E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

మౌనంగా మొదలై మనసుల్ని గెలిచిన ప్రేమ… స్క్రీన్ మీద మెరిసిన విజువల్ వండర్… ఐయండిబిలో 8 రేటింగ్

మౌనంగా మొదలై మనసుల్ని గెలిచిన ప్రేమ… స్క్రీన్ మీద మెరిసిన విజువల్ వండర్… ఐయండిబిలో 8 రేటింగ్
Advertisement

Historical romantic drama : హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలు మంచి ఎనర్జీని ఇస్తాయి. వీటిలో లవ్ ట్రాక్ కోసం ప్రత్యేకమైన సీన్లు ఉంటాయి. కొంచెం బోల్డ్ గా ఉన్నా ఆడియన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తుంటారు చూసి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కథ, ఇద్దరమ్మాయిల ప్రేమ చుట్టూ తిరుగుతుంది. 18వ శతాబ్దపు చివరలో ఫ్రాన్స్‌లోని ఒక మారుమూల ద్వీపంలో ఈ కథ జరుగుతుంది. ఇది ఒక క్లాసిక్ లవ్ స్టోరీ. ఆడంబరాలు, ఫైట్లు, హడావుడి ఏమీ లేకుండా.. చాలా నిమ్మళంగా, గుండెకు హత్తుకునేలా సాగే సినిమా ఇది. మాటల కంటే చూపులతోనే ఎక్కువ కథ నడుస్తుంది. కమర్షియల్ హంగులు ఆశించకుండా, మనసు పెట్టి చూస్తే మాత్రం ఈ సినిమా క్లైమాక్స్ గుండెల్ని పిండేస్తుంది. దీనికి ఐయండిబిలో 8 రేటింగ్ కూడా ఉంది.

ఎక్కడ చూడచ్చు అంటే

2019లో వచ్చిన ఈ హిస్టారికల్ రొమాంటిక్ మూవీ పేరు ‘పోర్ట్రెయిట్ ఆఫ్ ఏ లేడీ ఆన్ ఫైర్’ (Portrait of a Lady on Fire). సెలిన్ సియమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకురాలు సెలిన్ సియమ్మ, హీరోయిన్ అడెల్ హానెల్ (హెలోయిస్ పాత్ర) గతంలో రియల్ గా ప్రేమించుకున్నారు కూడా. వాళ్ళు విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా ఉంటూ ఈ సినిమా కోసం కలిసి పనిచేశారు. అందువల్లే ఈ సినిమాలో ఆ కెమిస్ట్రీ అంత బాగా పండింది. ఇక ఈ సినిమాలో ఎక్కడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు. కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే సంగీతం వినిపిస్తుంది. ఈ సినిమాలో మరియన్ పాత్ర గీసే చిత్రపటాలన్నీ నిజానికి హెలెన్ డెల్మైర్ అనే ఆర్టిస్ట్ గీసినవి. షూటింగ్ సమయంలో ఆమె ప్రతిరోజూ 16 గంటల పాటు పెయింటింగ్ వేసేవారు. సినిమాలో పెయింటింగ్ వేస్తున్నట్లు కనిపించే చేతులు కూడా ఆమెవే. ఈ సినిమా ప్రస్తుతం Mubi, prime వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే 

Advertisement

ఇది 1770ల కాలంలో ఫ్రాన్స్‌లో జరిగే కథ. మరియన్ అనే ఒక చిత్రకారిణి, హెలోయిస్ అనే డబ్బున్న యువతి పెళ్లి కోసం ఒక చిత్రపటాన్ని గీయడానికి తను ఉండే ద్వీపానికి వెళ్తుంది. అయితే హెలోయిస్‌కు ఆ పెళ్లి ఇష్టం ఉండదు. కాబట్టి ఆమె చిత్రపటం గీయించుకోవడానికి ఒప్పుకోదు. దీంతో మరియన్ ఒక స్నేహితురాలిగా నటిస్తూ, రోజంతా ఆమెను గమనించి, రాత్రిపూట రహస్యంగా ఆమె చిత్రాన్ని గీస్తూ ఉంటుంది. ఇలా ఒకరినొకరు గమనించుకునే క్రమంలో ఆ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవడం, మనసు విప్పి మాట్లాడుకోవడంతో మ్యాటర్ సీరియస్ అవుతుంది.

ఇక ఆ ఇంట్లో ఎవరూ లేని టైంలో వీళ్ళిద్దరూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. ఆ బీచ్‌ల చుట్టూ వీళ్ళిద్దరి మధ్య ఒక రేంజ్ లో యవ్వారం నడుస్తుంది. అసలు ఆ పెయింటింగ్ గీసే ప్రాసెస్‌లో ఒకరినొకరు ఎంతలా ప్రేమించుకుంటారంటే, అది మాటల్లో చెప్పలేం. ఇంతలోనే హెలోయిస్ కి పెళ్లి సంబంధం సెట్ అయిపోతుంది. మరియన్ గీసిన పెయింటింగ్ అయిపోగానే, ఇక విడిపోయే టైం వస్తుంది. చివరికి వీళ్ళు విడిపోతారా ? హెలోయిస్ కి పెళ్లి జరుగుతుందా ? ఈ క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ప్రేమలో మోసపోయి హత్య కేసులో చిక్కుకున్న అమ్మాయి… క్లైమాక్స్ వరకు అంతుచిక్కని మిస్టరీ

Tags

Related News

వీకెండ్ ఓటీటీలో వినోదం.. ఆ మూడు వెరీ స్పెషల్.. డోంట్ మిస్…

హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 5 సినిమాలు… ఒక్కటి కూడా మిస్ కావొద్దు భయ్యా

ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేదా… డోంట్ వర్రీ ఈ 5 అద్భుతమైన సినిమాలు ఫ్రీగానే చూడవచ్చు

ప్రతి ఎపిసోడ్ 9.7 రేటింగ్… విజయం సాధించడానికి చెల్లించాల్సిన భారీ మూల్యం

నెట్ ఫ్లిక్స్ ను శాసిస్తున్న రూ.4566 కోట్ల మూవీ… ఇంకా చూడలేదా ?

‘ది వాకింగ్ డెడ్: డారిల్ డిక్సన్ సీజన్ 4’ లోడింగ్… క్రేజీ హింట్ ఇచ్చిన హీరో

విదేశాలకు వెళ్ళే వాళ్లే టార్గెట్… అవయవాల అక్రమ రవాణాతో హార్ట్ ఎటాక్ తెప్పించే సినిమా

చూడకూడని సీన్స్ లేవు… కడుపుబ్బా నవ్వించే కామెడీ… ఫ్యామిలీ ఆడియన్స్ కు మస్త్ మజా

Big Stories

×