E-Paper
Advertisement

ఇదెక్కడి సినిమా బాబోయ్… ఊరు ఊరంతా జాంబిలు… ఇక్కడ బతకడం చావు కన్నా దారుణం

ఇదెక్కడి సినిమా బాబోయ్… ఊరు ఊరంతా జాంబిలు… ఇక్కడ బతకడం చావు కన్నా దారుణం
Advertisement

Horror Thriller OTT : జాంబి అనే పేరు వింటేనే ఒక రకమైన వణుకు వస్తుంది. మరి ఇవి చేసే రచ్చ కూడా అలానే ఉంటుంది. ఈ సినిమాలలో రక్తపాతం ఏరులై పారుతుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అలానే ఉంటుంది. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ గగుర్పాటు కలిగించే ఉంటాయి. ముఖ్యంగా ఆ జాంబిలను చూస్తే గుండె ఆగినంత పని అవుతుంది. ఇది 1973 లో వచ్చిన ఒక క్లాసిక్ హారర్ సినిమాకి రీమేక్. జాంబి ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎక్కడ చూడవచ్చు అంటే

ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ పేరు ‘ది క్రేజీస్’ (The Crazies). బ్రెక్ ఈస్నర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇది 1973లో జార్జ్ ఎ. రొమేరో దర్శకత్వం వహించిన అదే పేరుతో ఉన్న సినిమాకు రీమేక్. ఇందులో తిమోతీ ఒలిఫాంట్, రాధా మిచెల్, జో ఆండర్సన్, డేనియల్ పనాబేకర్ లీడ్ రోల్స్ లో నటించారు. 1973లో అసలు సినిమా తీసిన లెజెండరీ డైరెక్టర్ జార్జ్ ఎ. రొమేరో ఈ 2010 సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం. ఈ సినిమాను సుమారు $20 మిలియన్ల ఖర్చుతో తీశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు $55 మిలియన్లు వసూలు చేసి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. హారర్ సినిమాల్లో ఇది ఒక సక్సెస్‌ఫుల్ రీమేక్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రస్తుతం prime video, Apple tvలలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఒక ప్రశాంతమైన ఊరులో ఉన్న జనం హాయిగా బతుకుతుంటారు. ఒకరోజు ఆ ఊరి చెరువులో మిలిటరీ వాళ్ల విమానం ఒకటి కూలిపోద్ది. అందులో మనుషుల్ని పిచ్చోళ్లను చేసే ఒక రకమైన విషపూరితమైన వైరస్ ఉంటుంది. ఆ నీళ్లు తాగిన ఊరి జనం మెల్లమెల్లగా జాంబి లాగా పిచ్చెక్కిపోతారు. ఇక మామూలుగా ఉన్నోళ్లు కాస్తా, ఆ నీళ్ళు తాగి ఒక్కసారిగా దెయ్యం పట్టినట్టు మారిపోతారు. చేతికి దొరికిన కత్తితోనో, గొడ్డలితోనో పక్కనోళ్లని నరికేస్తుంటారు. సొంత పెళ్లాం పిల్లలని కూడా వదలకుండా చంపేసేంత కిరాతకులుగా మారిపోతారు. ఊర్లో పరిస్థితి చేయి దాటిపోతుంటే, గవర్నమెంట్ మిలిటరీ వాళ్లను పంపిస్తుంది. ఆ సైన్యం వచ్చి ఊరి చుట్టూ కంచె వేసి, ఎవ్వరినీ బయటికి పోనివ్వకుండా అడ్డుకుంటుంది.

ఇక ఆ రోగం వచ్చినోళ్లని, రానివాళ్లని తేడా లేకుండా అందరినీ కాల్చి పారేస్తుంటారు మిలిటరీ వాళ్ళు. ఊరంతా వల్లకాడులా మారిపోతుంది. ఒక పక్క జాంబిలుగా మారిన జనం, ఇంకో పక్క కనికరం లేని మిలిటరీ.. ఈ రెండిటి మధ్య ఊరి ప్రెసిడెంట్ డేవిడ్, అతని ప్రెగ్నెంట్ భార్య చిక్కుకుపోతారు. వీళ్లు ఎలాగైనా ఆ నరకం నుండి బయటపడాలని డిసైడ్ అవుతారు. దారి పొడవునా పిచ్చెక్కిన వాళ్లు మీద పడుతుంటే, వాళ్లని చంపుకుంటూ ప్రాణాలకు తెగించి పారిపోతుంటారు. చివరకు మిలిటరీ వాళ్లు ఆ ఊరిని బాంబులతో పేల్చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ బాంబు పడకముందే, ఆ ఊరి పొలిమేరలు దాటి వీళ్లు ఎలా ప్రాణాలతో బయటపడ్డారు అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : పిజ్జా దొరకకపోతే ప్రాణాలు పోయేలా… ప్రతి పదిహేను నిమిషాలకు మారే వింత

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×