E-Paper
Advertisement

అమెరికా అధ్యక్షుడినే చంపేంత ధైర్యమా? చరిత్రలో ఎవరూ చెప్పని నిజాలు!

అమెరికా అధ్యక్షుడినే చంపేంత ధైర్యమా? చరిత్రలో ఎవరూ చెప్పని నిజాలు!
Advertisement

Historical Mystery Series : అమెరికా చరిత్రలో ఇప్పటివరకు మొత్తం నలుగురు అధ్యక్షులు పదవిలో ఉండగానే హత్యకు గురయ్యారు. వీరిలో 1865లో థియేటర్‌లో కాల్చి చంపబడిన అబ్రహం లింకన్, 1881లో రైల్వే స్టేషన్‌లో దాడికి గురైన జేమ్స్ ఏ. గార్ఫీల్డ్, 1901లో కాల్పులకు గురైన విలియం మెకిన్లీ, 1963లో ఊరేగింపులో కాల్చి చంపబడిన జాన్ ఎఫ్. కెన్నెడీ ఉన్నారు. ఒక్కో హత్య ఒక్కో మిస్టరీగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో అమెరికా 20వ అధ్యక్షుడు జేమ్స్ ఏ. గార్ఫీల్డ్ జీవితం అతని హత్య చుట్టూ తిరిగే ఓ సిరీస్ ఓటీటీలో ఆకట్టుకుంటోంది. ఇందులో గార్ఫీల్డ్ అధ్యక్షుడిగా ఎదగడం, మానసిక స్థితి సరిగా లేని చార్లెస్ గిటో అనే వ్యక్తి అతన్ని ఎలా చంపాడనేది ఇందులో చూపించారు.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ హిస్టారికల్ మిస్టరీ సిరీస్ పేరు ‘డెత్ బై లైట్నింగ్’ (Death by Lightning). ఇది క్యాండిస్ మిల్లార్డ్ రాసిన ‘డెస్టినీ ఆఫ్ ది రిపబ్లిక్’ అనే పుస్తకం ఆధారంగా రూపొందింది. ఇందులో ప్రధాన పాత్రల్లో మైఖేల్ షానన్ (జేమ్స్ గార్ఫీల్డ్), మాథ్యూ మాక్‌ఫాడియన్ (చార్లెస్ గిటో) నటించారు. ఈ ప్రాజెక్టుకు ప్రసిద్ధ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సృష్టికర్తలు డేవిడ్ బెనియోఫ్, డి.బి. వైస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించడం విశేషం. ఇది మొత్తం 4 ఎపిసోడ్‌లతో 2025 నవంబర్ 6న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ టాప్ 10 జాబితాలో చేరి, 2025లో అత్యధికంగా వీక్షించిన హిస్టారికల్ డ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సిరీస్ షూటింగ్ ప్రధానంగా హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగినప్పటికీ, 19వ శతాబ్దపు అమెరికా వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. దీనికి రామిన్ జవాడి అందించిన సంగీతం, మాట్ రాస్ దర్శకత్వం కథలోని ఉత్కంఠను అద్భుతంగా పండించాయి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ రియల్ స్టోరీ1880వ నాటి కాలంలో అమెరికాలో జరుగుతుంది. జేమ్స్ ఏ. గార్ఫీల్డ్ అనే వ్యక్తికి అసలు అధ్యక్షుడు కావాలనే కోరిక ఉండదు, కానీ ప్రజల మద్దతుతో ఆయన అనూహ్యంగా 20వ అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ఆయన చాలా నిజాయితీపరుడు, దేశం కోసం ఏదో చేయాలని తపన పడే వ్యక్తి. అయితే అదే సమయంలో చార్లెస్ గిటో అనే ఒక వింత వ్యక్తి, తన వల్లే గార్ఫీల్డ్ గెలిచాడని భ్రమపడుతుంటాడు. తనకు ప్రతిఫలంగా ఏదో ఒక పెద్ద ప్రభుత్వ పదవి ఇవ్వాలని పట్టుబట్టి గార్ఫీల్డ్ చుట్టూ తిరుగుతుంటాడు. కానీ గార్ఫీల్డ్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరికీ పదవులు ఇవ్వనని తేల్చి చెప్పడంతో గిటోలో పగ పెరుగుతుంది. తనను అవమానించారని భావించి, ఎలాగైనా అధ్యక్షుడిని అంతం చేయాలని ఒక పిచ్చి నిర్ణయానికి వస్తాడు.

దేవుడే తనకు ఈ పని అప్పగించాడని నమ్ముతూ, ఒక రైల్వే స్టేషన్‌లో గార్ఫీల్డ్‌పై కాల్పులు జరుపుతాడు. ఈ సంఘటన అమెరికా రాజకీయాలను ఒక్కసారిగా షేక్ చేస్తుంది. అయితే గార్ఫీల్డ్ ఆ తుపాకీ గుళ్లకు వెంటనే చనిపోరు. కానీ ఆ కాలంలో వైద్య పరిజ్ఞానం తక్కువగా ఉండటం వల్ల, డాక్టర్లు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఆయన శరీరంలోని బుల్లెట్‌ను తీయడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకి గార్ఫీల్డ్ ఆరోగ్యం క్షీణించి చివరకు ప్రాణాలు కోల్పోతారు. ఒక పిచ్చివాడి మొండితనం, అప్పటి వైద్య లోపాల వల్ల ఒక మంచి నాయకుడు ఎలా బలి అయ్యాడనేదే ఈ సిరీస్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.

Advertisement

Read Also : ఇదెక్కడి సినిమా బాబోయ్… ఊరు ఊరంతా జాంబిలు… ఇక్కడ బతకడం చావు కన్నా దారుణం

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×