E-Paper
Advertisement

GRSE Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు.. రూ.లక్షల్లో వేతనాలు భయ్యా..

GRSE Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు.. రూ.లక్షల్లో వేతనాలు భయ్యా..
Advertisement

GRSE Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. సీఏ/ సీఎంఏ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, పీజీ, ఎంబీబీఎస్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. గార్డెన్ రిసెర్చ్ షిప్‌బిల్డర్స్‌ అండ్ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌లో (GRSE) లో పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి భారీ వేతనం వస్తుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కోల్‌కతాలోని గార్డెన్ రిసెర్చ్ షిప్‌బిల్డర్స్‌ అండ్ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌లో (GRSE).. ఫిక్స్‌డ్‌ర్మ్‌/ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 41 మేనేజీరియల్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 26న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

Advertisement

Also Read: TGCAB: తెలంగాణ టీజీసీఏబీ‌లో పోస్టులు.. ఈ అర్హత ఉంటే చాలు.. ఈ జాబ్ వస్తే నెలకు రూ.97,620

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 40

Advertisement

గార్డెన్ రిసెర్చ్ షిప్‌బిల్డర్స్‌ అండ్ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌లో వివిధ రకాలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, ప్రాజెక్ట్ సూపరిటెండెంట్, సీనియర్ మేనేజర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

ఉద్యోగాలు- వెకెన్సీలు

జనరల్‌ మేనేజర్‌- 01
అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌- 02
డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌- 05
మేనేజర్‌- 04
డిప్యూటీ మేనేజర్‌- 04
అసిస్టెంట్‌ మేనేజర్‌- 05
జూనియర్‌ మేనేజర్‌- 10
ప్రాజెక్ట్‌ సూపరిటెండెంట్‌- 01
సీనియర్‌ మేనేజర్‌- 08

వివిధ విభాగాల్లో ఈ వెకెన్సీలు ఉన్నాయి. టెక్నికల్‌, హ్యూమన్‌ రిసోర్స్‌, అడ్మిన్‌ అండ్‌ సెక్యూరిటీ, ఫైనాన్స్‌, సెక్యూరిటీ, హ్యూమన్‌ రిసోర్స్‌, సేఫ్టీ, మెడికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెడికల్‌ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 26

విద్యార్హత: సంబంధిత విభాగంలో సీఏ/ సీఎంఏ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, పీజీ, ఎంబీబీఎస్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తు ఫీజు: రూ.590 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.)

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ

స్టైఫండ్: ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ ఉంటుంది. నెలకు జనరల్‌ మేనేజర్‌కు రూ.1,00,000-రూ.2,60,000 వేతనం ఉంటుంది.  అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌కు రూ.90,000- రూ.2,40,000 వేతనం ఉంటుంది. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు రూ.80,000- రూ.2,20,000 వేతనం ఉంటుంది. మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000 వేతనం ఉంటుంది. డిప్యూటీ మేనేజర్‌కు రూ.50,000- రూ.1,60,000 వేతనం ఉంటుంది. అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.40,000-రూ.1,40,000 వేతనం ఉంటుంది. జూనియర్‌ మేనేజర్‌కు రూ.30,000; 1,20,000 వేతనం ఉంటుంది. ప్రాజెక్ట్‌ సూపరిటెండెంట్‌కు రూ.1,20,000-రూ.2,28,000, సీనియర్‌ మేనేజర్‌కు రూ.70,000-రూ.2,00,000 వేతనం ఉంటుంది.

పని ప్రదేశాలు: కోల్ కత్తా, రాంచీ

రాత పరీక్ష: 2025 మే, జూన్

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://grse.in/

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 40

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 26

Also Read: NCL Recruitment: నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 200 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు.. పూర్తి వివరాలివే..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×