Gundeninda Gudigantalu : ప్రముఖ బుల్లితెర టీవీ ఛానల్ స్టార్ మా లో కొత్త కొత్త సీరియల్ ప్రసారం అవుతుంటాయి. ఇప్పటివరకు ఇందులో ప్రసారమైన సీరియల్స్ అన్ని మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి. అయితే కొన్ని సీరియల్స్ ఏకంగా రెండో సీజన్ కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ ప్రసారమవుతున్న సీరియస్లలో గుండె నిండా గుడి గంటలు కూడా ఒకటి.. టాప్ టీఆర్పీ రేటింగ్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ లో బాలు నటిస్తున్నాడు. చూడ్డానికి అమాయకంగా కనిపించినా కూడా అందరిని ఓ ఆట ఆడుకుంటాడు. బాలు పాత్ర ఈ సీరియల్కు హైలైట్ అని చెప్పాలి. ప్రస్తుతం అతను బుల్లితెరపై చానల్స్ లలో సీరియల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో బాలుగా నటిస్తున్న విష్ణు కాంత్ఈ సీరియల్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో అన్నది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. ఇంతకీ బాలు ఈ సీరియల్ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..
విష్ణు రెమ్యూనరేషన్..?
గుండెనిండా గుడిగంటలు సీరియల్ హీరో బాలు చూడ్డానికి అచ్చం తమిళ హీరో శివ కార్తీకేయన్ మాదిరే ఉంటాడు. వీళ్లిద్దర్నీ పక్క పక్కననిలబెడితే కవలపిల్లలు అనే మాదిరిగానే కనిపిస్తారు. అంతపెద్ద స్టార్ హీరోతో తనని పోల్చడం ఆనందంగానే ఉందని కానీ నేను ఆయన అంత పెద్ద నటుడిని కాదు. చిన్న వాడినే.. ఇంకా పేరు తెచ్చుకోవాలని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఈ సీరియల్ లో మిగతా క్యారెక్టర్లతో పోలిస్తే బాలు క్యారెక్టర్ ఎక్కువ ప్రాధాన్యత ఉందన్న విషయం తెలిసిందే.. ఆయన టైమింగ్ తో పాటు ఈ సీరియల్కు ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక రోజుకి విష్ణుకాంత్ తీసుకునే రెమ్యూనరేషన్ 60 వేల వరకు ఉంటుందట. నెలలో దాదాపు పది పదిహేను రోజులు షూటింగ్ ఉంటే ఆయనకు కచ్చితంగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని టాక్.
Also Read:ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ ఏడు సినిమాలు వెరీ స్పెషల్..
ఈయన రియల్ లైఫ్ చూస్తే..
తమిళ నటుడు విష్ణుకాంత్, ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్‌లో బాలు పాత్రలో నటించారు. ఈ పాత్రలో విష్ణు తెలుగు ప్రేక్షకుల తో దగ్గరయ్యాడు. 2024 స్టార్ మా పరివార్ అవార్డ్స్‌లో విష్ణుకాంత్‌కి బెస్ట్ హస్బండ్అవార్డు దక్కింది. కానీ రియల్ లైఫ్ లో మాత్రం బాలు ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి. తమిళ్ లో ప్రసారమయ్యే సిప్పినీల్ ముత్తు అనే సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత ఒక సీరియల్ తో తన టాలెంట్ నిరూపించుకుంటూ వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. తెలుగు పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.. అయితే ఈయన రియల్ లైఫ్ లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్న విషయాన్ని తెలిసిందే. పెళ్లయిన కొన్ని నెలలకే భార్యతో విడాకులు తీసుకున్నాడు..