E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 22: ఆ రాశి వారికి దూర ప్రయాణంలో లాభం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 22: ఆ రాశి వారికి దూర ప్రయాణంలో లాభం

Today Horoscope: 

Advertisement

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 22వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను దైర్యంగా పరిష్కరించుకుంటారు. 

వృషభం

Advertisement

కొన్ని వ్యవహారాలలో ఆప్తులతో వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. 

మిథునం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 

కర్కాటకం

Advertisement

ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పరిచయాలు విస్తృతమౌతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

సింహం

కొన్ని వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో ద్విస్వభావ ఆలోచనలు చేసి ఇబ్బంది పడతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. 

కన్య

నూతన రుణ యత్నాలు కొంత కష్టంతో పూర్తి అవుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు కొంత సామాన్యంగా లాభిస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనిలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ పెద్దలతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి,ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం

ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. 

ధనుస్సు

ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన విద్యా విషయాలు నిరాశపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.  

మకరం

దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. 

కుంభం

ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. మిత్రుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

మీనం

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. రుణ దాతలు నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Big Stories

×