Malavika Mohanan : మలయాళం ముద్దుగుమ్మ మాళవిక మోహన్ గురించి అందరికీ తెలుసు. తెలుగులో ఇప్పటివరకు సినిమాలు రాలేదు.. కానీ ఆమెకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ మలయాళ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మాళవికకు ఎదురైనా చేదు అనుభవం గురించి ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇది విన్న మీ ఫ్యాన్సు షాక్ అవుతున్నారు. అయ్యో పాపం పబ్లిక్ గా ఇంత బాధ అనుభవించిందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారు. మొత్తానికి గండం నుంచి బయట పడడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఈ హీరోయిన్ కు ఎదురైన చేదు అనుభవం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అప్పుడు చాలా భయపడ్డాను..
మాళవిక మోహనన్ పై గతంలో చాలా విమర్శలు వచ్చాయి.. ఆ వార్తలు విన్న ఆమె ఇంటర్వ్యూలో వాటి గురించి ప్రస్తావించింది. అలాంటి వార్తలు రావడంతో నేను చాలా భయపడ్డాను బాధపడ్డాను అని ఆమె అన్నారు. ఈ క్రమంలో తను తన ఫ్రెండ్ తో కలిసి లోకల్ ట్రైన్ లో ఇంటికి వెళ్లడానికి ట్రైన్ ఎక్కింది అని చెప్పింది. ముంబైలోని లోకల్ ట్రైన్ లో జర్నీ చేశానని, ఆ జర్నీ టైమ్ లో తనని ఒకతని ప్రవర్తన చాలా భయపెట్టిందని మాళవికా మోహనన్ తెలిపింది.
Also Read :బడా ప్రొడ్యూసర్ మాయలో హీరోయిన్.. ఖరీదైన గిఫ్ట్ లు..
ట్రైన్ లో జర్నీ చేస్తున్న టైమ్ లో ఆ కంపార్ట్‌మెంట్‌లో తను, తన స్నేహితులు తప్ప ఎవరూ లేరని, ఆ టైమ్ లో ఒకతను తమ కంపార్ట్‌మెంట్ లోకి వచ్చేందుకు ట్రై చేశాడని, అక్కడున్న గ్లాస్ డోర్ నుంచి తొంగిచూస్తూ ముద్దిస్తావా అని సైగలు చేశాడని అది చూసిన ఆమె చాలా భయపడినట్లు చెప్పింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక అందరం కంగారు పడుతూ ఉన్నాం. ఇప్పుడే ట్రైన్ వేరే స్టేషన్లో ఆగింది. దాంతో అక్కడికి కొంతమంది ట్రైన్ లో ఎక్కడంతో మేమంతా సేఫ్ అయ్యామని అనుకున్నాం అని ఆమె అన్నారు. జీవితంలో మర్చిపోలేని ఘటన ఇదే అని ఆమె అన్నారు. అది నీ జీవితం లో మర్చిపోలేని ఘటన అని అన్నారు..
సినిమాల విషయానికొస్తే..
ఈ మలయాళీ ముద్దుగుమ్మ మలయాళం లో ఎన్నో సినిమాల్లో నటించింది. తమిళ్ లో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమాలో నటిస్తుంది. మొదటి సినిమాతోనే ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మూవీ హిట్ అయితే మాత్రం ఆమె లైఫ్ ఎక్కడికో వెళ్తుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. ఆ తర్వాత మలయాళంలో వరుస సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.