్ అనే సీరియల్ కిల్లర్ కోల్‌కతాలో మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తుంటాడు. అతను చంపేముందు ఫోన్ నుండి ఒక వీడియోను రికార్డ్ చేసి, వారిని దారుణంగా హత్య చేస్తాడు. పోలీసులకు ఈ కిల్లర్ పెద్ద సవాలుగా మారుతాడు. స్పెషల్ ఫోర్సెస్ చీఫ్ రంగీలా, ఈ కిల్లర్‌ను పట్టుకోవడానికి దుర్గను తిరిగి మిషన్‌లోకి రప్పించడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే కామన్ మ్యాన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఏజెంట్‌లను కూడా హత్య చేస్తుంటాడు.ఇప్పుడు అతన్ని పట్టుకోవడానికి ఉన్న ఏకైక మార్గం దుర్గే. అయితే దుర్గ ఇప్పుడు పెళ్లిచేసుకుని సాధారణ గృహిణిగా ఉంటోంది. ఆమె భర్త దేబ్, అత్తమామలు, కొడుకుతో సామాన్య జీవితాన్ని గడుపుతుంది. దుర్గ మొదట్లో ఈ మిషన్‌ను తీసుకోవడానికి సంకోచిస్తుంది. ఎందుకంటే ఆమె తన వివాహ జీవితానికి అలవాటుపడిపోయింది. ఏజెంట్‌గా తన నైపుణ్యాలు మరచిపోయిందని భావిస్తుంది. అయినప్పటికీ, రంగీలా ఆమెను ఒప్పించి, ఆమెకు ఎటువంటి శిక్షణ లేకుండానే మిషన్‌లోకి పంపిస్తాడు.
దుర్గ తన గృహ బాధ్యతలను ఒక పక్క చూసుకుంటూనే, తన అండర్‌కవర్ పనిని కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఆమె పొరుగున ఉన్న ఐషా అనే మహిళను కలుస్తుంది. ఆమె నిజానికి కామన్ మ్యాన్‌తో కలిసి పనిచేసే మహిళఅని తేలుతుంది. ఐషా, దుర్గ భర్త దేబ్‌ను ఏజెంట్‌గా భావించి, అతన్ని హోటల్‌కు రప్పించి హత్య చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ దుర్గ సకాలంలో అక్కడికి చేరుకుని అతన్ని కాపాడుతుంది. దీనితో దేబ్ ఆమె ఎవరో తెలుసుకుంటాడు. ఇప్పుడు ఈ కథ ఒక క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. ఇందులో దుర్గ కామన్ మ్యాన్ గురించి అసలు విషయాలు తెలుసుకుంటుంది. అతని అసలు పేరు అజయ్ అని, కోల్‌కతా గర్ల్స్ కాలేజీలో ముఖ్యమంత్రిని హత్య చేయడానికి ఒక బాంబు ప్లాన్ చేస్తున్నట్లు కనిపెడుతుంది. ఆమె కాలేజీలో నీటి సరఫరా సిస్టమ్ ద్వారా బాంబును డీఫ్యూజ్ చేసి, హాల్‌ను ఖాళీ చేయిస్తుంది. చివరికి ఆ కిల్లర్ ను దుర్గ పట్టుకుంటుందా ? దుర్గ ఒకప్పుడు అండర్ కవర్ ఏజంట్ అని తెలిసి, భర్త ఎలా రియాక్ట్ అవుతాడు ? ఈ విషయాలను, ఈ మూవీని చూసి తెలుసుకోండి.
Read Also : రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయే అన్నా చెల్లెలు … క్రేజీ రొమాంటిక్ మూవీ