E-Paper
Advertisement

Smartphone Comparison: రియల్‌మి P4 లైట్ vs పోకో C85x vs గెలాక్సీ F70e 5G.. రూ.15000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Smartphone Comparison: రియల్‌మి P4 లైట్ vs పోకో C85x vs గెలాక్సీ F70e 5G.. రూ.15000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Realme P4 Lite 5g vs Poco C85x vs Galaxy F70e 5G Smartphone Comparison| రియల్‌మి బ్రాండ్ తాజాగా భారతదేశంలో రియల్‌మి P4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.15000 బడ్జెట్ రేంజ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇదే ధర రేంజ్‌లో పోకో C85x 5G, శాంసంగ్ గెలాక్సీ F70e 5Gతో పోటీ పడుతోంది. మూడు ఫోన్లు కూడా సరసమైన ధరలో మంచి ఫీచర్లు ఇస్తున్నాయి. ధర, డిస్‌ప్లే, పర్‌ఫామెన్స్, బ్యాటరీ, కెమెరా పరంగా భిన్నంగా ఉన్నాయి.

ధరల పోలిక

రియల్‌మి P4 లైట్ 5G: 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999, 4GB ర్యామ్+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999, 6GB ర్యామ్+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999.
పోకో C85x 5G: 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999, 4GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999.
శాంసంగ్ గెలాక్సీ F70e 5G: 4GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999, 6GB ర్యామ్+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999.
తక్కువ ధరతో పోకో బెటర్ ఆప్షన్.

డిస్‌ప్లే ఫీచర్లు

రియల్‌మి P4 లైట్ 5Gలో 6.8 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది.
పోకో C85x 5Gలో 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రేట్, 810 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది.
శాంసంగ్ గెలాక్సీ F70e 5Gలో 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రేట్, 800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది.
144Hz రేట్ వల్ల రియల్‌మి స్క్రోలింగ్, గేమింగ్‌లో స్మూత్‌గా ఉంటుంది.

బ్యాటరీ, ఛార్జింగ్

రియల్‌మి P4 లైట్ 5Gలో 7000mAh పెద్ద బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది.
పోకో C85x 5Gలో 6300mAh బ్యాటరీ, 15W ఛార్జింగ్ ఉంది.
శాంసంగ్ గెలాక్సీ F70e 5Gలో 6000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది.
బ్యాటరీ లైఫ్‌లో రియల్‌మి ముందుంది, శాంసంగ్ త్వరగా ఛార్జ్ అవుతుంది.

సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్

రియల్‌మి P4 లైట్ 5G Android 16 + Realme UI 7.0తో వస్తుంది.
పోకో C85x 5G Android 16 + HyperOSతో వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ F70e 5G Android 16 + One UI 8తో వస్తుంది.
శాంసంగ్ సాఫ్ట్‌వేర్ స్థిరత్వం, అప్‌డేట్స్‌లో ముందుంది.

పర్‌ఫామెన్స్, ప్రాసెసర్

రియల్‌మి P4 లైట్ 5G, శాంసంగ్ గెలాక్సీ F70e 5G రెండింటిలోనూ మిడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉంది. డైలీ యూజ్, లైట్ గేమింగ్‌కు బాగుంటుంది.
పోకో C85x 5Gలో Unisoc T8300 ఉంది. పర్‌ఫామెన్స్ కాస్త స్లోగా ఉంటుంది.
డైమెన్సిటీ 6300 ఎఫిషియెన్సీ, పవర్‌లో బెటర్ కాబట్టి రియల్‌మి, శాంసంగ్ స్వల్ఫ ఆధిక్యంలో ఉన్నాయి.

కెమెరా పోలిక

రియల్‌మి P4 లైట్ 5G: 13MP రియర్, 5MP సెల్ఫీ కెమెరాలున్నాయి.
పోకో C85x 5G: 32MP ప్రైమరీ రియర్, 8MP సెల్ఫీ కెమెరాలున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ F70e 5G: 50MP ప్రైమరీ + 2MP డెప్త్, 8MP సెల్ఫీ కెమెరాలున్నాయి.
కెమెరా పరంగా శాంసంగ్ బెస్ట్.

కనెక్టివిటీ ఫీచర్లు

మూడు ఫోన్లలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, USB Type-C ఉన్నాయి. పోకోలో బ్లూటూత్ 5.4, FM రేడియో అదనంగా ఉంది. మూడింటిలోనూ 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉంది.

Also Read: కస్టమర్లతో ఆడుకుంటున్న చైనా కంపెనీలు.. పేరు మార్చి సేమ్ ఫీచర్స్‌గల వేర్వేరు మొబైల్స్ లాంచ్

ఏది కొనుగోలు చేయాలి?

పెద్ద బ్యాటరీ, స్మూత్ డిస్‌ప్లే కావాలంటే రియల్‌మి P4 లైట్ 5G బెస్ట్.
తక్కువ ధరలో మంచి ఫీచర్లు కావాలంటే పోకో C85x 5G సరిపోతుంది.
మంచి కెమెరా, బ్యాలెన్స్‌డ్ పర్‌ఫామెన్స్ కావాలంటే శాంసంగ్ గెలాక్సీ F70e 5G ఎంచుకోండి.
రూ.15,000 లోపు శాంసంగ్ గెలాక్సీ F70e 5G మొత్తంగా బెస్ట్ బ్యాలెన్స్‌డ్ ఆప్షన్.

ముఖ్య గమనిక: ఈ కథనంలో మీకు తెలిపిన వేర్వేరు స్మార్ట్‌ఫోన్ల ధరలు.. ఆయా కంపెనీలు ప్రకటించే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. మీ అవసరాలకు తగిన ఫోన్ కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా  పరిశీలించి కొనుగోలు చేయాలని సూచన. ఈ కథనంలో పేర్కొన్న మూడు ఫోన్ల ధరలు మీరు కొనుగోలు చేసే సమయానికి మారిపోయి ఉండవచ్చు. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు. కేవలం మీ అవగాహన కోసమే ఈ వివరాలు ఉన్నాయి.

Related News

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇంటర్నెట్ లేకున్నా లోకల్ PCలో ఏఐ ఫీచర్లు.. ఎలాగో తెలుసా?

ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!

అబ్బా ఏం ఆఫర్..శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఇక మీదే ఆలస్యం!

సైలెంట్‌గా మొబైల్ మార్కెట్‌లో దిగిన Honor X7e.. ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కుయండి!

Big Stories

×