OTT Movie : హారర్ జోనర్ లో వచ్చే సినిమాలు ఈ మధ్య సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ఒక్కో మూవీ ఒక్కో స్టోరీతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి సినిమాలకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు థియేటర్లలోకి వస్తున్నా ఇలాంటి సినిమాలు మాత్రం హిట్ అవుతున్నాయి. తాజాగా ఓ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది.ఇదొక సైకో థ్రిల్లర్ మూవీ.. అమ్మాయిలను టార్గెట్ చేస్తున్న సైకో.. చివరికి పోలీసులకు చిక్కుతాడా? ఈ స్టోరీ లైన్ తో మూవీ వచ్చింది. ఇంతకీ ఈ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..
మూవీ & ఓటీటీ..
తెలుగులో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అందులో కొన్ని మాత్రమే హారర్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య సైకో థ్రిల్లర్ మూవీగా వచ్చిన సినిమాగా హైవే వచ్చింది. ఆనంద్ దేవరకొండ నటించిన ఓటీటీ సినిమానే హైవే. దొరసాని సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ బేబీ మూవీ హిట్ కంటే ముందుగా ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు చేశాడు.. మిడిల్ క్లాస్ మెలోడీస్ తర్వాత ఈ మూవీలో నటించాడు. ఇది నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. తెలుగు మిస్టరీ సైకో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో హైవే తెరకెక్కింది. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ కథతోపాటు, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం అందించారు. ప్రముఖ నిర్మాత వెంకట్ తలాటి నిర్మాతగా వ్యవహారించారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హైవే ఓటీటీ రిలీజ్ అయింది. ఈ మూవీ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే ఆహాలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ హైవేను చూడాల్సిందే..
Also Read: ‘గుండెనిండా గుడిగంటలు’ కోసం బాలు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?
స్టోరీ విషయానికొస్తే..
థ్రిల్లర్ జోనర్ గా తెరకెక్కిన ఈ మూవీ హైవే.. హైదరాబాద్ నుంచి బెంగళూర్‌కు వెళ్లే హైవే రూట్‌లో రోడ్డుపై కనిపించే అమ్మాయిలను వెంటాడి ఓ సైకో కిల్లర్ డీ పేరుతో కిరాతకంగా చంపుతుంటాడు. యువతులను చంపడంలోనే ఆనందం పొందుతుంటాడు. మరోవైపు ఓ వెడ్డింగ్ ఫొటోషూట్ పనిపైన ఫొటోగ్రాఫర్ విష్ణు ట్రావెల్ చేస్తాడు. ఇంకోవైపు తన బాస్ నుంచి తప్పించుకునేందుకు తులసి అనే యువతి మంగళూర్‌కు వెళ్లాలనుకుంటుంది. అయితే అక్కడ ఆ అమ్మాయికి ఎదురైన పరిస్థితుల నుంచి ఎలా బయటపడుతుంది అనేది స్టోరీ… అమ్మాయిలను చివరికి ఎలా కాపాడుతారు అనేది స్టోరీ..తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఆహాలో హైవే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 2022 ఆగస్ట్ 19న నేరుగా ఆహాలో హైవే ఓటీటీ రిలీజ్ అయింది. ఇప్పుడు మరోసారి రానుంది. ఎలా ఉంటుందో ఒకసారి చూసేయ్యండి.
ఇటీవల ఇలాంటి కంటెంట్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ వేసవిలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.