OTT Movie : రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, ఓటిటిలో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ సినిమాలను మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో 14 ఏళ్ల అమ్మాయి, 28 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత స్టోరీ రివేంజ్ డ్రామా గా మారిపోతుంది. ఈ మూవీ చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ సైకలాజికల్ త్రిల్లర్ మూవీ పేరు ‘ది క్రష్’ (The Crush). 1993 లో వచ్చిన ఈ మూవీకి అలాన్ షాపిరో దర్శకత్వం వహించారు. ఇందులో క్యారీ ఎల్వెస్, అలీసియా సిల్వర్‌స్టోన్ నటించారు. నిక్ ఎలియట్ అనే రచయితను, అడ్రియన్ అనే టీనేజ్ అమ్మాయి ఇష్టపడుతుంది. ఆ తరువాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక కల్ట్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఏళ్ల నిక్ ఎలియట్ అనే జర్నలిస్ట్ కు 28 సంవత్సరాలు ఉంటాయి. మ్యాగజైన్ ఉద్యోగం కోసం సీటెల్‌కు వెళ్లి, ఒక గెస్ట్‌హౌస్ ను అద్దెకు తీసుకుంటాడు. ఆ ఇంటి ఓనర్ కి 14 ఏళ్ల కుమార్తె అడ్రియన్ ఉంటుంది. చూడటానికి ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. నిక్‌పై ప్రేమను పెంచుకుంటుంది. అది ఒక వ్యామోహంగా మారుతుంది. ఒకరోజు నిక్ చూసే విధంగా బట్టలు కూడా మార్చుకుంటుంది. అయితే ఇది వరకే నిక్ తన సహోద్యోగి అమీతో ప్రేమలో ఉంటాడు. అడ్రియన్ వయసు కూడా చాలా వ్యత్యాసం ఉండటంతో, ఆమె ప్రేమను నిక్ సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇక అడ్రియన్ తన ప్రేమను ఒప్పుకోలేదని ప్రతీకారంతో రగిలి పోతుంది. అడ్రియన్, నిక్ జీవితాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తుంది. అతని కారును ధ్వంసం చేస్తుంది. అతని కంప్యూటర్ ఫైళ్లను చెరిపివేస్తుంది. అతనికి దగ్గరగా ఉన్నవారికి కూడా హాని చేస్తుంది. అదికూడా చాలక , ఆమె నిక్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తుంది. ఆమె బాడిలో అతని స్పెర్మ్ అనవాళ్ళు దొరుకుతాయి.
నిజానికి నిక్ అడ్రియన్ ను ఏమీ చెయ్యడు. నిక్ తన గర్ల్ ఫ్రెండ్ తో గడిపిన తరువాత, వదిలేసిన కాన్డోం లో అతనికి తెలీకుండా స్పెర్మ్ ని తీసుకుంటుంది. దాని ఆనవాళ్ళ కారణంగా పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు. అడ్రియన్ స్నేహితురాలు, ఆమె గత ప్రవర్తన గురించి చెప్పి నిక్‌ను హెచ్చరిస్తుంది. ఇందులో ఒక కౌన్సెలర్ మరణంతో సంబంధం ఉన్న అనుమానాస్పద సంఘటన కూడా ఉంది. నిక్ తన పేరును ఈ కేసులో తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, అడ్రియన్ చర్యలు మరింత ప్రమాదకరంగా మారుతాయి. ఆమె నిక్ తో పాటు అతని తండ్రిపై కూడా దాడి చేస్తుంది. చివరికి నిక్ నిర్దోషిగా విడుదలై అమీతో దూరంగా వెళ్లిపోతాడు. అయితే అడ్రియన్ ఒక మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటుంది. అక్కడ కూడా ఆడ్రియన్ తన వైద్యుడితో వ్యామోహాన్ని పెంచుకుంటుంది. ఆమె అప్పటికీ మారకుండా, మరో వ్యక్తి పై తన స్వభావాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంది.
Read Also : ఫ్రెండ్ మదర్ పై కన్ను వేసే కేటుగాడు … రాముడిగా నటిస్తూ కీచకుడి వేషాలు