BigTV English

Shekar Basha: రాజ్ తరుణ్‌తో పెళ్లి కాలేదని ఒప్పుకున్న లావణ్య.. బాగోతం బయటపెట్టిన శేఖర్ బాషా

Shekar Basha: రాజ్ తరుణ్‌తో పెళ్లి కాలేదని ఒప్పుకున్న లావణ్య.. బాగోతం బయటపెట్టిన శేఖర్ బాషా

Shekar Basha: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌ను ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకున్నానని లావణ్య అనే ఒక అమ్మాయి కొన్నాళ్ల క్రితం మీడియా ముందుకు వచ్చింది. ఇన్నేళ్లు రహస్యంగా ఉన్న తమ రిలేషన్‌షిప్‌ను ఇప్పుడు బయటికి తీసుకురావడానికి రాజ్ తరుణ్ తనను మోసం చేయడమే కారణమని తెలిపింది. అలా రాజ్ తరుణ్‌పై చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో అందరూ రాజ్ తరుణ్‌దే తప్పు అని అనుకున్నారు. కానీ తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆర్జే శేఖర్ బాషా ఈ కేసులోకి ఎంటర్ అయ్యి లావణ్య విషయంలో రాజ్ తరుణ్ తప్పేం లేదని నిరూపించాడు. మరోసారి లావణ్యకు వ్యతిరేకంగా ఆధారాలు చూపించి అందరికీ షాకిచ్చాడు.


పెళ్లి కాలేదు

రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేసిన సమయంలో లావణ్య చెప్పిన స్టేట్‌మెంట్‌ను మీడియా ముందు బయటపెట్టాడు శేఖర్ బాషా. గుడిలో రాజ్ తరుణ్ తనకు తాళి కట్టానని చెప్పిన మాట అబద్ధమని శేఖర్ బాషా ఆరోపించాడు. జడ్జి ముందు లావణ్య ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను బయటపెట్టాడు. దానిని అందరికీ చదివి వినిపించాడు. 2023 జులై జడ్జి ముందు తను ప్రజెంట్ చేసిన స్టేట్‌మెంట్‌తో ముందుకొచ్చాడు శేఖర్ భాషా. అందులో ‘‘మీకు పెళ్లి అయ్యిందా?’’ అనే ప్రశ్నకు లేదు అనే సమాధానం ఉంది. ‘‘మీడియా అందరి ముందు రాజ్ తల్లి కట్టాడు అని చెప్తుంది. ఎందుకంటే మనం గట్టిగా ప్రశ్నించం కదా’’ అని చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా.


మస్తాన్ సాయి కబుర్లు

‘‘జడ్జి ముందు లావణ్య (Lavanya) చెప్పినదాన్ని బట్టి రాజ్ తరుణ్ తన భర్త కాదు, తన తల్లిదండ్రులు ఆమె అత్తమామ కాదు’’ అని చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా. అంతే కాకుండా అసలు మస్తాన్ సాయితో లావణ్యకు ఉన్న సంబంధం ఏంటి అని కూడా ఆ స్టేట్‌మెంట్‌లో బయటపడింది. ‘మస్తాన్ సాయి మొదట్లో చాలా బాగా మాట్లాడేవాడు, ఇలాంటి అమ్మాయి నాకు భార్యగా రావాలి అనేవాడు. పెళ్లి అని ఉద్దేశించి మాట్లాడేవాడు. అలా నెలరోజులు గడిచాయి. నా కొడుకును నా తల్లిదండ్రులే చూసుకుంటున్నారు. తనతో నీకేం ఇబ్బంది రాదు అని చెప్తే మనస్పూర్తిగా అంగీకరించాను’ అంటూ లావణ్య ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఉంది. లావణ్యకు ఆల్రెడీ పెళ్లి అయ్యింటే అతడితో దూరంగా ఉండాలి కదా అని ప్రశ్నించాడు శేఖర్ బాషా.

Also Read: అఘోరీ పెళ్లి చట్టబద్ధం కాదు.. శేఖర్ బాషా స్ట్రోక్ మామూలుగా లేదు.. అది అలా అనాలి

అన్నీ చేసిందట

ఒకవేళ రాజ్ తరుణ్‌ (Raj Tarun)తో పెళ్లి అయ్యింటే మళ్లీ మస్తాన్ సాయితో పెళ్లికి తను ఎలా అంగీకరిస్తుంది అని అన్నాడు శేఖర్ బాషా (Shekar Basha). దీన్ని బట్టి చూస్తే తను మోసం చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుందని తెలిపాడు. ‘‘అలాంటి అమ్మాయి ఇప్పుడు వచ్చి నా అత్తమామ, నా మొగుడు అంటుంది. రాజ్ తరుణ్‌ను నేనే హీరో చేశాను అంటుంది. ఆ ఇల్లు కూడా తనే సంపాదించిందట’’ అని వ్యంగ్యంగా మాట్లాడాడు శేఖర్ బాషా. మొత్తానికి కోకాపేటలో రాజ్ తరుణ్ పేరుపై ఇంట్లో తానే ఉంటానని రాజ్ తరుణ్ తల్లిదండ్రులను లావణ్య గెంటేసిన కూడా దీనిపై హీరో ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో ప్రేక్షకులంతా రాజ్ తరుణ్ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×