E-Paper
Advertisement

Historical movie ott : రాబిన్ హుడ్ లా మారే కాళీమాత భక్తుడు… బ్రిటీషోళ్ళకే భయం పుట్టించే బందిపోటు

Historical movie ott : రాబిన్ హుడ్ లా మారే కాళీమాత భక్తుడు… బ్రిటీషోళ్ళకే భయం పుట్టించే బందిపోటు
Advertisement

Historical Movie ott : ఓటీటీలలో ఎప్పుడూ యాక్షన్ లేదా థ్రిల్లర్ సినిమాలను చూసి చూసి విసిగిపోయారా ? అయితే ఈ మూవీ మీ కోసమే. ఇదొక ఎపిక్ పీరియాడిక్ డ్రామా. కేవలం హిస్టారికల్ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రమే కాదు యాక్షన్ థ్రిల్లర్ ప్రియులకు కావాల్సిన ఎలిమెంట్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. మరి ఇంతకీ ఈ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

హోయిచోయ్ ఓటీటీలో స్ట్రీమింగ్

2025లో బెంగాలీ భాషలో వచ్చిన ఎపిక్ పీరియడ్ యాక్షన్-డ్రామా ‘రఘు డకాత్’ (Raghu Dakat). ధ్రువో బెనర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ 19వ శతాబ్దంలో బ్రిటిష్ కాలనీయల్ రూల్ సమయంలో ఇండిగో రివోల్ట్ (నీలం సాగు వ్యతిరేక తిరుగుబాటు) నేపథ్యంలో జరిగే ఫిక్షనల్ స్టోరీ. మెయిన్ రోల్‌లో దేవ్ (Raghu Dakatగా), అనిర్బన్ భట్టాచార్య, సోహిని సర్కార్, రూప గంగూలీ తదితరులు నటించారు. రాబిన్‌హుడ్ లాంటి లెజెండ్‌ రఘు డకాత్ స్టోరీని రీ-ఇమాజిన్ చేసి తీసిన ఈ సినిమాలో… రిచ్‌ పీపుల్ ను కొల్లగొట్టి పేద వాళ్ళకు సాయం చేస్తాడు హీరో. ప్రస్తుతం ఈ మూవీ హోయిచోయ్ (Hoichoi) అనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…

Advertisement

19వ శతాబ్దంలో స్టోరీ సాగుతుంది. బెంగాల్‌ లో బ్రిటిష్ ఇండిగో ప్లాంటర్స్, స్థానిక జమీందార్లు (జమీందార్ అహింద్ర బర్మన్ – అనిర్బాన్ భట్టాచార్య) ఉంటారు. వీరిద్దరూ రైతులతో బలవంతంగా నీలం పంట పండించే ఒప్పందాలు చేస్తారు. దీనికి ఒప్పుకోని రైతుల రక్తంతో సంతకాలు తీసుకుంటారు. టాక్స్‌ల పేరుతో చిత్రహింసలు పెడతారు. ఈ క్రమంలో తమ మాటకు ఎదురు చెప్పిన ఒక రైతును బహిరంగంగా ఉరి తీయమని ఆదేశిస్తారు.

అదే టైమ్ లో రఘు డకాత్ (దేవ్) దూసుకొచ్చి, బ్రిటిష్ వాళ్ళతో పాటు జమీందార్ సైన్యాన్ని చితగ్గొడతాడు. నిజానికి అతను కాళీ దేవి భక్తుడు. కానీ ధనికులను కొల్లగొట్టి పేద రైతులకు, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్లకు సాయం చేస్తాడు. అయితే హీరోకి దకట్ మా (Roopa Ganguly) అనే అమ్మాయి సపోర్ట్ చేస్తుంది. వీళ్ళకు సపోర్ట్ గా మరికొంత మంది కూడా ఉంటారు. రఘు ఒక సాధారణ దొంగ నుంచి లెజెండరీ హీరోగా, పేదల పాలిట దేవుడిగా మారతాడు. బ్రిటిష్ జమీందార్ల అరాచకంపై తిరుగుబాటు చేస్తాడు. ఇందులో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ మూమెంట్స్‌ ఉండడంతో మూవీ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హిస్టారికల్, పీరియాడిక్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. కాబట్టి డోంట్ మిస్.

Advertisement

Also Read : ‘ఇంపర్ఫెక్ట్ ఉమెన్’ నుండి ‘మార్గోస్ గాట్ మనీ ట్రబుల్స్’ వరకు… 2026లో రిలీజ్ కానున్న మోస్ట్ అవైటింగ్ సిరీసులు

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×